తంగేడు

తంగేడు
Scientific classification
Kingdom:
Division:
Class:
Subclass:
(unranked):
Order:
Family:
Subfamily:
Tribe:
Subtribe:
Genus:
Species:
Senna auriculata
Binomial name
Senna auriculata
(L.) Roxb.
Synonyms

Cassia auriculata L.
Cassia densistipulata Taub.

తంగేడు పువ్వులతో బతుకమ్మ

తంగేడు ఒక విధమైన ఔషధ మొక్క. దీని వృక్ష శాస్త్రీయ నామం కేషియా ఆరిక్యులేటా. బంజరు భూముల్లో, ముఖ్యంగా చిట్టడవుల్లో ఎక్కువగా పెరుగుతుంది. మొక్క చాలా అందంగా వుండి, బంగారు రంగులో వుండే పూలు గుత్తులుగా, కొమ్మల చివర పెరుగుతూ, తొలకరి వానల అనంతరం దర్శనమిస్తాయి. వీటిని గొబ్బిపూలు అని కూడా అంటారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ వచ్చే మాసంలో, ముగ్గులపై అలంకరించడం, పేడ ముద్దలపై గుచ్చి, గొబ్బెమ్మలుగా పెట్టడం చేస్తూ వుంటారు. ఈ రకమైన ఆచారం వీటికి దైవత్వం ఆపాదించడానికి విధించినదేనని, ఆ మొక్కలోని ఔషధ ప్రాముఖ్యం తెలియజేయడానికే మన పూర్వీకులు ఈ విధమైన ఆచారాలను పాటించారని తెలుస్తుంది.

బాగా పెరిగిన తంగేడు మొక్క రెండు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. బహువార్షికమయినందున, సంవత్సరం పొడవునా దొరుకుతుంది. కణుపునకు ఒకటి వంతున సంయుక్త పత్రాలు ఏర్పడతాయి. పత్రాలు చింతాకుల వలె ఉండి, కొంచెం పెద్దవిగా వుంటాయి. ఫలాలు తప్పిడిగా, పొడవుగా ఏర్పడతాయి. ఈ మొక్కను మెరక తంగేడు, తంగేడు, తుంగేర, గొబ్బిపూలు అని అనేక పేర్లతో పిలుస్తారు. సంస్కృతంలో చరమ రంగ లేక మాయహరి, ఆవర్తకి, పీఠకిలక, తిమిరిహరి అని అనేక నామాలున్నాయి. ఆంగ్లంలో టానర్స్ కాషియా లేక టానర్స్ సెన్నా అని, శాస్త్రీయంగా కేషియా ఆరిక్యులేటా లేక సెన్నా ఆరిక్యులేటా అని పిలుస్తారు. ఇది సీసాల్పినియేసి అనే కుటుంబానికి చెందినది. ఈ మొక్క బెరడులో టాన్లి ఎక్కువగా ఉన్నాయి. మొక్క సమూలంలో బీటా సైటోస్టీరాల్, గ్లైకోసైడ్లు ఉన్నాయి. ఆయుర్వేదంలో మధుర, రూక్ష, పిత్త, వాత కఫ హర గుణాలున్నట్టు పేర్కొన్నారు.

వైద్య ఉపయోగాలు

[మార్చు]
  • అతిమూత్రవ్యాధి - కాండం మీది బెరడుతో సమంగా, నువ్లు పిండి కలిపి, పూటకు ఒక చెంచాడు, రెండు పూటలా, ఒక మండలం రోజులు తీసుకుంటే, దీర్ఘకాలంగా వున్న అతిమూత్ర వ్యాధి నియంత్రించబడుతుంది.
  • గుండెదడ - విత్తనాలను వేయించి చూర్ణం చేసి కాఫీ గింజలతో కలిపి, కాఫీ చేసుకుని త్రాగితే, గుండె దడ తగ్గడమే కాక, దానితో వచ్చే నీరసం, కళ్ళు తిరగడం తగ్గుతుంది.
  • లేత అకులు గుప్పెడు తీసుకుని, రెండు చిటికెల గవ్వపలుకుల బూడిద కలిపి, టాబ్లెట్స్ లాగా చేసి రోజుకు రెండు కడుపులోకి తీసుకుంటే వీర్యవృద్ధి కలిగి, సంతానం కలుగుతుందని గిరిజన వైద్యం చెబుతోంది.
  • మధుమేహ వ్యాధితో కలిగే అతిమూత్రవ్యాధి నివారణకు, పూమొగ్గలతో తయారు చేసిన కషాయంలో తేనె కలుపుకుని తాగితే మంచిది.
  • పంటి నొప్పి తగ్గడానికి కాండం టూత్ బ్రష్ లాగా చేసి వాడితే మంచిది.
  • కుప్పం దగ్గరి తండాలలో గిరిజనులు, దీర్ఘకాలంగా వున్న తెల్లబట్ట వ్యాధి తగ్గటానికి దీని వేరు బెరడు నూరి, ఆవు మజ్జిగలో కలిపి తీసుకుంటారు.
  • గుప్పెడు పత్రాలు, రెండు శేర్ల నీటిలో వేసి కషాయం కాచి, దాన్లో బాగా కాల్చిన రెండు ఇటుకరాళ్లు వేసి, దాంట్లో నుంచి వచ్చే ఆవిరిని, కణతలకు, ముఖానికి ఆవిరి పడితే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది.
  • రేచీకటి తగ్గడానికి, పత్రాల రసం తీసి, దానిలో తెల్ల ఉల్లిపాయలు కలిపి నేతితో ఉడికించి, మండలం రోజులు, ఒక మోతాదు తీసుకుంటే, రాత్రిపూట చూపు మెరుగవుతుంది.
  • కడుపు నొప్పితో బాధపడే పిల్లలకు కాండం మీది బెరడుతో కాషాయం కాచి ఇస్తే తక్షణం ఉపశమనం కలుగుతుంది.
  • విరిగిన ఎముకలకు, పట్టుగా తంగేడు ఆకులు వాడ్తారు. విరిగిన లేక బెణికిన ఎముకల భాగం సరిచేసి, తంగేడు పత్రాలు మెత్తగా నూరి, కోడిగుడ్డు తెల్లసొనలో కలిపి, పైన పట్టుగా వేసి కట్టుకడతారు. దీనివలన వాపు తగ్గి పుండు పడకుండా త్వరగా అతుక్కుంటుంది, ఈ రకమైన వైద్యంలో తంగేడుతో కూడా కసింధ అనే మొక్క ఆకు కూడా ఎక్కువగా వాడుతారు.
  • నోటిపూతతో బాధపడుతున్న పిల్లలకు పత్రాలు నూరి మాత్రలుగా చేసి ఇస్తే, వారం రోజులకు పూత, పుండు తగ్గుతుంది.

లక్షణాలు

[మార్చు]
  • చిన్న పొద.
  • చెవి ఆకారంలో పత్రపుచ్ఛాలతో దీర్ఘచతురస్రాకార పత్రకాలతో ఉన్న సరళ పిచ్ఛాకార సంయుక్త పత్రం.
  • గ్రీవస్థ, అగ్రస్థ సమశిఖి విన్యాసాల్లో అమరిన పసుపురంగు పుష్పాలు.
  • తప్పడగా ఉన్న ద్వివిదారక ఫలాలు.

ఉపయోగాలు

[మార్చు]

తంగేడు పూల రెమ్మల కషాయం మధుమేహానికి దివ్యౌషదం. పరగడపున 15 రెమ్మలను గ్లాసుదు నీళ్ళతో మరగింఛి ఛల్లార్ఛి సేవింఛాలి. సేవనం తర్వాత ఒక గంట వరకు ఏమీ తినరాదు.[1] (మందుమొక్క - డా.ఎస్.వేదవతి)

గ్యాలరీ

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-08-06.

వెలుపలి లంకెలు

[మార్చు]