పూర్వపు నామము | నాగార్జున సాగర్ ఇంజనీరింగ్ కాలేజీ |
---|---|
ఆంగ్లంలో నినాదం | గేట్‌వే టు ఎక్సలెన్స్ |
రకం | పబ్లిక్ యూనివర్సిటీ |
స్థాపితం | 1972 |
విద్యాసంబంధ అనుబంధం | యూజీసీ |
ఛాన్సలర్ | విష్ణుదేవ్ వర్మ (తెలంగాణ గవర్నర్) |
వైస్ ఛాన్సలర్ | బాల కిష్టారెడ్డి - ఇన్‌ఛార్జి వీసీ |
స్థానం | కూకట్పల్లి, హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం 17°29′34″N 78°24′19″E / 17.492680°N 78.405390°E |
భాష | English |
జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ( జె ఎన్ టి యు అనగా Jawaharlal Nehru Technological University (J.N.T.U), తెలంగాణ రాజధాని హైదరాబాదులో గల ప్రముఖ సాంకేతిక విశ్వవిద్యాలయం. జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభచే దేశంలో మొట్టమొదటి సాంకేతిక విశ్వవిద్యాలయంగా 1972 అక్టోబర్ నెల 2వ తేదీన స్థాపించబడింది. తరువాత ఆగస్టు 18 నాటి 2008 ఆంధ్రప్రదేశ్ శాసనసభ 31 చట్టం మేరకు సెప్టెంబరు 2008 లో నాలుగు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో పునర్వ్యవస్థీకరించబడింది.
ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు |
---|
విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన బుర్రా వెంకటేశం ఇన్ ఛార్జి వీసీ గా పని చేశాడు.ప్రభుత్వం అతనిని టీజీ పీఎస్సీ చైర్మన్ గా నియమించడంతో ప్రభుత్వం తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు బాల కిష్టారెడ్డిని నియమించింది.
జేఎన్టీయూ హెచ్ ఇన్ ఛార్జి వీసీ గా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి నియమితులయ్యాడు. అక్టోబర్/2024లో సెర్చ్ కమిటీ సమావేశం నిర్వహించి గవర్నర్ విష్ణు దేవ్ వర్మ ఆమోదంతో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ జీవో జారీ చేశారు.
ఇక్కడికి సమీపంలో మెట్రో స్టేషను ఉంది.