మార్చి 12 పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్ళను,కార్యాలయాలు, షాపింగ్ మాల్స్ మార్చి 31 వరకు మూసివేయాలని ఆదేశించారు.[1][2]
మార్చి 16 మత, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, విద్యా, క్రీడలు, బహిరంగ సమావేశాలను నిషేధించారు.[3]
2020 మార్చి 23 నుండి 31 వరకు ఢీల్లీకి వచ్చే అన్ని దేశీయ / అంతర్జాతీయ విమానాలను నిలిపివేస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
మార్చి 22సిఎం కేజ్రీవాల్ మార్చి 23 ఉదయం 6 నుంచి మార్చి 31 అర్ధరాత్రి వరకు లాక్డౌన్ ప్రకటించారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా అవసరమైన సేవలు మినహా ప్రతి సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.[4]
మార్చి 242020 మార్చి 24 అర్ధరాత్రి నుండి 21 రోజుల వరకు ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. తరువాత లాక్డౌన్ 2020 ఏప్రిల్ 14 వరకు పొడిగించారు.
ఏప్రిల్ 14అనేక రాష్ట్ర ప్రభుత్వాల సిఫారసు మేరకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ 2020 మే 3 వరకు లాక్డౌన్ పొడిగించారు.
72 లక్షల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నట్లు ప్రకటించారు.[5]
ఢీల్లీలో కరోనావైరస్ కేసులతో మరణించిన వైద్య సిబ్బందికి కోటి రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు.[6]