జల్ మిస్త్రీ | |
---|---|
జననం | 1923 |
మరణం | 2000 (aged 76–77) |
వృత్తి | సినిమాటోగ్రాఫర్ |
క్రియాశీల సంవత్సరాలు | 1949 - 2000 |
బంధువులు | ఫాలి మిస్త్రీ (అన్న) |
జల్ మిస్త్రీ, (1923-2000) హిందీ సినిమా ఛాయాగ్రాహకుడు. దర్శకుడు చేతన్ ఆనంద్ తో, నవకేతన్ ఫిల్మ్స్‌తో కలిసి ఆఖరీ ఖత్ (1966), హీర్ రాంజా (1970), కుద్రాట్ (1981) మొదలైన సినిమాలకు పనిచేశాడు.[1] రాజ్ కపూర్ దర్శకత్వం వహించిన బర్సాత్ (1949), మన్మోహన్ దేశాయ్ దర్శకత్వం వహించిన నసీబ్ (1981) వంటి విజయవంతమైన సినిమాలకు కూడా పనిచేశాడు. రాజ్ ఖోస్లాతో కలిసి దేవ్ ఆనంద్ నటించిన బొంబాయి కా బాబు (1960) సినిమాను నిర్మించాడు.
జల్ మిస్త్రీ 1923లో జన్మించాడు, 2000లో మరణించాడు.
అన్నయ్య ఫాలి మిస్త్రీ (1917-1979) తో పాటు, మిస్త్రీ సోదరులు హిందీ సినిమారంగంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.[2][3] కమల్ అమ్రోహి రూపొందించిన క్లాసిక్ సినిమా పాకీజా (1972) ప్రధాన సినిమాటోగ్రాఫర్ జోసెఫ్ విర్స్చింగ్ అందుబాటులో లేని సమయంలో ఇతడు కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించాడు.[4]
బహరోన్ కే సాప్నే (1968), హీర్ రాంజా (1971), జీల్ కే ఉస్ పార్ (1974), కుద్రాట్ (1982) మొదలైన సినిమాలకు ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా నాలుగు ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్నాడు.[3]
..the immensely talented cinematographer duo, the Mistry brothers Fali and Jal,..