జగత్ కంత్రీలు (1971 తెలుగు సినిమా) | |
నిర్మాణ సంస్థ | ఎం. ఆర్. ఏ. ప్రొడక్షన్స్ |
---|---|
భాష | తెలుగు |
జగత్ కంత్రీలు 1971 ఏప్రిల్ 3న విడుదలైన రహస్య పరిశోధక ఈస్ట్ మన్ కలర్ తెలుగు సినిమా. ఎం.ఆర్.ఏ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సి.కృష్ణవేణి నిర్మించిన ఈ సినిమాకు టి.ఆర్.రామన్న దర్శకత్వం వహించాడు. జయలలిత, రవిచంద్రన్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతాన్నందించాడు.[1] జయలలిత, రవిచంద్రన్ లు నటించిన మూండ్రెజుతు (1968) అనే తమిళ చిత్రంను జగత్ కంత్రీలు అనే పేరుతో తెలుగులో అనువదించి విడుదల చేసారు.