National Highway 44 | |
---|---|
మార్గ సమాచారం | |
పొడవు | 3,745 కి.మీ. (2,327 మై.) |
ముఖ్యమైన కూడళ్ళు | |
ఉత్తరం చివర | శ్రీనగర్, జమ్మూ కాశ్మీరు |
దక్షిణం చివర | కన్యాకుమారి, తమిళనాడు |
ప్రదేశము | |
దేశం | భారతదేశం |
రాష్ట్రాలు | జమ్మూ కాశ్మీర్: 304 km (189 mi) హిమాచల్ ప్రదేశ్: 11 km (6.8 mi) పంజాబ్: 279 కి.మీ. (173 మై.) హర్యానా: 257 కి.మీ. (160 మై.) ఉత్తర ప్రదేశ్: 287 కి.మీ. (178 మై.) మధ్యప్రదేశ్: 547 కి.మీ. (340 మై.) మహారాష్ట్ర: 260 కి.మీ. (160 మై.) తెలంగాణ: 533 కి.మీ. (331 మై.) ఆంధ్రప్రదేశ్: 260 కి.మీ. (160 మై.) కర్ణాటక: 135 కి.మీ. (84 మై.) తమిళనాడు: 630 కి.మీ. (390 మై.) |
రహదారి వ్యవస్థ | |
జాతీయ రహదారి 44 భారతదేశంలో ప్రధానమైన రహదారి. ఇది జమ్మూ కాశ్మీరులొని శ్రీనగర్ సరిహద్దు, తమిళనాడులొని కన్యాకుమారితొ కలుపుతుంది.[1] ఇది జమ్మూ కాశ్మీరు, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది.[2] ఇది దేశంలో కెల్లా అత్యంత పొడవైన జాతీయ రహదారి.
పాత ఏడు జాతీయ రహదారులను పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ విలీనం చేయడం ద్వారా ఎన్‌హెచ్ 44 ఉనికి లోకి వచ్చింది. శ్రీనగర్ నుండి వచ్చే జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి (పాత ఎన్‌హెచ్ 1A), పంజాబ్, హర్యానాల నుండి ఢిల్లీ వెళ్ళే పాత ఎన్‌హెచ్ 1, ఢిల్లీ నుండి ప్రారంభమై ఆగ్రాలో ముగిసే పాత ఎన్‌హెచ్ 2 భాగం, ఆగ్రా నుండి గ్వాలియర్ వరకు ఉన్న పాత ఎన్‌హెచ్ 3 (ఆగ్రా-బాంబే జాతీయ రహదారిగా ప్రసిద్ధి), ఝాన్సీ వరకు ఉండే పాత ఎన్‌హెచ్ 75, పాత ఎన్‌హెచ్ 26, లఖ్‌నాడన్, సియోని, నాగ్‌పూర్, ఆదిలాబాద్ మీదుగా, నిర్మల్, హైదరాబాద్, కర్నూలు, అనంతపురం, చిక్కబల్లాపూర్, దేవనహళ్లి, బెంగళూరు, హోసూర్, కృష్ణగిరి, ధర్మపురి, సేలం, నమక్కల్, కరూర్, దిండిగల్, మదురై, విరుదునగర్, తిరునల్వేలి కన్యాకుమారి వద్ద ముగిసే పాత ఎన్‌హెచ్ 7 లు ఇందులో భాగమయ్యాయి.[3]
ఈ రహదారి శ్రీనగర్ నుండి ప్రారంభమవుతుంది. ఎన్‌హెచ్ 44 ని జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు లోని ఉత్తర-దక్షిణ కారిడార్. ఇది అధికారికంగా శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు 4,112 కిమీ (2,555 మై) పైగా నడుస్తుంది. ఇది భారతదేశంలోనే అత్యంత పొడవైన జాతీయ రహదారి.
రాష్ట్రాలు | రాష్ట్రంలో పొడవు | కూడళ్ళు | గమ్యస్థానాలు | ఇతర పట్టణాలు |
---|---|---|---|---|
జమ్మూ కాశ్మీర్ | 541 కి.మీ. (336 మై.) | 4 | ఎన్‌హెచ్ 501 అనంతనాగ్‌లో | శ్రీనగర్ (మొదలు) |
ఎన్‌హెచ్ 244 అనంతనాగ్‌లో | ||||
ఎన్‌హెచ్ 144 దోమెల్‌లో | ||||
ఎన్‌హెచ్ 144A జమ్మూలో | ||||
హిమాచల్ ప్రదేశ్ | 11.08 కి.మీ. (6.88 మై.) | 0 | చక్కి నదికి సమాంతరంగా నడుస్తుంది | |
పంజాబ్ | 279.42 కి.మీ. (173.62 మై.) | 4 | ఎన్‌హెచ్ 54 పఠాన్‌కోట్‌లో | దసువా |
ఎన్‌హెచ్ 3 జలందర్‌లో | ||||
ఎన్‌హెచ్ 5 లూఢియానాలో | ||||
ఎన్‌హెచ్ 7 రాజ్‌పురాలో | ||||
హర్యానా | 257.80 కి.మీ. (160.19 మై.) | 6 | ఎన్‌హెచ్ 344 అంబాలాలో | కురుక్షేత్ర, ఫరీదాబాదు |
ఎన్‌హెచ్ 152 అంబాలాలో | ||||
ఎన్‌హెచ్ 709A కర్నాల్‌లో | ||||
ఎన్‌హెచ్ 709 పానిపత్‌లో | ||||
ఎన్‌హెచ్ 334B సోనీపత్‌లో | ||||
ఎన్‌హెచ్ 919 పాల్వాల్‌లో | ||||
ఢిల్లీ | 15 కి.మీ. (9.3 మై.) | 3 | ఎన్‌హెచ్ 9 న్యూ ఢిల్లీలో | |
ఎన్‌హెచ్ 19 న్యూ ఢిల్లీలో | ||||
ఎన్‌హెచ్ 48 న్యూ ఢిల్లీలో | ||||
ఉత్తర ప్రదేశ్ | 269.10 కి.మీ. (167.21 మై.) | 3 | ఎన్‌హెచ్ 21 ఆగ్రాలో | బృందావన్, మథుర, లలిత్‌పూర్,
గుర్హా |
ఎన్‌హెచ్ 27 ఝాన్సీలో | ||||
ఎన్‌హెచ్ 39 ఝాన్సీలో | ||||
రాజస్థాన్ | 28.29 కి.మీ. (17.58 మై.) | 1 | ఎన్‌హెచ్ 23 ధోల్‌పూర్‌లో | |
మధ్య ప్రదేశ్ | 571.9 కి.మీ. (355.4 మై.) | గ్వాలియర్, సాగర్, నర్సింగ్‌పూర్, లఖ్నదాన్, శివ్‌నీ | ||
మహారాష్ట్ర | 268.36 కి.మీ. (166.75 మై.) | నాగపూర్,
హింగన్‌ఘాట్ | ||
తెలంగాణ | 492.85 కి.మీ. (306.24 మై.) | 5 | ఎన్‌హెచ్ 61 నిర్మల్ వద్ద | ఆదిలాబాదు, కామారెడ్డి,
జడ్చర్ల |
ఎన్‌హెచ్ 63 నిజామబాదులో | ||||
ఎన్‌హెచ్ 65 హైదరాబాదులో | ||||
ఎన్‌హెచ్ 163 హైదరాబాదులో | ||||
ఎన్‌హెచ్ 765 హైదరాబాదులో | ||||
ఆంధ్రప్రదేశ్ | 260.99 కి.మీ. (162.17 మై.)[4] | 4 | ఎన్‌హెచ్ 40 కర్నూలులో | |
ఎన్‌హెచ్ 340C డోన్‌లో | ||||
ఎన్‌హెచ్ 67 గుత్తిలో | ||||
ఎన్‌హెచ్ 42 అనంతపురంలో | ||||
కర్ణాటక | 95.67 కి.మీ. (59.45 మై.) | 5 | ఎన్‌హెచ్ 69 చిక్కబళ్ళాపూర్‌లో | అనంతపురం |
ఎన్‌హెచ్ 48 బెంగళూరులో | ||||
ఎన్‌హెచ్ 209 బెంగళూరులో | ||||
ఎన్‌హెచ్ 75 బెంగళూరులో | ||||
ఎన్‌హెచ్ 275 బెంగళూరులో | ||||
తమిళనాడు | 627.18 కి.మీ. (389.71 మై.) | 13 | ఎన్‌హెచ్ 648 హోసూరులో | విరుధునగర్, నమక్కల్ |
ఎన్‌హెచ్ 77 కృష్ణగిరిలో | ||||
ఎన్‌హెచ్ 844 ధర్మపురిలో | ||||
ఎన్‌హెచ్ 79 సేలంలో | ||||
ఎన్‌హెచ్ 544 సేలంలో | ||||
ఎన్‌హెచ్ 81 కరూర్‌లో | ||||
ఎన్‌హెచ్ 83 దిండిగల్‌లో | ||||
ఎన్‌హెచ్ 183 దిండిగల్‌లో | ||||
ఎన్‌హెచ్ 85 మదురైలో | ||||
ఎన్‌హెచ్ 744 తిరుమంగళంలో | ||||
ఎన్‌హెచ్ 138 తిరునెల్వేలిలో | ||||
ఎన్‌హెచ్ 944 నాగర్‌కోయిల్ వద్ద | ||||
ఎన్‌హెచ్ 66 కన్యాకుమారిలో |