Taj Club House | |
---|---|
హోటల్ చైన్ | Taj Hotels |
సాధారణ సమాచారం | |
ప్రదేశం | Chennai, India |
చిరునామా | 2, Club House Road, Anna Salai Chennai, Tamil Nadu 600 002 |
భౌగోళికాంశాలు | 13°03′41″N 80°15′50″E / 13.061466°N 80.264013°E |
ప్రారంభం | December 2008 |
యజమాని | TAJGVK Hotels |
యాజమాన్యం | Taj Hotels |
సాంకేతిక విషయములు | |
అంతస్థుల సంఖ్య | 7 |
రూపకల్పన, నిర్మాణం | |
వాస్తు శిల్పి | Thom Catallo (Mackenzie Designphase Hospitality) |
ఇతర విషయములు | |
గదుల సంఖ్య | 220 |
సూట్ల సంఖ్య | 16 |
జాలగూడు | |
tajhotels.com |
తాజ్ క్లబ్ హౌస్, చెన్నై (Taj Club House, Chennai) అనేది భారత్ లోని చెన్నై నగరంలో తాజ్ సముదాయ హోటళ్లలో నాలుగో హోటల్. అందరికీ తెలిసిన పాత తాజ్ మౌంట్ రోడ్ లో ఇది విలాసవంతమైన 5 -స్టార్ హోటల్ [1] ప్రస్తుతం క్లబ్ హోస్ రోడ్ లో అన్నా సాలై సమీపంలో తాజ్ కన్నెమెర హోటల్ కు అడ్డంగా ఉంటుంది. ఇది తాజ్ హోటల్స్ సముదాయంలోని మరో ఆస్తి గా చెప్పుకోవచ్చు. దీని యాజమాన్యం తాజ్ గ్రూపునకు అనుబంధంగా ఉన్న తాజ్ జి.వి.కె.హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్. తాజ్ క్లబ్ చెన్నై హోటల్ ను 1,600 మిలియన్ల తో నిర్మించారు.[2] నిర్మాణం పూర్తి చేసుకుని ఈహోటల్ డిసెంబరు 2008 లో ప్రారంభించబడింది. మెకెంజియో డిజైన్ ఫేజ్ హాస్పిటాలిటీకి చెందిన థామ్ క్యాటల్లో ఈ హోటల్ డిజైన్ కు రూపకల్పన చేశారు.[3] 45,000 చదరపు అడుగుల ఎత్తులో హోటల్ ముందు భాగంలో తీర్చి దిద్దిన నీలి రంగు అద్దాల డిజైన్.. హోటల్ వచ్చిన అతిథులను ఒక అందమైన ప్రపంచంలోకి స్వాగతం చెబుతున్నట్లుగా ఉంటుంది.
తాజ్ క్లబ్ హౌస్ చెన్నై హోటల్ చెన్నై నగరంలో ప్రసిద్ధి గాంచిన అనేక చారిత్ర ప్రదేశాలకు సమీపంలో ఉంటుంది. అంతేకాదు... చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి కేవలం 10 నిమిషాలు ప్రయాణిస్తే చాలు క్లబ్ హౌస్ రోడ్ లో ఉన్న ఈ హోటల్ కు చేరుకోవచ్చు. అదేవిధంగా విమానాశ్రయం నుంచి కేవలం 45 నిమిషాలు ప్రయాణిస్తే చాలు. మెరినా బీచ్ కు, సెయింట్ జార్జ్ కోటకు అతి సమీపంలో చెన్నై క్లబ్ హౌస్ హోటల్ ఉంటుంది. చెన్నై రైల్వే స్టేషన్ నుంచి తాజ్ క్లబ్ చెన్నై హోటల్ కు దూరం: 4 కి.మీ.(సుమారు)
చెన్నై విమానాశ్రయం నుంచి తాజ్ క్లబ్ చెన్నై హోటల్ కు నుంచి దూరం: 19 కి.మీ.(సుమారు)
ఏడు అంతస్థుల భారీ భవనంలో ఈ హోటల్ ఉంది. 45,000 చదరపు అడుగుల ఎత్తులో హోటల్ ముందు భాగం నీలి రంగు అద్దాలతో ఎంతో చక్కగా డిజైన్ చేశారు. హోటల్లో 16 సూట్లు సహా మొత్తం 220 గదులు ఉన్నాయి.[4] వీటిలో 38 సుపీరియర్ గదలు, 107 డీలక్స్ గదులు, 59 ప్రీమియం గదులు, ఒక్కోటి 50 చదరపు అడుగుల వైశాల్యం గల 9 ఎక్జిక్యూటివ్ సూట్లు, 662 చదరపు అడుగుల వైశాల్యంమరో ఆరు డీలక్స్ సూట్లు, 3,500 చదరపు అడడుగుల విస్తీర్ణంలో ఉన్న ఓ ప్రెసిడెన్షియల్ సూట్ ఉన్నాయి. హోటల్ గ్రౌండ్ ఫ్లోర్ లో 3,300 చదరపు అడుగుల వైశాల్యం గల బాంకెట్ హాల్ ఉంది. ఈ హాల్ లో ఒకేసారి 400 మంది అతిథులతో సమావేశాలు నిర్వహించుకోవచ్చు. అదేవిధంగా ఒక్కోటి 30 మంది సమావేశం నిర్వహించకోగల 2 సమావేశ మందిరాలు, 12 మందితో సమావేశం కాగలగే ఒక బోర్డు రూం కూడా హోటల్లోని ఆరో అంతస్థులో ఉన్నాయి.[5] హోటల్ లోని సూట్లు అత్తున్నత స్థాయి సౌకర్యాలతో ఉంటాయి. ప్రతి గదిలోనూ అతిథులకు కావాల్సిన సౌకర్యాలు, విశ్రాంతి కలిగించే ఆహ్లాదకర వాతావరణం, గదిలోకి వచ్చే సేవలు చేసే సర్వెంట్లు, టీవీ, వై- ఫైఇంటర్నెట్ వంటి సౌకర్యాలను హోటల్ అందిస్తోంది.
అన్ని రకాల సదుపాయాలతో, విశాలమైన గదులు, సమావేశ మందిరాలతో తాజ్ క్లబ్ హౌస్ హోటల్ అనేది ఒక ఆదర్శ ఆతిథ్య కేంద్రంగా వెలుగొందుతోంది. అత్యాధునిక సదుపాయాలతో 24 గంటల వ్యాపార కేంద్రంగా ఈ హోటల్ సేవలందిస్తోంది. కరెన్సీ మార్పిడి, అద్దె కారు సౌకర్యం, లాండ్రీ, ఫోన్ చేస్తే అందుబాటులోకి వచ్చే వైద్యులు వంటి ఎన్నో సౌకర్యాలను హోటల్ కల్పిస్తోంది. విలాసవంతమైన బాల్ రూం, 2 సమావేశమందిరాలు, 3200 చదరపు అడుగులు గల బాల్ రూంను రెండు హాళ్లుగా విభజించారు. వీటిలో ఒక్కోదానిలో 150 మంది అతిథులు సమావేశం కావచ్చు. చుట్టూ నిర్మించిన రెయిన్ ట్రీ, సంప్రదాయ యూరోపియన్ రెస్టారెంట్ సదుపాయాలు ఇక్కడ లభిస్తాయి. బయటవైపు ఉండే స్విమ్మింగ్ పూల్, వ్యాయం కోసం ఫిట్ నెస్ సెంటర్, మానసిక ఆరోగ్యం కోసం నిపుణులైన శిక్షకులతో కూడిన యోగా కేంద్రం, జివా స్పా వంటివి కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ హోటల్లోని అన్ని గదుల్లో భారతీయ సంప్రదాయాలు ఉట్టిపడేలా తీర్చిదిద్దిన ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. ఫ్లాట్ స్క్రీన్ శాటిలైట్ టీవీలు, వై-ఫై ఇంటర్నెట్ సదుపాయం, రుచికరమైన భోజనాలు, పంజాబ్, రావల్పిండికి చెందిన సంప్రదాయ వంటలు, ఇతర తినుబండారాలు, కాఫీ షాప్ లో టీ, కాఫీ, స్నాక్స్, శాండ్విచ్ వంటివి లభిస్తాయి.[6]