జోయంత బసుమతరీ | |||
![]()
| |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 21 మే 2021 | |||
ముందు | చందన్ బ్రహ్మ | ||
---|---|---|---|
నియోజకవర్గం | సిడ్లి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1979 | ||
రాజకీయ పార్టీ | యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ | ||
నివాసం | కోక్రాఝర్, అస్సాం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
జోయంత బసుమతరీ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.అతను కోక్రాఝర్ లోక్సభ నియోజకవర్గం నుండి 2024లో తొలిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
జోయంత బసుమతరీ 1979లో జన్మించి 1999లో బొంగైగావ్ కళాశాల, గౌహతి విశ్వవిద్యాలయం నుండి బిఎ పూర్తి చేశాడు.
జోయంత్ బసుమతరీ యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ ద్వారా రాజకీయాలలోకి వచ్చి 2021లో జరిగిన అస్సాం శాసనసభ ఎన్నికలలో యూపీపీఎల్ తరపున సిడ్లీ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలలో నుండి యూపీపీఎల్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థి కంపా బోర్గయేరిని 51583 ఓట్లతో ఓడించి తొలిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఈ ఎన్నికలలో జోయంత బసుమతరీకి 488995 ఓట్లు రాగా, కంపా బోర్గయేరికి 437412 ఓట్లు రాగా, కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది.[2][3]