తస్లీమ్ ఆరిఫ్

తస్లీమ్ ఆరిఫ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
తస్లీమ్ ఆరిఫ్ అబ్బాసీ
పుట్టిన తేదీ(1954-05-01)1954 మే 1
పిఊబి కాలనీ, కరాచీ, పాకిస్తాన్
మరణించిన తేదీ2008 మార్చి 14(2008-03-14) (వయసు 53)
కరాచీ, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రవికెట్-కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 82)1980 జనవరి 29 - ఇండియా తో
చివరి టెస్టు1980 డిసెంబరు 8 - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 31)1980 నవంబరు 21 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే1980 డిసెంబరు 19 - వెస్టిండీస్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1967/68–1989/90కరాచీ
1967/68–1989/90NBP
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 6 2 148 40
చేసిన పరుగులు 501 28 7,568 853
బ్యాటింగు సగటు 62.62 14.00 33.63 25.84
100లు/50లు 1/2 0/0 13/40 1/4
అత్యుత్తమ స్కోరు 210* 24 210* 113*
వేసిన బంతులు 30 311
వికెట్లు 1 7
బౌలింగు సగటు 28.00 30.28
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/28 4/46
క్యాచ్‌లు/స్టంపింగులు 6/3 1/1 312/56 45/14
మూలం: ESPNcricinfo.com, 2008 జనవరి 6

తస్లీమ్ ఆరిఫ్ అబ్బాసీ (1954, మే 1 - 2008, మార్చి 14) పాకిస్థానీ మాజీ క్రికెటర్. 1980లో ఆరు టెస్ట్ మ్యాచ్‌లు, 2 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఆస్ట్రేలియాపై పాకిస్తాన్ తరపున అతని స్కోరు 210*[1] శ్రీలంక కుమార సంగక్కర బద్దలు కొట్టే వరకు 20 సంవత్సరాలకు పైగా టెస్టు క్రికెట్‌లో వికెట్ కీపర్ చేసిన అత్యధిక స్కోరుగా నిలిచిపోయింది.[2]

జననం

[మార్చు]

తస్లీమ్ ఆరిఫ్ అబ్బాసీ 2008, మార్చి 14న పాకిస్థాన్ లోని కరాచీలో జన్మించాడు. కరాచీలోని పీఐబీ కాలనీలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. మెట్రిక్యులేషన్ పూర్తయిన తర్వాత అతని క్రికెట్ రికార్డు ఆధారంగా నేషనల్ కాలేజీ కరాచీలో చేరాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

ఇంటర్ కాలేజియేట్ మ్యాచ్‌లలో కళాశాల జట్టు తరపున ఆడటం కొనసాగించాడు. ఇతని గురువు ప్రొఫెసర్ ముకర్రం అలీ ఖాన్ షిర్వాణి, అనేకమంది సెలెక్టర్లకు ఇతనిని అత్యుత్తమ, వర్ధమాన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా పరిచయం చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు.

రికార్డు

[మార్చు]

1978, సెప్టెంబరులో లాహోర్‌లో పంజాబ్‌కి వ్యతిరేకంగా నేషనల్ బ్యాంక్ తరపున ఆడుతూ, అంతర్జాతీయ అరంగేట్రం చేయడానికిముందు, ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో పదిమంది అవుట్‌లను చేసిన మొదటి పాకిస్థానీ వికెట్ కీపర్‌గా నిలిచాడు.[3] ఇతని రికార్డును 1997లో వసీం యూసౌఫీ బద్దలు కొట్టాడు.

మరణం

[మార్చు]

ఆరిఫ్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో 2008, మార్చి 14న కరాచీలో మరణించారు. కరాచీలోని ఫైసల్ కంటోన్మెంట్ శ్మశానవాటికలో ఇతని అంత్యక్రియలు జరిగాయి. ఇతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇమ్రాన్ ఆరిఫ్, లండన్‌లో నివసిస్తున్నాడు; అయినన్ ఆరిఫ్, ఇతను స్వయంగా నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ కోసం ఆడే క్రికెటర్; మరియమ్ ఆరిఫ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో నివసిస్తున్నారు.[4]

మూలాలు

[మార్చు]
  1. WISDEN – Second Test Match – PAKISTAN v AUSTRALIA 1979–80, ESPNCricinfo, 13 March 2008, retrieved 22 April 2012
  2. Records / Test matches / Batting records / Most runs in an innings by a wicketkeeper, ESPNCricinfo, 13 March 2008
  3. "Taslim Arif on 10 September, 1978". ESPN Cricinfo. Retrieved 10 September 2016.
  4. Former Pakistan keeper Taslim Arif dies, ESPNCricinfo, 13 March 2008, retrieved 22 April 2012

బాహ్య లింకులు

[మార్చు]