గ్రేసీ గోస్వామి | |
---|---|
జననం | [1] | 2003 మే 31
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2014 – ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | బాలికా వధు క్యూన్ ఉత్తే దిల్ చోడ్ ఆయే |
గ్రేసీ గోస్వామి (జననం 2003 మే 31) ప్రధానంగా హిందీ టెలివిజన్, చిత్రాలు చేసే భారతీయ నటి. ఆమె 2014లో టీవీ ధారావాహిక బంధన్‌లో పింకీ పాటిల్ పాత్రతో అరంగేట్రం చేసింది. ఆమె బాలికా వధులో నందిని శేఖర్, క్యూన్ ఉత్తే దిల్ చోడ్ ఆయేలో అమృత్ సహాని పాత్రలతో బాగా ప్రసిద్ధి చెందింది.[2]
ఆమె 2017లో బేగం జాన్‌తో సినీ రంగ ప్రవేశం చేసింది. 2021 వెబ్ సిరీస్ ది ఎంపైర్‌లో యంగ్ ఖాంజదా బేగం పాత్ర పోషించింది.
గతంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారునిగా పనిచేసిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) మాజీ సభ్యుడు పాపారావు బియ్యాల నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం మ్యూజిక్ స్కూల్ లో గ్రేసీ గోస్వామి ప్రధాన పాత్రలో నటించింది. ఈ ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం 2023 మే 12న విడుదల కానుంది.[3][4]
గ్రేసీ గోస్వామి 2003 మే 31న గుజరాత్‌లోని వడోదరలో జన్మించింది.[5]
2014లో 11 సంవత్సరాల వయస్సులో ఆమె సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ సిరీస్ బంధన్‌లో పింకీ పాటిల్‌గా నటన ప్రారంభించింది.[6] ఆ తరువాత కలర్స్ టీవీ సిరీస్ బాలికా వధు, డ్యాన్స్ రియాలిటీ షో ఝలక్ దిఖ్లా జా 8లో పాల్గొన్నది.[7][8] 2017లో, ఆమె శ్రీజిత్ ముఖర్జీ పీరియాడిక్ ఫిల్మ్ బేగం జాన్‌తో తన సినీ రంగ ప్రవేశం చేసింది. అదే సమయంలో ఆమె క్రైమ్ డ్రామా క్రైమ్ పెట్రోల్ ఎపిసోడ్లో శిల్పి రాణేగా నటించింది.[9] ఆమె స్టార్ భారత్ మాయావి మాలింగ్లో యువరాణి గరిమా పాత్రను పోషించింది. 2020లో, ఆమె అనుభవ్ సిన్హా సామాజిక నాటకం తప్పడ్లో సానియా పాత్రలో మెరిపించింది.[10]
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
{{cite web}}
: CS1 maint: url-status (link)
{{cite web}}
: CS1 maint: url-status (link)