తాన్య మానిక్తలా (జననం 1997 జూలై 7) ప్రధానంగా హిందీ వెబ్ షోలలో పనిచేసే భారతీయ నటి. ఫ్లేమ్స్ (2018)లో ఇషితా పాత్ర, ఎ సూటబుల్ బాయ్ (2020)లో లతా మెహ్రా పాత్రలను పోషించిన ఆమె బాగా ప్రసిద్ది చెందింది.[1][2]
టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2020లో ఎ సూటబుల్ బాయ్ కి గాను ఆమెను రైజింగ్ స్టార్స్ అవార్డ్ వరించింది.[3]
ఆమె 1997 జూలై 7న ఢిల్లీలో జన్మించింది.[4] ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని శివాజీ కళాశాల నుండి పట్టభద్రురాలైంది. ఆమె కెరీర్ కాపీ రైటర్‌గా ప్రారంభించింది.[5]