తపస్ పాల్

తపస్ పాల్
జననం(1958-09-29)1958 సెప్టెంబరు 29
చంద్రా నగర్ పశ్చిమ బెంగాల్ , భారతదేశం
మరణం2020 ఫిబ్రవరి 18(2020-02-18) (వయసు 61)[1]
ముంబాయి, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు రాజకీయ నాయకుడు
క్రియాశీలక సంవత్సరాలు1980 నుంచి 2019 వరకు
రాజకీయ పార్టీతృణమూల్ కాంగ్రెస్
పిల్లలుసోహిని పాల్

తపస్ పాల్ ( 1958 సెప్టెంబర్ 29 - 2020 ఫిబ్రవరి 18) ఒక భారతీయ నటుడు రాజకీయ నాయకుడు. [2] బెంగాలీ సినిమా రంగంలో ప్రసిద్ధిగాంచిన నటులలో తపస్ పాల్ ఒకరు, మహువా రాయ్ చౌదరి దేబాశ్రీ రాయ్ సరసన నటించి తపస్ పాల్ గుర్తింపు పొందాడు. [3] [4] తపస్ పాల్ ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నాడు. [5]

తపస్ పాల్ 2014 భారత సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుండి కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచి పార్లమెంటు సభ్యుడు అయ్యాడు . [6] [7]

తపస్ పాల్ తన తొలి సినిమా దాదర్ కీర్తి (1980) సినిమాతో సినీ రంగంలోకి అడిగి పెట్టాడు.తరుణ్ మజుందార్ దర్శకత్వం వహించిన సినిమాలలో తపస్ పాల్ నటించి ప్రజాదరణ పొందాడు. సాహెబ్ (1981), [8] పరబత్ ప్రియా (1984), భలోబాసా భలోబాసా (1985), వంటి వంటి సినిమాలు బెంగాలీ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి. అనురాగేర్ చోయన్ (1986), అమర్ బంధన్ (1986), గురు దక్షిణ (1987) సినిమాలు ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. సాహెబ్ (1981) సినిమాలో తపస్ పాల్ పాత్ర కుఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది. [9]

తపస్ పాల్ మాధురీ దీక్షిత్ సరసన హిరేన్ నాగ్ అబోధ్ (1984) సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. [10] తపస్ పాల్ తరుణ్ మజుందార్‌తో రెండో సినిమా భలోబాస భలోబాస (1985)లో దేబశ్రీ రాయ్‌తో కలిసి నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద విజయవంతమైంది. దేబాశ్రీ రాయ్ తో తపస్ పాల్ చాలా సినిమాలలో నటించాడు. అర్పన్ (1987), సురేర్ సతి (1988), సురేర్ ఆకాషే (1988), నయన్మణి (1989), చోఖేర్ అలోయ్ (1989), శుభ కమన (1991), మాయాబిని (1992), తోబు మోనే రేఖో ( 1994), తుమీ జే అమర్ (1994) సినిమాలలో నటించాడు. తపస్ పాల్ ఉత్తర (2000) మోండో మేయర్ ఉపాఖ్యాన్ (2002)లో బుద్ధదేబ్ దాస్‌గుప్తాతో కలిసి పనిచేశాడు. [11] 2016 డిసెంబర్లో రాజ్ వ్యాలీ చిట్ ఫండ్ స్కామ్‌తో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ తపస్ పాల్ ను సిబిఐ అరెస్టు చేసింది, [12] [13] [14] [15] ఆరెస్టు చేసిన 13 నెలల తర్వాత ఆయన బెయిల్ పొందారు. [16]

బాల్యం విద్యాభ్యాసం

[మార్చు]

తపస్ పాల్ బుర్ద్వాన్ విశ్వవిద్యాలయం హుగ్లీ మొహ్సిన్ కళాశాల నుండి బయో సైన్స్ డిగ్రీలో పట్టభద్రుడయ్యాడు. [6] [17]

నట జీవితం

[మార్చు]

తపస్ పాల్ మొదటగా 1980లో తరుణ్ మజుందార్ దర్శకత్వం వహించిన దాదర్ కీర్తి సినిమాలో నటించాడు. [17] దాదర్ కీర్తి (1980) సినిమా తీస్తున్నప్పుడు తపస్ పాల్ ఆ సినిమా సహాయక దర్శకుడి దృష్టిని ఆకర్షించాడు. దీంతో తపస్ పాల్ కు ఆ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. తపస్ పాల్ నటించిన మొదటి సినిమా విజయవంతమైంది. [3] ఆ సినిమాలో తన పాత్రకు గాను తపస్ పాల్ ప్రేక్షకుల ప్రశంసలు పొందాడు. [18] తపస్ పాల్ తన శృంగార సినిమా భలోబాస భలోబాస (1985)లో తరుణ్ మజుందార్‌ దర్శకత్వంలో రెండవసారి నటించాడు, ఆ సినిమాలో తపస్ పాల్దేబశ్రీ రాయ్‌తో కలిసి నటించాడు. [3] ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది [3] దేబాశ్రీ రాయ్ తో కలిసి తపస్ పాల్ అర్పన్ (1987), [19] సురేర్ సతి (1988), సురేర్ ఆకాషే (1988), నయన్మణి (1989), చోఖేర్ అలోయ్ (1989), శుభ కమన (1991), మాయాబిని (1992), తోబు ఉన్నాయి. మోనే రేఖో (1994) సినిమాలలో నటించాడు. [20] అతను ఉత్తర (2000) మోండో మేయర్ ఉపాఖ్యాన్ (2002) సినిమాలలో బుద్ధదేబ్ దాస్‌గుప్తాతో కలిసి పనిచేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

తపస్ పాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశాడు (2001-2006 మొదటిసారి 2006-2009 రెండవసారి) అలీపూర్ నుండి ఎమ్మెల్యేగా పనిచేశాడు. తపస్ పాల్ 2009 నుండి 2018 వరకు కృష్ణానగర్ ఎంపీగా పనిచేశాడు [21]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

తపస్ పాల్ నందిని పాల్‌ను వివాహం చేసుకున్నాడు. ఆమె బిగ్ బాస్ బంగ్లా సీజన్ 2లో పాల్గొంది. తపస్ పాల్ కూతురు సోహిని పాల్ టాలీవుడ్ నటి. [22]

వివాదం

[మార్చు]

2016 డిసెంబర్ 31న, పోంజీ సంస్థ రోజ్ వ్యాలీ గ్రూప్‌లో పాల్గొన్నందుకు తపస్ పాల్ అరెస్టయ్యాడు. [23] పదమూడు నెలల జైలు శిక్ష అనుభవించిన తర్వాత తపస్ పాల్ విడుదలయ్యాడు. [16]

2017 జనవరి 11న, భారతీయ జనతా పార్టీ ఎంపీ బాబుల్ సుప్రియో పాల్, ఏఐటీసీ ఎంపీ సౌగతా రాయ్ ఎమ్మెల్యే మహువా మోయిత్రాపై రోజ్ వ్యాలీ స్కాంలో ప్రమేయం ఉందని తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఫిర్యాదు చేశారు. [24]

అవార్డులు

[మార్చు]
  • 1993లో రూపబన్ సినిమాకు ఉత్తమ నటుడు అవార్డు
  • 1996లో మెజో బౌ సినిమాకు ఉత్తమ నటుడు అవార్డు
  • 2001లో మామా భాగ్నే సినిమాకు ఉత్తమ నటుడు అవార్డు
  • 2003లో నాయక్ సినిమాకు ఉత్తమ నటుడు [టెలివిజన్] అవార్డు
  • 2005లో ప్రతిశోధ సినిమాకు ఉత్తమ నటుడు అవార్డు
  • 1981లో సాహెబ్ సినిమాకు గానూ ఫిలింఫేర్ ఉత్తమ నటుడిగా అవార్డులు పొందారు
  • 2012లో భారత్ నిర్మాణ్ అవార్డులు Archived 2022-05-27 at the Wayback Machine [25]

మరణం

[మార్చు]

తపస్ పాల్ 2020 ఫిబ్రవరి 18న 61వ ఏట మరణించాడు. తపస్ పాల్ గుండె జబ్బుతో కొంతకాలం బాధపడ్డాడు, దీంతో అకస్మాత్తుగా ఆయన గుండె ఆగిపోయింది. [26]

మూలాలు

[మార్చు]
  1. "Bengali actor and former TMC MP Tapas Paul dies of cardiac arrest". The Times of India. 18 February 2020. Archived from the original on 18 February 2020. Retrieved 18 February 2020.
  2. "বিতর্কিত রাজনীতিবিদ ও অভিনেতা তাপস পাল মারা গেছেন". BBC News বাংলা (in Bengali). 18 February 2020. Archived from the original on 19 February 2020. Retrieved 16 March 2020.
  3. 3.0 3.1 3.2 3.3 "তাপস পাল: এক বিষণ্ণ ভালমানুষ থেকে ট্র্যাজিক হিরো". anandabazar.com (in Bengali). Archived from the original on 18 February 2020. Retrieved 18 February 2020.
  4. "Bengali actor and former MP Tapas Pal dies at 61". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 18 February 2020. Retrieved 18 February 2020.
  5. PTI (2020-02-18). "Bengali actor and former Trinamool MP Tapas Paul passes away at 61". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-05-05.
  6. 6.0 6.1 Detailed Profile: Shri Tapas Paul Archived 5 మే 2012 at the Wayback Machine india.gov.in.
  7. Tapas Paul Archived 20 జనవరి 2016 at the Wayback Machine netapedia.in.
  8. "সে দিন 'সাহেব'কে দেখতে ভেঙেছিল পাঁচিল". anandabazar.com (in Bengali). Archived from the original on 22 February 2020. Retrieved 22 February 2020.
  9. Reed, Sir Stanley (26 May 1984). "The Times of India Directory and Year Book Including Who's who". Bennett, Coleman. Archived from the original on 29 July 2020. Retrieved 16 August 2019 – via Google Books.
  10. ":: Rajshri Films - Abodh (1984) ::". www.rajshri.com. Archived from the original on 16 September 2017. Retrieved 10 September 2017.
  11. "Tapas Pal Filmography, Tapas Pal List Of Movies On Gomolo.com". gomolo.com. Archived from the original on 10 September 2017. Retrieved 10 September 2017.
  12. "CBI arrests Trinamool MP Tapas Pal". Archived from the original on 30 December 2016.
  13. "Rose Valley Scam : Making of the Rs 60,000 Crore Chit Fund Scandal". Archived from the original on 30 December 2016.
  14. "Rose Valley scam". Archived from the original on 30 December 2016.
  15. "Rose Valley chit fund scam". Archived from the original on 11 October 2020.
  16. 16.0 16.1 "Tapas Paul gets bail after 13 months". The Times of India. 2 February 2018. Archived from the original on 1 June 2018. Retrieved 2 February 2018.
  17. 17.0 17.1 Bengali Cinema: Tapas Pal Archived 18 డిసెంబరు 2007 at the Wayback Machine calcuttaweb.com.
  18. "Tarun Majumdar". Rituparna Roy (in అమెరికన్ ఇంగ్లీష్). 7 February 2014. Archived from the original on 11 October 2020. Retrieved 10 March 2020.
  19. "চরণ ধরিতে দিয়ো গো আমারে নিয়ো না নিয়ো না সরায়ে". Epaper Sangbad Pratidin. Archived from the original on 9 April 2020. Retrieved 20 March 2020.
  20. "Tapas Paul used to rides on local train during his struggling period". Sangbad Pratidin (in అమెరికన్ ఇంగ్లీష్). 18 February 2020. Archived from the original on 18 February 2020. Retrieved 18 February 2020.
  21. "Actor-Politician Tapas Pal Dies Of Cardiac Arrest At 61". NDTV.com. Archived from the original on 18 February 2020. Retrieved 28 August 2020.
  22. Wind in my hair Archived 20 అక్టోబరు 2012 at the Wayback Machine, indiatoday.intoday.in.
  23. "TMC MP Tapas Paul arrested in Rose Valley case | Latest News & Updates at Daily News & Analysis". Archived from the original on 3 January 2017. Retrieved 31 December 2016.
  24. "Rose valley chit fund case: Babul Supriyo sends defamation notices to TMC leaders for linking him to scam | the Indian Express". 11 January 2017. Archived from the original on 11 January 2017. Retrieved 11 January 2017.
  25. "-:: Bharat Nirman Awards ::-". www.bharatnirmanawards.com. Archived from the original on 29 July 2017. Retrieved 28 February 2020.
  26. "Actor-Politician Tapas Pal Dies Of Cardiac Arrest At 61". NDTV.com. Archived from the original on 18 February 2020. Retrieved 18 February 2020.