చంద్రకాంత్ ఖైరే

చంద్రకాంత్ ఖైరే (జననం 1 జనవరి 1952) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు మహారాష్ట శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసి, ఆ తరువాత నాలుగుసార్లు ఔరంగాబాద్ నియోజకవర్గం నుండి  లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఖైరే 1 జనవరి 1952న మహారాష్ట్ర రాష్ట్రం, ఔరంగాబాద్‌లో భౌరావ్ ఖైరే, వత్సలా దంపతులకు జన్మించాడు. ఆయన మరఠ్వాడా విశ్వవిద్యాలయం నుండి పర్సనల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా పూర్తి చేశాడు. ఖైరే 5 జనవరి 1975న కస్తూరి చౌదరిని వివాహం చేసుకున్నాడు, వీరికి ఇద్దరు కుమారులు & ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[1]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 1985 : వ్యవస్థాపక సభ్యుడు, శివసేన పార్టీ, మరాఠ్వాడా
  • 1988 : కార్పొరేటర్, మున్సిపల్ కార్పొరేషన్, గుల్మండి వార్డ్, ఔరంగాబాద్
  • 1988-90 : ప్రతిపక్ష నాయకుడు, మున్సిపల్ కార్పొరేషన్, ఔరంగాబాద్
  • 1990-99 : సభ్యుడు, మహారాష్ట్ర శాసనసభ (రెండు పర్యాయాలు)
  • 1992-95 : సభ్యుడు, అంచనాల కమిటీ, మహారాష్ట్ర శాసనసభ
  • 1992-1995 : సంపర్క్ ప్రముఖ్, శివసేన పార్టీ, ఔరంగాబాద్
  • 1995-1997 : కేబినెట్ మంత్రి, హౌసింగ్, స్లమ్ ఇంప్రూవ్‌మెంట్ మరియు అర్బన్ ల్యాండ్ సీలింగ్, మహారాష్ట్ర
  • 1997-1998 : క్యాబినెట్ మంత్రి, రవాణా, మహారాష్ట్ర
  • 1998-1999 : కేబినెట్ మంత్రి, పర్యావరణం, మహారాష్ట్ర
  • 1995-1999 : సంరక్షక మంత్రి, ఔరంగాబాద్ జిల్లా
  • 1999 : 13వ లోక్‌సభకు ఎన్నికయ్యారు (1వ పర్యాయం)
  • 2002-2004 : నాయకుడు, శివసేన పార్లమెంటరీ పార్టీ (లోక్‌సభ)
  • 2004 : 14వ లోక్‌సభకు ఎన్నికయ్యారు (2వసారి)
  • 2005 నుండి ఉప నాయకుడు, శివసేన
  • 2009 : 15వ లోక్‌సభకు ఎన్నికయ్యారు (3వసారి)
  • 2014 : 16వ లోక్‌సభకు ఎన్నికయ్యారు (4వసారి)
  • 2018: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) స్టాండింగ్ కమిటీ మెంబర్‌గా నియమితులయ్యారు
  • 2018: శివసేన పార్టీ నాయకుడిగా నియమితులయ్యారు

మూలాలు

[మార్చు]
  1. "Current Lok Sabha Members Biographical Sketch". Member of Parliament. 2 September 2004. Archived from the original on 2 September 2004. Retrieved 29 September 2019.