విజయవాడ నగరంలో అంతర్భాగంగా ఉన్న తాడిగడప, కానూరు, యనమలకుదురు, పోరంకి గ్రామాలను కలిపి వైఎస్ఆర్ తాడిగడప పురపాలకసంఘం అనే పేరుతో కొత్త పురపాలకసంఘంగా ప్రభుత్వ ఆర్డినెన్స్ ద్వారా మొదటి తరగతి పురపాలక సంఘంగా 2021 జనవరి 1న ఏర్పడింది.[1][2][3] ఇది విజయవాడ రెవెన్యూ డివిజన్ లోని పెనమలూరు మండలంలో ఉంది. ఇది విజయవాడ నగరపాలకసంస్థ ప్రధాన శివారు ప్రాంతం.[4]
2017 మార్చి 23 న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవెలప్మెంట్ డిపార్ట్మెంటు జి.ఓ. 104 ప్రకారం, ఇది విజయవాడ మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగంగా మారింది.[5][6]
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం తాడిగడప జనాభా గణనలో 17,462 మంది జనాభా ఉన్నారు, ఇందులో 8,860 మంది మగవారు, 8,602 మంది మహిళలు ఉన్నారు. అలాగే 0-6 ఏళ్ళ వయస్సు ఉన్న చిన్నారుల జనాభా 1659 లో ఉండగా, ఇది తాడిగడప మొత్తం జనాభాలో 9.50%గా ఉంది. తాడిగడప సెన్సస్ టౌన్ లో, మహిళా సెక్స్ నిష్పత్తి 971 ఉండగా ఇది రాష్ట్ర సగటు 993 కి కంటే ఎక్కువగా ఉంది. అంతేకాకుండా, తాడిగడపలో పిల్లల సెక్స్ నిష్పత్తి దాదాపుగా 956 గా ఉంది, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 939 తో పోల్చితే ఎక్కువగా ఉంది. తాడిగడప పట్టణం అక్షరాస్యత శాతం 78.26%, రాష్ట్ర సగటు 67.02% కంటే ఎక్కువ. పట్టణంలో, పురుష అక్షరాస్యత 81.86%, స్త్రీ అక్షరాస్యత రేటు 74.56%.
తాడిగడప సెన్సస్ టౌన్ మొత్తం నిర్వహణలో 4,623 గృహాలు ఉన్నాయి, మంచినీటి వసతి, మురికినీరు వంటి ప్రాథమిక సదుపాయాలను ఇది కలగ చేస్తుంది. ఇది సెన్సస్ టౌన్ పరిమితుల్లో రోడ్లు నిర్మించడానికి, దాని అధికార పరిధిలో వచ్చే ఆస్తులపై పన్నులను విధించేందుకు కూడా అధికారం కలిగి ఉంటుంది. తాడిగడప పట్టణం మొత్తం జనాభాలో షెడ్యూల్ కులం (ఎస్.సి.) 15.42%, షెడ్యూల్ ట్రైబ్ (ఎస్టీ) 0.88% మంది ఉన్నారు.
మొత్తం జనాభాలో 6,625 మంది పని లేదా వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఇందులో 4,907 మంది మగవారు, 1,718 మంది స్త్రీలు ఉన్నారు. జనాభా లెక్కల సర్వేలో, పనిచేయువాడు అనగా; వ్యాపారం, ఉద్యోగం, సేవా, వ్యవసాయదారుడు, కార్మిక కార్యకలాపాలను నిర్వహించేవాడు అని అర్థం. మొత్తం పనిలో 6625 మంది పనిచేస్తున్నప్పుడు, 94.48% మంది ప్రధాన (మెయిన్ వర్క్లో) పనులలో పాల్గొంటున్నారు, అదే సమయంలో 5.52% మొత్తం కార్మికులు సాధారణ (అండర్ వర్క్) పనిలో నిమగ్నమయ్యారు.
ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను ప్రభుత్వం అందించుతుంది, అలాగే ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, రాష్ట్ర విద్యా శాఖ కింద పనిచేస్తాయి.[8][9] వివిధ పాఠశాలలు తెలుగు, ఆంగ్లం మాధ్యమంలో అనుసరిస్తూ బోధన జరుగుతుంది. చైతన్యభారతి జూనియర్ కాలేజి. జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, శ్రీ శాయి పబ్లిక్ పాఠశాల, విజయలక్ష్మి ప్రాథమికోన్నత పాఠశాల తాడిగడపలో ఉన్నాయి.
ఈ గ్రామంలో, 2014, అక్టోబరు-2న గాంధీ జయంతి సందర్భంగా, ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా, గ్రామీణ ప్రాంతాలవారికి స్వచ్ఛమైన, శుద్ధి చేసిన, 20 లీటర్ల మంచినీటిని, రెండు రూపాయలకే అందిస్తున్నారు.
కిలారు శ్రీనివాసరావు తన తండ్రి రామచంద్రరావు జ్జ్ఞాపకార్థం పెనమలూరు పంచాయితీకి రూ.4 లక్షలు విలువ కలిగిన ట్రాక్టరుతో పాటు ట్రక్కును, 25 మంది పారిశుద్ధ కార్మికులకు నూతన వస్త్రాలు స్థానిక ఎమ్మేల్యే బోడేప్రసాద్ పెనమలూరు పంచాయితీకి అందజేశారు.[10]
శ్రీ సీతారామస్వామివారి దేవాలయం:- ఈ దేవాలయంలో 2014, మార్చి-4వ తేదీ నుండి 8వ తేదీ వరకూ, 5 రోజుల పాటు, కుంభాభిషేకమహోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా, వేదస్వస్తి, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, గోపూజ, దీక్షాధారణ, పంచగవ్యారాధన, అఖండ దీపారాధన, అంకురార్పణ నిర్వహించారు.
శ్రీ సీతారామస్వామివారి ఆలయం:- తాడిగడప శ్రీనివాసనగర్ కట్ట రామానగర్ లోని రామాలయంలో, 2014, ఏప్రిల్-4, శుక్రవారం నాడు, శ్రీ సీతారామస్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుండి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ముగింపు రోజున స్వామివారికి ప్రత్యేకపూజలు చేసారు. ఈ సందర్భంగా అన్నసమారాధన నిర్వహించారు.
శ్రీ కాళహస్తీశ్వరస్వామివారి ఆలయం.
శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయ మూడవ వార్షికోత్సవం సందర్భంగా, 2015, ఆగస్టు-31వ తేదీ సోమవారంనాడు, ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు.
ఈ గ్రామానికి చెందిన చిత్రకారుడు పామర్తి శివనాగరావు, 2014, జూలై-3వ తేదీన కానూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో, పురికొసతో గౌతమబుద్ధుడి బొమ్మను రూపొందించారు. ఈయన ప్రతిభను గుర్తించిన "మిరకిల్ వరల్డ్ రికార్డ్స్" అను సంస్థ జ్యూరీ సభ్యుడు తిమ్మిరి రవీంద్ర, వీరికి 2014, జూలై-13 నాడు, ఒంగోలులో జరిగిన ఒక కార్యక్రమంలో, వీరికి తమ సంస్థ తరఫున, పురస్కారాన్ని అందజేసినారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపక అధ్యక్షులైన డా. చింతపట్ల, 2014, ఆగస్టు-6న హైదరాబాదులో జరిగిన ఒక కార్యక్రమంలో, వీరికి ఆ సంస్థ తరపున గూడా ఒక పురస్కారాన్ని అందజేసారు. ఈ చిత్రానికి, వీరికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ, మెమెంటోతోపాటు, ప్రశంసాపత్రం అందజేసినది. ఈ చిత్రానికి గుజరాతుకు చెందిన "వరల్డ్ ఎమేజింగ్ రికార్డ్స్" మరియూ "వరల్డ్ రికార్డ్స్ ఇండియా" అను సంస్థలు గూడా తమ పురస్కారాలను అందజేసినవి. వీరికి లండనుకు చెందిన "వండర్ బూక్ ఆఫ్ రికార్డ్స్" అను సంస్థ వారు, మరియొక ప్రపంచ పురస్కారాన్ని అందజేసినారు. 1997 నుండి ఇప్పటివరకు, వివిధ వస్తువులపై వీరు వేసిన సూక్ష్మ (మైక్రో) చిత్రాలకు వీరికి ఈ పురస్కారం లభించింది. సుద్దముక్కలు, బియ్యం గింజలపై వీరు వేసిన చిత్రాలకు వీరికి ఈ పురస్కారం లభించింది.
ఇతను ఏప్రిల్-2015లో, "మహర్షి" అను, 8 నిమిషాల నిడివి గల ఒక లఘుచిత్రాన్ని, కేవలం 8 గంటలలో నిర్మించడంతోపాటు, ఆ చిత్రానికి 20 శాఖలలో పనిచేసారు.ఇతని ప్రతిభను గుర్తించిన లండనుకు చెందిన వండర్ బుక ఆఫ్ రికార్డ్స్ సంస్థ పురస్కారం అందజేసారు. ఈ లఘుచిత్రానికి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్శ్ లో స్థానం దక్కింది. ఆ సంస్థవారు ఒక ఙాపికను, ధ్రువపత్రాన్నీ అందజేసారు.
ఇప్పటి వరకుఇతను గీసిన బుద్ధుడి బొమ్మకు, 18 పురస్కారాలు అందాయి. తాజాగా మరి రెండు పురస్కారాలు లభించినవి. ఒకటి నేపాలులోని ఎవరెస్టు వరల్డ్ రికార్డ్స్ వారి నుండి, లండనులోని వార్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి నుండి అందాయి.
సుద్దముక్కపై 9 మిల్లీ మీటర్ల పొడవుతో అతి చిన్న వినాయకుడి విగ్రహాన్ని చెక్కారు. ప్రతిభను గుర్తించిన అమెరికాకు చెందిన రికార్డు సెట్టర్ సంస్థ, దీనిని అరుదైన అంశంగా నమోదు చేసుకుంది.
ఈ గ్రామానికి చెందిన కె.జయానందచౌదరి, నూజివీడులోని ఐ.ఐ.ఐ.టి.లో చదువుచున్నాడు. ఇతడు అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో, 2014, మే-14 నుండి 18 వరకు, అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన "నాసా" నిర్వహించిన పోటీలలో పాల్గొని, తన ప్రతిభతో రూపొందించిన, "ర్యానిమర్ - మ్యాన్స్ మ్యానిఫెస్టేషన్" అను ప్రాజక్టుకు ద్వితీయ బహుమతి పొందినాడు.
↑"School Eduvation Department"(PDF). School Education Department, Government of Andhra Pradesh. Archived from the original(PDF) on 7 November 2016. Retrieved 7 November 2016.