National Highway 14 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 306 కి.మీ. (190 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
ఉత్తర చివర | మోర్‌గ్రామ్ | |||
SH 7 నల్హతి వద్ద. SH 11 మహమ్మద్ బజార్ వద్ద. SH 6 సూరి వద్ద. SH 14 దుబ్రాజ్‌పూర్ వద్ద NH 19 పంజాబీ మోర్ వద్ద , రాణిగంజ్. SH 8 గంగాజల్‌ఘటి నుండి బంకురా వరకు. SH 9 బిక్నా నుండి గోవింద్‌పూర్ వరకు. SH 2 బంకురా, బిష్ణుపూర్ వద్ద. SH 4 చంద్రకోనా రోడ్ వద్ద. SH 7. | ||||
దక్షిణ చివర | ఖరగ్‌పూర్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | పశ్చిమ బెంగాల్ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 14 (ఎన్‌హెచ్ 14) భారతదేశంలోని జాతీయ రహదారి.[1] ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మోర్‌గ్రామ్ నుండి ఖరగ్‌పూర్ వరకు నడుస్తుంది.
ఎన్‌హెచ్14 పూర్తిగా పశ్చిమ బెంగాల్ లోనే నడుస్తుంది. ఇది ముర్షిదాబాద్ జిల్లాలోని మోర్‌గ్రామ్ వద్ద ఎన్‌హెచ్12 కూడలి వద్ద మొదలైంది. లోహాపూర్ (రహదారికి కొద్దిగా దూరంగా), నల్హతి, రాంపూర్హాట్, మల్లార్పూర్, గోన్పూర్, డ్యూచా, మహ్మద్ బజార్, మయూరాక్షి నదిపై ఉన్న తిల్పారా బ్యారేజ్, సూరి, బక్రేశ్వర్ విద్యుత్ ప్లాంటు టౌన్‌షిప్ (రహదారికి కొంచెం దూరంగా), దుబ్రాజ్‌పూర్, భీమ్‌గరా (అన్నీ బీర్‌భూమ్ జిల్లాలో), పాండబేశ్వర్, హరిపూర్, సోన్‌పూర్ బజారీ, రాణిగంజ్ (అన్నీ పశ్చిమ్ వర్ధమాన్ జిల్లాలో ఉన్నాయి), మెజియా, దుర్లభ్‌పూర్, గంగాజల్‌ఘటి, అమర్‌కనన్, బంకురాసోల్, ఒన్హేడు బంకురాసోల్ , బిష్ణుపూర్ (అన్నీ బంకురా జిల్లాలో), గర్బెటా, చంద్రకోన రోడ్, సల్బోని, మిడ్నాపూర్ (అన్నీ పశ్చిమ్ మేదినీపూర్ జిల్లాలో) గుండా వెళ్ళి, ఖరగ్‌పూర్ సమీపంలోని ఎన్‌హెచ్ 16 తో కలిసి ముగుస్తుంది.[1][2]
ఈ రహదారికి బీర్భమ్ జిల్లాలో మరో 2 ఉప మార్గాలున్నాయి. ఒక ఉప మార్గం దుబ్రాజ్‌పూర్ వద్ద మొదలై, జోయ్‌దేవ్ కెందులి మోర్, ఇలంబజార్, గుస్కర మోర్ & కాంక్సా మీదుగా పనాగఢ్ వరకు నడుస్తుంది. పనాగఢ్ వద్ద ఇది ఎన్‌హెచ్19 తో కలుస్తుంది. రెండవ ఉప మార్గం సూరి వద్ద మొదలై, పురందర్‌పూర్, పన్రుయి, శ్రీనికేతన్-సుయిరి మోర్, కమర్‌పరా మీదుగా వెళ్ళి ఇలంబజార్ వద్ద మొదటి ఉప మార్గంలో కలుస్తుంది.