ఈ రాగంలో వినిపించే స్వరాలు : షడ్జమం, షట్స్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, షట్స్రుతి ధైవతం, కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 72వ మేళకర్త రాగమైన రసికప్రియ రాగానికి శుద్ధ మధ్యమ సమానం.
చలనాట రాగానికి రెండు బహుళ ప్రాచుర్యం పొందిన జన్య రాగాలు ఉన్నాయి. అవి నాట, గంభీరనాట రాగాలు. ముఖ్యంగా నాట రాగంలోని కృతులు ఎక్కువగా కచేరీలలో వినిపిస్తాయి.[3]