Location | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం |
---|---|
Coordinates | 17°22′08″N 78°28′51″E / 17.368989°N 78.48087°E |
Owner | ఆర్. జె. రావు |
General Manager | ఎన్. వి. రామరాజు |
Opened | 20 May 2007 |
Operating season | మొత్తం సంవత్సరం |
Area | 12.5 ఎకరాలు (5.1 హె.) |
Website | www.jalavihar.in |
జలవిహార్ అనగా వాటర్ పార్క్, ఇది హైదరాబాదులో ఉంది. దీని విస్తీర్ణం 12.5 ఎకరాలు (5.1 హెక్టార్లు). ఈ జలవిహార్ ను సంజీవయ్య పార్క్ పక్కన, హుస్సేన్ సాగర్ సరస్సు వెంబడి 20 మే 2007న ప్రారంభించారు.
ప్రవాస భారతీయుడు ఆర్.జె.రావు, వ్యక్తుల సమూహం స్థానిక పర్యాటక శాఖతో ఒక పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిన ₹220 మిలియను (US$2.8 million) నిధులు సమకూర్చారు. ఈ శాఖ నెక్లెస్ రోడ్ లో హుస్సేన్ సాగర్ సరస్సును ఆనుకొనివున్న 12.5 ఎకరాల (5.1 హెక్టార్లు) భూమిని ఈ ప్రాజెక్ట్ కొరకు మంజూరు చేసింది. ఈ భూమిని 33 సంవత్సరాలకు ఒప్పందానికి వార్షిక వ్యయం ₹3.4 మిలియను (US$43,000), 5% మొత్తం స్థూల ఆదాయాలతో ఏర్పాటు చేయబడింది. ఈ యేర్పాట్లు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సమీక్షించవలసి యుంటుంది[1]
ఈ భూమిని 2000 సంవత్సరంలో నారా చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నున్న సమయంలో యిచ్చినప్పటికీ ఈ భూములలో ఆక్రమణలు, యాజమాన్య సమస్యల కారణంగా పనులు నిలిపివేయబడ్డాయి.[2] ఆ తర్వాత స్థానిక ప్రభుత్వం ప్రాజెక్టులు కేటాయించుటకు ప్రోబ్ పద్ధతిని ప్రారంభించింది[3] . ఈ ప్రాజెక్టును 2006 మధ్య కాలంలో ప్రారంభించడానికి భారతదేశ సుప్రీం కోర్టు అనుమతి తెలిపింది. ఈ అనుమతి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతుల ఆధారంగా సుప్రీం కోర్టు అంగీకరించింది.[4]
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ఫలితంగా హెచ్చు లాభదాయకత కారణంగా స్థానిక ప్రభుత్వం ఈ పాజెక్టు విధానాన్ని 2010లో కొనసాగించుటకు ప్రతిపాదించింది[5].
యిటీవల జూలై 2013లో సామాజిక మార్కెటింగ్, ఆన్‌లైన్ అభివృద్ధి కంపెనీలు జలవిహార్ లో ఉద్యోగాలను కంపెనీ వెబ్‌సైట్ లో ఉంచుతున్నారు. ఆన్‌లైన్ మార్కెటింగ్, సామాజిక మార్కెటింగ్ కొరకు వెబ్‌సైట్ లో పొందుపరచునున్నారు. యిరుపక్షాల మధ్య ఒప్పందం ఐదు సంవత్సరాలవరకు కొనసాగుతుంది.
ఈ పూల్ మన దేశంలోనే అతిపెద్దది. దీని విస్తీర్ణం 18000 చ.అడుగులు. దీనిలో 1000 మంది ప్రజలకు సదుపాయాన్ని కల్పించే విధంగా నిర్మించబడింది[1]. మొత్తం పార్కులో నిర్మాణ వైశాల్యం 10% మాత్రమే ఉంది. హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న చెత్తను నివారించడానికి జలవిహార్ చుట్టూ సరైన ఫెన్సింగ్ ఉంచడం జరిగింది. ఈ పార్కులో ముఖ్యంగా రెండు జోన్లు కలవు -- అవి వినోదం, పార్టీ. ఇందులో వేవ్ పూల్, డ్రై రైడ్స్, మిని ట్రైన్, ఫుడ్ కోర్టులు ఉన్నాయి. పార్టీ జోన్ ల 2000 మంది ప్రజలు ఉండే విధంగా లాన్ ను యెర్పాటు చేయడం జరిగినది[1].