తనికెళ్ళ భరణి

తనికెళ్ళ భరణి
తనికెళ్ళ భరణి
జననం (1954-07-14) 1954 జూలై 14 (వయసు 70)
ఎత్తు5"7
జీవిత భాగస్వామిభవాని
పిల్లలుమహాతేజ (కొడుకు), సౌందర్యలహరి (కుమార్తె)
తల్లిదండ్రులు
  • టి. వి. ఎస్. ఎస్ రామలింగేశ్వర రావు (తండ్రి)
  • లక్ష్మీ నరసమ్మ (తల్లి)

తనికెళ్ళ భరణి (జననం: 1954 జులై 14) రంగస్థల, సినిమా రచయిత, నటుడు. తెలుగు భాషాభిమాని. భరణి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలంలోని జగన్నాధపురం. తెలుగు సినిమాలలో హాస్య ప్రధాన పాత్రలు అనేకం పోషించాడు.ఇతను సకల కళాకోవిదుడు. ఇతనికి దర్శకుడు వంశీ మిత్రుడు. వంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సినిమాకు మంచి సంభాషణలు అందివ్వడమే కాక ఒక మంచి పాత్రను కూడా పోషించాడు. ఇప్పటిదాకా దాదాపు 320 సినిమాలలో నటించాడు.[1]

తనికెళ్ల భరణికి వరంగల్‌ ఎస్‌ఆర్‌ యూనివర్సిటీ 2024 జులై 25న గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది.[2]

వ్యక్తిగతం

[మార్చు]

భరణి భార్య పేరు భవాని. వారికి మహాతేజ అనే కొడుకు, సౌందర్యలహరి అనే కుమార్తె ఉన్నారు.

కుటుంబం

[మార్చు]

తనికెళ్ళ భరణి తండ్రి టి. వి. ఎస్. ఎస్ రామలింగేశ్వర రావు, తల్లి లక్ష్మీ నరసమ్మ. భార్య దుర్గాభవాని. ఒక కుమారుడు పేరు కన్నబాబు. ఒక కుమార్తె పేరు సౌందర్యలహరి. అతను నిర్మించిన నివాసగృహానికి కుమార్తె పేరు పెట్టుకున్నాడు.

ఆరంభకాల కళాపయనం

[మార్చు]
మహాత్మ శ్రీ బసవేశ్వర 883వ జయంతి ఉత్సవంలో మాట్లాడుతున్న తనికెళ్ళ భరణి

తనికెళ్ళ భరణి ఇంటర్మీడియట్ వరకు ఏమీ వ్రాయలేదు. హైదరాబాద్‌లోని రైల్వే కాలేజీలో ఓ నాటకం వేయాల్సివచ్చినపుడు ‘అద్దె కొంప’ అనే నాటకం రాసి ప్రదర్శించగా ఆ నాటకానికి మొదటి బహుమతి వచ్చింది.[3] ఇంటర్ చదివే సమయంలో అతని మిత్రుడు శ్రేయోభిలాషి దేవరకొండ నరసింహ ప్రసాద్ ప్రేరణతో వ్రాసిన "అగ్గిపుల్ల ఆత్మహత్య", "కొత్త కలాలు" కవితలు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమయ్యాయి. తరువాత బి. కాం చదివే సమయంలో రాళ్ళపల్లితో పరిచయం అయింది. రాళ్ళపల్లి వ్రాసిన "ముగింపు లేని కథ" నాటకంలో తనికెళ్ళ భరణి 70 సంవత్సరాల వయోధిక పాత్ర ధరించాడు. ఆ నాటకం విజయం సాధించిన తరువాత భరణికి నాటకరంగంలో స్థిరమైన స్థానం లభించింది. రాళ్ళపల్లి నాటక సంస్థ పేరు "శ్రీ మురళీ కళానిలయం". రాళ్ళపల్లి మద్రాసు వెళ్ళిన తరువాత "శ్రీ మురళీ కళానిలయం" సంస్థకు రచయిత కొరత ఎదురైంది. అది భరణికి నాటక రచయితగా నిలదొక్కుకోవడానికి సహకరించింది. అతను ఆ సంస్థ కొరకు 10 నాటకాలు రచించాడు. ఆ నాటకాలకు తల్లావఝుల సుందరం దర్శకత్వం వహించాడు. అందులో స్త్రీవాదాన్ని బలపరుస్తూ వ్రాసిన " గోగ్రహణం " నాటకం సాహిత్య అకాడమీ పురస్కారం అందుకోవడం విశేషం. ప్రయోగాత్మకంగా ప్రదర్శించబడిన ఆ నాటకాలకు ప్రజల ఆదరణ లభించింది.

వీధినాటకాలు

[మార్చు]

ఔత్సాహిక నాటకాలు వేయడానికి వేదికగా ఉన్న రవీంద్రభారతి, నారద గానసభ వంటి నాటకరంగాలలో నాటకం వేయడానికి అధికంగా వ్యయం కావడం అది భరించే అవకాశాలు లేని కారణంగా భరణి పనిచేస్తున్న సంస్థ వారు బెంగాలీ నాటకకర్త "బాదల్ సర్కార్"ను ప్రేరణగా తీసుకుని వీధినాటకాలు వేయడం ప్రారంభించారు. ఇలా ప్రదర్శించిన నాటకాలలో మొదటిది "పెద్దబాలశిక్ష" నాటకం. తలావఝుల సుందరం ప్రారంభించిన ఈ నాటకాలకు మంచి ఆదరణ లభించింది. భరణి వీటిలో నటించడమే కాక నాటకాల నటనా బాధ్యత కూడా వహించాడు. భరణి రచించిన "గోగ్రహణం, కొక్కరకో, గొయ్యి" నాటకాలు తల్లవఝుల సుందరం దర్శకత్వంలో ప్రదర్శించబడ్డాయి. నాటకాలలో భరణి అత్యధికంగా విలన్ పాత్రలు ధరించాడు.

చలనచిత్రరంగ ప్రవేశం

[మార్చు]

తనికెళ్ళ భరణి వ్రాసిన "చల్ చల్ గుర్రం" నాటకం చూసిన రామరాజు హనుమంతరావుకు, రాళ్ళపల్లి ద్వారా వంశీకి పరిచయమై కంచు కవచం చిత్రానికి ఆ సినిమాకు రచయితగా, నటుడిగా చేశాడు.[3] తరువాత " లేడీస్ టైలర్" చిత్రానికి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత " శివ " చిత్రంలో నటుడిగా అవకాశం అలాగే పేరూ వచ్చింది. దాదాపు 60 చిత్రాలకు పనిచేసే అవకాశం లభించింది. అతను తెలంగాణా యాసలో మాటలు వ్రాయడంలో సిద్ధహస్థుడు. " మొండి మొగుడు - పెంకి పెళ్ళాం" చిత్రంలో కథానాయికకు పూర్తిగా తెలంగాణ యాసలో రాశాడు.

నటుడిగా

[మార్చు]

తనికెళ్ళభరణి చలనచిత్ర నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందాడు. సొగసు చూడతరమా, ఎగిరేపావురమా, మావిచిగురు, పరదేశి చిత్రాలలో భరణి ఉదాత్తమైన నటన ప్రదర్శించాడు. కామెడీ, విలన్, ఉదాత్తమైన వైవిధ్యమైన పాత్రధారణతో భరణి ప్రజాదరణ పొందిన నటులలో ఒకడయ్యాడు. అతను దాదాపు 200 పైచిలుకు చిత్రాలలో నటించాడు.

పాక్షిక చిత్ర సమాహారం

[మార్చు]

దర్శకుడిగా

[మార్చు]


నటించిన చిత్రాలు

[మార్చు]
  1. కేసీఆర్ (2024)
  2. సి 202 (2024)
  3. కళింగ
  4. నింద (2024)
  5. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ (2024)
  6. భజే వాయు వేగం (2024)
  7. ప్రతినిధి 2 (2024)
  8. హద్దులేదురా (2024)
  9. ఇంటి నెం.13 (2024)
  10. డ్రిల్ (2024)
  11. సర్కారు నౌకరి (2024)
  12. మిస్టర్ కింగ్ (2023)
  13. ఆదికేశవ (2023)
  14. పెదకాపు-1 (2023)
  15. మోహన్‌కృష్ణ గ్యాంగ్ లీడర్ (2023)
  16. దోచేవారెవరురా (2023)
  17. సార్ (2023)
  18. ధమకా (2022)
  19. ఫస్ట్ డే ఫస్ట్ షో (2022)
  20. అల్లూరి (2022)
  21. నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా (2022)
  22. పెళ్లిసందD (2022)
  23. భీమ్లా నాయక్ (2022)
  24. ఏకమ్ (2021)
  25. దృశ్యం 2 (2021)
  26. తెలంగాణ దేవుడు (2021)
  27. ఏప్రిల్ 28 ఏం జరిగింది
  28. రాజా విక్రమార్క
  29. గాలి సంపత్ (2021)
  30. రూమ్ నంబర్ 54 (2021)
  31. బంగారు బుల్లోడు (2021)
  32. బొంభాట్ (2020)
  33. మా వింత గాధ వినుమా (2020)
  34. ప్రెషర్ కుక్కర్ (2020)
  35. ఎంత మంచివాడవురా! (2020)[4][5]
  36. కృష్ణ రావు సూపర్ మార్కెట్(2019)
  37. మథనం(2019)
  38. మేరా భారత్ మహాన్ (2019)
  39. 2 అవర్స్ లవ్ (2019)
  40. పట్నఘడ్ (2019)
  41. నా నువ్వే (2018)
  42. మూడు పువ్వులు ఆరు కాయలు (2018)
  43. అమర్ అక్బర్ ఆంటోని (2018)
  44. శరభ (2018)[6]
  45. విజేత (2018 సినిమా) (2018)
  46. కథలో రాజకుమారి (2017)
  47. ఓయ్ నిన్నే (2017)
  48. గల్ఫ్ (2017)
  49. శమంతకమణి (2017)
  50. నేనే రాజు నేనే మంత్రి (2017)
  51. గురు (2017)[7]
  52. హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌ (2017)
  53. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం (2017)
  54. సుప్రీమ్ (2016)
  55. అరెరె
  56. కిక్ 2 (2015)
  57. జెండాపై కపిరాజు (2015)[8]
  58. సూర్య వర్సెస్ సూర్య (2015)
  59. బెంగాల్ టైగర్ (సినిమా) (2015)
  60. మూడు ముక్కల్లో చెప్పాలంటే (2015)
  61. కార్తికేయ (సినిమా) (2014)
  62. రఫ్‌ (2014)
  63. రారా...కృష్ణయ్య (2014)
  64. నువ్వే నా బంగారం (2014)
  65. బసంతి (2014)
  66. పాండవులు పాండవులు తుమ్మెద (2014)
  67. పవిత్ర (2013)[9]
  68. ఢి ఫర్ దోపిడి (2013)
  69. అడ్డా (2013)[10]
  70. ధోని (2012)
  71. క్షేత్రం (2011)
  72. కలెక్టర్ గారి భార్య (2010)
  73. శంభో శివ శంభో (2010)
  74. బావ (సినిమా) (2010)
  75. రక్తచరిత్ర - రామ్మూర్తి - (2010)
  76. కరెంట్ (2009)
  77. గుండమ్మగారి మనవడు (2007)
  78. చుక్కల్లో చంద్రుడు (2006)
  79. విద్యార్థి (2004)
  80. గౌరి (2004)
  81. కొడుకు (2004)
  82. ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు (2004)
  83. నేనున్నాను - సింహాచలం నాయుడు - (2004)
  84. మిస్సమ్మ (2003)
  85. విష్ణు (2003)
  86. ఎంత బావుందో! (2002)
  87. ఒకటో నంబర్ కుర్రాడు (2002)
  88. 9 నెలలు (2001)
  89. అందాల ఓ చిలకా (2001)
  90. సూరి (2001)
  91. శుభాశీస్సులు (2001)
  92. రామ్మా! చిలకమ్మా (2001)
  93. మనసున్న మారాజు (2000)
  94. సర్దుకుపోదాం రండి (2000)
  95. పాపే నా ప్రాణం (2000)
  96. అహోబ్రహ్మ ఒహోశిష్య (1997)
  97. పెళ్ళి చేసుకుందాం (1997)[11]
  98. శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్
  99. స్వర కల్పన
  100. చెట్టు కింద ప్లీడర్
  101. శివ
  102. జగదేక వీరుడు అతిలోక సుందరి
  103. సీతారామయ్య గారి మనవరాలు
  104. అప్పుల అప్పారావు
  105. యమలీల
  106. నువ్వు నాకు నచ్చావ్
  107. మన్మథుడు
  108. ఇంద్ర
  109. చిత్రం
  110. ఆరో ప్రాణం (1997)
  111. జాబిలమ్మ పెళ్ళి (1996)
  112. ఆంటీ (1995)
  113. గాయం (1993)
  114. హలో డార్లింగ్ (1992)
  115. చెవిలో పువ్వు (1990)
  116. గౌతమి (1987)

రచయితగా

[మార్చు]

నాటకాలు

[మార్చు]

తనికెళ్ళ భరణి సమాజంలో జరుగుతున్న సంఘటలనపై నాటకాలు రాశాడు.[12]

సినీ రచనలు

[మార్చు]

వెబ్ సిరీస్

[మార్చు]

ప్రజాదరణ పొందిన తనికెళ్ళ భరణి సినీ సంభాషణలు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]

రచనలు

[మార్చు]
  1. నక్షత్ర దర్శనం
  2. పరికిణీ
  3. ఎందరో మహానుభావులు
  4. మాత్రలు
  5. శబ్బాష్‌రా శంకరా

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-01-21. Retrieved 2008-11-26.
  2. Chitrajyothy (25 July 2024). "నటుడు తనికెళ్ల భరణికి డాక్టరేట్‌". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
  3. 3.0 3.1 సాక్షి, ఫ్యామిలీ (19 May 2019). "రత్నాలపల్లి". Archived from the original on 2019-05-18. Retrieved 19 May 2019.
  4. సాక్షి, సినిమా (15 January 2020). "'ఎంత మంచివాడవురా!' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
  5. ఈనాడు, సినిమా (15 January 2020). "రివ్యూ: ఎంత మంచివాడ‌వురా". Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
  6. సాక్షి, సినిమా (22 November 2018). "'శరభ' మూవీ రివ్యూ". Archived from the original on 22 November 2018. Retrieved 19 March 2020.
  7. తుపాకి, రివ్యూ (31 March 2017). "గురు సినిమా రివ్యూ". www.tupaki.com. Archived from the original on 8 జూన్ 2020. Retrieved 8 June 2020.
  8. "Nani-Amala Paul movie is Janda Pai Kapiraju". Times of India. 30 July 2012. Retrieved 10 January 2020.
  9. "Pavitra to hit screens on May 10". Deccan Chronicle. 10 May 2013. Archived from the original on 14 అక్టోబరు 2016. Retrieved 28 జూలై 2019.
  10. "jeevi review for Adda". idlebrain.com. Retrieved 16 July 2019.
  11. తెలుగు ఫిల్మ్ నగర్, సినిమా (9 October 2019). "మ్యూజిక‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ 'పెళ్లి చేసుకుందాం'కు 22 ఏళ్ళు". www.thetelugufilmnagar.com. Prabhu. Archived from the original on 14 June 2020. Retrieved 15 June 2020.
  12. ఆంధ్రభూమి, సాహితి (3 October 2016). "అటకెక్కుతున్న నాటక రచన". andhrabhoomi.net. బి.నర్సన్. Archived from the original on 27 March 2020. Retrieved 27 March 2020.
  13. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 29 June 2020.
  14. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
  15. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
  16. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.

బయటి లింకులు

[మార్చు]