దగ్గుబాటి సురేష్ బాబు | |
---|---|
జననం | [1] ఇండియా | 1958 డిసెంబరు 24
విద్యాసంస్థ | మిచిగాన్ విశ్వవిద్యాలయం |
వృత్తి | సినీ నిర్మాత |
పిల్లలు | దగ్గుబాటి రానా[2] మాళవిక, అభిరామ్ |
తల్లిదండ్రులు | దగ్గుబాటి రామానాయుడు[3] దగ్గుబాటి రాజేశ్వరి |
దగ్గుబాటి సురేష్ బాబు ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత.[4] సురేష్ ప్రొడక్షన్స్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బొబ్బిలి రాజా, కూలీ నెం 1, ప్రేమించుకుందాం రా, గణేష్, కలిసుందాం రా, జయం మనదేరా, నువ్వు లేక నేను లేన, మల్లీశ్వరి, తులసి, దృశ్యం, గోపాల గోపాల తదితర చిత్రాలను నిర్మించారు.
సురేష్ బాబు ప్రఖ్యాత నిర్మాత, మూవీమొఘల్‌గా పేరుగాంచిన డి.రామానాయుడు కుమారుడు. మద్రాసులోని డాన్ బాస్కో పాఠశాలలో పాఠశాల విద్య పూర్తిచేశారు. ఆయన చెన్నైలోని లయోలా కళాశాలలో పీయూసీ పూర్తిచేశారు. మిచిగాన్ విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి, 1981లో మిచిగాన్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్నారు.[3]
చిత్రనిర్మాణ రంగంలోకి 1982లోనే దేవతతో అడుగుపెట్టినా బొబ్బిలి రాజా సినిమాతోనే ఆయన పేరును నిర్మాతగా వేసుకోవడం ప్రారంభించారు.[3]
2011-12 సంవత్సరానికి గాను ఎ పి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు అధ్యక్షునిగా వ్యవహరించారు.[4]
{{cite web}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)
{{cite news}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)