దీపికా కామయ్య | |
---|---|
జననం | |
వృత్తి | సినిమా నటి, మోడల్. |
క్రియాశీల సంవత్సరాలు | 2011 - ప్రస్తుతం |
దీపికా కామయ్య (ఆంగ్లం: Deepika Kamaiah) బాలీవుడ్, దక్షిణ భారత సినిమా నటి, మోడల్. ఫెమినా మిస్ ఇండియా ఫైనల్‌కు చేరిన దీపికా కన్నడ బిగ్ బాస్ రెండో సీజన్లో కూడా పాల్గొన్నది.
దీపికా కర్ణాటక రాజధాని బెంగళూరులో జన్మించింది. తల్లి ఉపాధ్యాయురాలు. దీపికా బెంగుళూరులోని కేంద్రీయ విద్యాలయంలో చదివింది. 2009లో బిషప్ కాటన్ ఉమెన్స్ క్రిస్టియన్ కళాశాల నుండి బీకామ్ పూర్తి చేసింది.
11వ తరగతి చదువుతున్నప్పుడే మోడలింగ్ లోకి ప్రవేశించిన దీపికా, 2009లో ఫెమినా మిస్ ఇండియా సౌత్ అందాల పోటీలో ఫైనలిస్ట్‌లలో ఒకరిగా నిలిచింది. 2010లో లైక్రా ఎంటీవి స్టైల్ అవార్డులను కూడా గెలుచుకుంది.
తమిళ దర్శకుడు కులైందై వీరప్పన్ దర్శకత్వం వహించిన అన్మై తవరేల్ సినిమాలో తొలిసారిగా నటించింది.[1] 2012లో వచ్చిన చింగారి అనే కన్నడ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. తన నటనకు ప్రశంసలు అందుకుంది. [2][3] దీపక్ తిమ్మయ్య దర్శకత్వం వహించిన నేనే బారి నేనే అనే సినిమాలో కూడా నటించింది.[4] ఆటో రాజా సినిమాలో నటించింది.[5] రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో షాహిద్ కపూర్, ఇలియానా నటించిన ఫాటా పోస్టర్ నిక్లా హీరో సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.[6] [7]
సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2011 | ఆణ్మై తవరేల్ | నందిని | తమిళం | |
2012 | చింగారి | గీత | కన్నడ | |
2013 | ఆటో రాజా | రాగిణి | కన్నడ | ఉత్తమ సహాయ నటిగా సైమా అవార్డుకు నామినేట్ చేయబడింది |
2013 | ఫటా పోస్టర్ నిక్లా హీరో | హిందీ | ||
2014 | డమాల్ డుమీల్ | తమిళం | ||
2015 | నేనే బారి నేనే | కన్నడ | ఉత్తమ సహాయ నటిగా సైమా అవార్డుకు నామినేట్ చేయబడింది | |
2016 | జగ్గు దాదా | కన్నడ | అతిథి పాత్ర | |
2016 | దేవరవ్నే బిదు గురూ | కన్నడ | [8] |
{{cite web}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)
{{cite web}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)
{{cite web}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)
{{cite web}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)