వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మాగిన థిలాన్ తుషార మిరాండో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | బలపిటియ, శ్రీలంక | 1981 మార్చి 1||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి మీడియం-ఫాస్ట్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 96) | 2003 జూన్ 27 - వెస్టిండీస్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2010 నవంబరు 19 - వెస్టిండీస్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 136) | 2008 ఏప్రిల్ 15 - వెస్టిండీస్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2010 జూన్ 7 - జింబాబ్వే తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 23) | 2008 అక్టోబరు 10 - జింబాబ్వే తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2010 మే 11 - భారతదేశం తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2009–2011 | చెన్నై సూపర్ కింగ్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2007–2008 | సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2006–2007 | కోల్ట్స్ క్రికెట్ క్లబ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2001–2006 | నాన్‌డిస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1998–2001 | సింగ స్పోర్ట్స్ క్లబ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2011 ఫిబ్రవరి 8 |
మాగిన థిలాన్ తుషార మిరాండో, శ్రీలంక మాజీ క్రికెటర్. ఇతను క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లలో ఆడాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, ఎడమచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్ గా రాణించాడు. 2010 తర్వాత అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించనప్పటికీ, మూర్స్ స్పోర్ట్స్ క్లబ్ కోసం శ్రీలంక దేశీయ పోటీలలో తుషార క్రియాశీల సభ్యుడిగా ఉన్నాడు.
మాగిన థిలాన్ తుషార మిరాండో 1981, మార్చి 1న శ్రీలంకలోని బలపిటియలో జన్మించాడు.
1998-99లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. శ్రీలంక ప్రీమియర్ ఫాస్ట్-బౌలింగ్ అకాడమీలో స్పెల్ తర్వాత సెలెక్టర్లను ఆకట్టుకోవడంతో దక్షిణాఫ్రికాతో పర్యటన కోసం టెస్ట్ జట్టులో చేర్చబడ్డాడు. 2004 ఆగస్టు 17న 2004 ఎస్ఎల్సీ ట్వంటీ 20 టోర్నమెంట్‌లో నాన్‌డిస్క్రిప్ట్ క్రికెట్ క్లబ్ కోసం తన ట్వంటీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[1]
2006/2007లో శ్రీలంకలో దాని ప్రావిన్సుల మధ్య జరిగిన కందురాట మెరూన్స్‌లో ఫస్ట్ క్లాస్ సిరీస్‌లో గొప్ప ఆటతీరును కనబరిచాడు.
2009, ఫిబ్రవరి 6న జరిగిన ఐసిఎల్ వేలంలో $140000కు కొనుగోలు చేయబడి, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున అతను కొన్ని మ్యాచ్ లు ఆడాడు.[2]
హంబన్‌తోట ట్రూపర్స్ కోసం 2016 సూపర్ ట్వంటీ20 ప్రావిన్షియల్ టోర్నమెంట్ కోసం కూడా ఆడాడు.
2003లో వెస్టిండీస్ పర్యటనలో టెస్ట్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసి, ఆ సిరీస్‌లో పెద్దగా రాణించలేకపోయాడు.
2008 వెస్టిండీస్ పర్యటనలో ఆడేందుకు ఎంపికయ్యాడు. అందులో మొదటి మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీశాడు. ఆ తరువాతి మ్యాచ్‌లో మూడు వికెట్లు సాధించాడు. తన వన్డే కెరీర్‌లో తన మొదటి బంతికే వికెట్ తీశాడు. క్రికెట్ లో ఆ మార్క్‌ను సాధించిన 18వ బౌలర్‌గా, ఈ ఘనత సాధించిన మూడవ శ్రీలంక బౌలర్‌గా కూడా నిలిచాడు.[3]
వన్డే సిరీస్‌లో శ్రీలంకలో భారత్‌పై 5/47తోసహా బౌల్‌తో 10 వికెట్లు తీసుకున్నాడు, సిరీస్ సమయంలో కెరీర్ బెస్ట్ స్కోరు 54*తోసహా 168 పరుగులు చేశాడు.
2008-2010 కాలంలో చమిందా వాస్ రిటైర్మెంట్, గాయపడిన లసిత్ మలింగ స్థానాన్ని పూరించగలిగాడు.
2009లో ఐసీసీ వారిచే ప్రపంచ వన్డే XIలో 12వ వ్యక్తిగా ఎంపికయ్యాడు.[4]
2010లో జింబాబ్వేలో ముక్కోణపు వన్డే సిరీస్ ఆడేందుకు ఎంపికయ్యాడు. అందులో తన చివరి వన్డే మ్యాచ్‌లో హామిల్టన్ మసకద్జాని ఔట్ చేసి తన 50వ వన్డే వికెట్‌ని పొందాడు.