National Highway 19 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
Part of AH1 AH20 | ||||
పొడవు | 1,323 కి.మీ. (822 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
పశ్చిమ చివర | ఆగ్రా, ఉత్తర ప్రదేశ్ | |||
తూర్పు చివర | దంకుని, పశ్చిమ బెంగాల్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | ఎటావా, కాన్పూర్, ఫతేపూర్, ప్రయాగరాజ్, వారణాసి, ముఘల్‌సరాయ్, సాసారం, ఔరంగాబాద్, గోబింద్‌పూర్, అసన్‌సోల్, దుర్గాపూర్ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 19 (ఎన్‌హెచ్ 19) భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారులలో ఒకటి.[1] దీనిని గతంలో ఢిల్లీ-కోల్‌కతా రోడ్ అనేవారు. జాతీయ రహదారి సంఖ్యలను పునర్వ్యవస్థీకరించిన తరువాత, ఢిల్లీ నుండి ఆగ్రా మార్గం ఇప్పుడు జాతీయ రహదారి 44 గాను, ఆగ్రా నుండి కోల్‌కతా మార్గం జాతీయ రహదారి 19గానూ మారాయి. [2] [3] ఇది చారిత్రిక గ్రాండ్ ట్రంక్ రోడ్‌లో ఒక ముఖ్యమైన భాగం. జపాన్ నుండి టర్కీ వరకు ఉన్న ఆసియా హైవే నెట్‌వర్క్ లోనిAH1 లో ఇది ఒక భాగం.
2010లో రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ జాతీయ రహదారుల సంఖ్యలను పునర్వ్యవస్థీకరించే ముందు దీనిని ఎన్‌హెచ్ 2 (పాతది) అని పిలిచేవారు.
1,269.7 కి.మీ. (789.0 మై.) పొడవున్న ఈ రహదారి ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గుండా వెళుతుంది.[4][2]
ఆయా రాష్ట్రాల్లో ఎన్‌హెచ్ 19 పొడవులు:
జాతీయ రహదారి 19, ఆగ్రాను కోల్‌కతాను కలుపుతుంది. ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గుండా పోతుంది.[2][4]
ఆగ్రా వద్ద ఉన్న ఎన్‌హెచ్-44తో కూడలి వద్ద మొదలై, ఎన్‌హెచ్ 19 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్, అలహాబాద్, వారణాసి, మోహనియా, ససారం, డెహ్రీ ఆన్ సోన్, బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్, జార్ఖండ్ రాష్ట్రంలోని బర్హి, బగోదర్, గోవింద్‌పూర్‌లను కలుపుతూ పోతుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అసన్సోల్, పల్సిట్ గుండా వెళ్ళి, కోల్‌కతా సమీపంలో ఎన్‌హెచ్-16తో కలిసి ముగుస్తుంది.
ఆగ్రా నుండి కోల్‌కతా వరకు టోల్ ప్లాజాలు క్రింది విధంగా ఉన్నాయి: