National Highway 4 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
నిర్వహిస్తున్న సంస్థ ఎన్‌హెచ్‌ఏఐ | ||||
పొడవు | 333 కి.మీ. (207 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
ఉత్తర చివర | లామియా బే | |||
దక్షిణ చివర | చిడిటాపు | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | పోర్ట్ బ్లెయిర్ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 4 (ఎన్‌హెచ్ 4), [1] భారత కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులలో ప్రధాన రహదారి. దీని పొడవు 230.7 కి.మీ. రాజధాని నగరం పోర్ట్ బ్లెయిర్ నుండి దిగ్లీపూర్ వరకు ఉన్న ఈ రహదారి,ఫెరార్‌గంజ్, బరాతంగ్, కడమ్‌తలా, రంగత్, బిల్లీ గ్రౌండ్, నింబుదేరా, మాయాబందర్, డిగ్లీపూర్ పట్టణాలను కలుపుతుంది. ఈ రహదారిని అండమాన్ ట్రంక్ రోడ్ (ది గ్రేట్ అండమాన్ ట్రంక్ రోడ్) అని పిలుస్తారు.
1970 ల ముందు నుండి 1990 ల ప్రారంభం వరకు మనుషులు, వస్తువుల రవాణా సముద్ర మార్గంలో జరిగేది. దీనికి చాలా రోజులు పట్టేది. ఇప్పుడు ఇది 10-12 గంటల వ్యవధిలో పూర్తవుతుంది. ఎన్‌హెచ్-4 సంవత్సరం పొడవునా అవసరమైన వస్తువుల తరలింపు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు మొదలైనవాటిని సులభతరం చేస్తుంది.
ATR జార్వా రిజర్వ్ లోని బఫర్ జోన్ గుండా జిర్కాటాంగ్ నుండి మధ్య జలసంధి వరకు వెళుతుంది. ఇక్కడ స్థానిక జారావా తెగ ప్రజలతో ప్రయాణీకుల సంబంధాలను తగ్గించడానికి చట్టాలు అమలులో ఉన్నాయి. సాయుధ ఎస్కార్ట్‌లతో కూడిన వాహన కాన్వాయ్‌లను మాత్రమే అనుమతిస్తారు.
ఈ రహదారి ప్రస్తుతం ₹ 1511.22 కోట్లతో ఎన్‌హెచైడిసిఎల్ కింద రెండు ప్రధాన వంతెనల నవీకరణ, నిర్మాణం జరుగుతోంది
ఇంతకు ముందు ఈ రహదారిని ఎన్‌హెచ్-223 అనేవారు.[2]
2010 లో జాతీయ రహదారుల సంఖ్య మార్చడానికి ముందు, ముంబై - పూణే - హుబ్లీ - బెంగుళూరు - చెన్నై జాతీయ రహదారిని ఎన్‌హెచ్ 4 అని పిలిచేవారు. గతంలో ఉన్న ఎన్‌హెచ్ 4 ఇప్పుడు ఎన్‌హెచ్ 48 గా మారింది.