దస్త్రం:Logo nssm.svg | |
![]() | |
![]() | |
Established | 30 జనవరి 2019 |
---|---|
Location | దండి, గుజరాత్, భారతదేశం |
Coordinates | 20°53′29″N 72°47′59″E / 20.89139°N 72.79972°E |
Type | స్మారక చిహ్నం |
జాతీయ ఉప్పు సత్యాగ్రహ స్మారక చిహ్నం లేదా దండి స్మారక చిహ్నం భారతదేశం లోని గుజరాత్ రాష్ట్రంలోని దండి లో నిర్మించబడిన స్మారక చిహ్నం. మహాత్మా గాంధీ నేతృత్వంలో కార్యకర్తలు 1930లో భారతదేశంలో అహింసాత్మక శాసనోల్లంఘన కార్యక్రమంలో భాగంగా ఉప్పు సత్యాగ్రహంనకు స్మారకంగా గుజరాత్ లోని దండి వద్ద ఏర్పాటు చేసారు. [1] ఈ స్మారక చిహ్నం దండి సత్యాగ్రహ సమయంలో 1930 ఏప్రిల్ 6న ముగిసిన ప్రదేశం గుజరాత్ లోని తీర పట్టణమైన దండి వద్ద 15 ఎకరాల (61,000 చదరపు మీటర్లు) విస్తీర్ణంలో ఉంది.[2] ఈ సత్యాగ్రహంలో సముద్రపు నీటితో ఉప్పును ఉత్పత్తి చేసి ఉప్పుపై బ్రిటిష్ గుత్తాధిపత్యం విచ్ఛిన్నమైంది.[1] ఈ ప్రాజెక్టు 89 కోట్లు (12 మిలియన్ల యు.ఎస్.డాలర్లు) వ్యయంతో అభివృద్ధి చేసారు.[3]
జాతీయ ఉప్పు సత్యాగ్ర స్మారకాన్ని అభివృద్ధి చేసే ఈ ప్రాజెక్టును హై లెవల్ దండి మెమోరియల్ కమిటీ (హెచ్ఎల్డిఎంసి) రూపొందించింది. దీనిని భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆమోదించింది.[4] ఐఐటి బొంబాయి డిజైన్ కోఆర్డినేషన్ ఏజెన్సీగా సేవలను అందించింది.[5] ఈ స్మారక చిహ్నాన్ని 2019 జనవరి 30 న మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.[6]
{{cite web}}
: |last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)