డి.వి.గుండప్ప | |
---|---|
జననం | దేవనహళ్ళి వెంకటరమణయ్య గుండప్ప 1887 మార్చి 17 ములబాగళ్, మైసూరు రాజ్యం, బ్రిటీష్ ఇండియా |
మరణం | 1975 అక్టోబరు 7 | (వయసు 88)
ఇతర పేర్లు | డివిజి |
వృత్తి | తాత్వికుడు, రచయిత, కవి, పాత్రికేయుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | మంకు తిమ్మన కగ్గ, మరుళ మునియన కగ్గ |
జీవిత భాగస్వామి | భాగీరతమ్మ[1] |
డివిజిగా ప్రసిద్ధి చెందిన దేవనహళ్ళి వెంకటరమణయ్య గుండప్ప ఒక కన్నడ కవి, రచయిత, తత్త్వవేత్త. ఇతని సుప్రసిద్ధమైన రచన మంకు తిమ్మన కగ్గ మధ్యయుగానికి చెందిన కన్నడ కవి సర్వజ్ఞుని వచనాలను పోలి ఉంటాయి.[2][3][4]
ఇతడు "శ్రీమద్ భగవద్గీత తాత్పర్య"[7] అనే పుస్తకాన్ని వ్రాశాడు. దీనికి "జీవన ధర్మ యోగ" అనే మరో పేరు కూడా ఉంది. ఈ పుస్తకానికి 1967లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.[8]
ఇతని శతజయంతి సందర్భంగా ఇతని సమగ్ర సాహిత్యాన్ని 11 సంపుటాలలో "డివిజి కృతి శ్రేణి" పేరుతో కన్నడ సాహిత్య అకాడమీ, కర్ణాటక ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సంయుక్తంగా ప్రచురించింది.[8]
ఇతడు 1932లో మద్దికెరిలో నిర్వహించిన 18వ కన్నడ సాహిత్య సమ్మేళనానికి అధ్యక్షత వహించాడు.[9]
ఇతడు గోఖలే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎఫైర్స్ (GIPA) అనే సంస్థను బెంగళూరులోని బసవనగుడి, బుల్ టెంపుల్ రోడ్డులో ప్రారంభించాడు. ఈ సంస్థ భారతీయ లలితకళలను ప్రోత్సహిస్తున్నది.[9] ఈ సంస్థ మేధావులను, సామాన్య ప్రజలను, విమర్శకులను ఒక చోట చేర్చి సామాజిక సమస్యలపై ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చించే అవకాశాన్ని కల్పించింది.[10]ఉల్లేఖన లోపం: చెల్లని <ref>
ట్యాగు; తప్పు పేర్లు, ఉదాహరణకు మరీ ఎక్కువ
ఇతడు 1975, అక్టోబర్ 7వ తేదీన మరణించాడు..[11][12][13]
డివిజి 1906-07లో పత్రికారంగంలోని అడుగు పెట్టాడు. ఇతడు "భారత్", "కర్ణాటక" అనే కన్నడ వార్తాపత్రికలను ప్రారంభించాడు.[1][9] "సుమతి" అనే వారపత్రికను నడిపాడు. "సుమతీ గ్రంథమాలె" పేరుతో ఒక ప్రచురణ సంస్థను ఆరంభించి ఎనిమిది నెలల వ్యవధిలో 12 చిన్న పుస్తకాలను వెలువరించాడు. వాటిలో దివాన్ రంగాచార్లు జీవితచరిత్ర అందరి మన్ననలను పొందింది[1]"ది కర్ణాటక" అనే ఆంగ్ల పత్రికను వారానికి రెండుసార్లు ప్రచురించేవాడు. ఈ పత్రిక తొలి సంచిక 1913, ఏప్రిల్ 2న దివాన్ విశ్వేశ్వరయ్య సహకారంతో ప్రకటించాడు. ఒక ఏడాది తరువాత ఈ పత్రికలో కన్నడ వ్యాసాలను కూడా ప్రచురించడం మొదలుపెట్టాడు. ఈ ఆంగ్లపత్రిక దేశం నలుమూలలనుండి ఇతనికి మంచి పేరుప్రఖ్యాతులను తెచ్చిపెట్టింది. సరియైన ప్రోత్సాహం లేక పోవడం వల్ల 1921లో ఈ పత్రికను మూసివేయవలసి వచ్చింది.[1]
ఇతని పత్రికలలోని సారాంశాన్ని అంతా "వృత్త పత్రికె" అనే పేరుతో ఒక గ్రంథంలో వ్రాసి 1928లో విడుదల చేశాడు.[1]