దునియా విజయ్ | |
---|---|
జననం | బి. ఆర్. విజయ్ కుమార్ 20 జనవరి 1974 కుంబరన్హల్లి, అనేకల్, కర్ణాటక, భారతదేశం |
వృత్తి | నటుడు, దర్శకుడు, సినిమా నిర్మాత, స్క్రీన్ రైటర్ |
క్రియాశీల సంవత్సరాలు | 2001 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి |
|
పిల్లలు | 3 |
పురస్కారాలు | ఉత్తమ నటుడిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారం |
బి.ఆర్. విజయ్ కుమార్ (జననం 1974 జనవరి 20) కన్నడ భాషా చిత్రాలలో నటించే భారతీయ కళాకారుడు. వృత్తిపరంగా దునియా విజయ్ గా పిలవబడుతాడు. చిన్న పాత్రలు చేస్తూ సినీ కెరీర్‌ను ప్రారంభించిన అతడికి 2007లో వచ్చిన దునియా సినిమా ఒక్కసారిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతో కెరీర్ లో దూసుకుపోయిన అతను చందా (2007), జంగ్లీ (2009), జానీ మేరా నామ్ ప్రీతి మేరా కామ్ (2011), జయమ్మన మగా (2013) చిత్రాలతో తన నటనకు మరింత ప్రసిద్ది చెందాడు.
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి (2023)లో బాలకృష్ణ కథానాయకుడు, శ్రుతిహాసన్ కథానాయిక కాగా ప్రతినాయకుడిగా దునియా విజయ్ తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు.[1]
2004లో రంగ (SSLC) చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తరువాత అతను జోగి, శ్రీ మొదలైన చిత్రాలతో పాటు టెలివిజన్ ధారావాహికలలో కూడా నటించాడు.
అతని స్నేహితుడు సూరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం దునియాతో బి.ఆర్. విజయ్ కుమార్ కెరీర్లో టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఈ చిత్రంలో అమాయక పల్లెటూరి కుర్రాడిగా అతను నటించాడు, అతని నటన విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను పొందింది. ఈ చిత్రంలో తన పాత్రకు కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దునియా విజయ్ ని వరించాయి.
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | ఇతర విషయాలు |
2004 | రంగా (SSLC) | ||
2005 | జోగి | ||
2005 | రిషి | ||
2005 | డెడ్లీ సోమ | ||
2005 | గిరి | ||
2005 | రాక్షస | ||
2005 | మెంటల్ మాంజా | ||
2006 | శ్రీ | ||
2006 | అంబి | ||
2006 | కల్లరాలి హూవాగి | ||
2007 | శ్రీ క్షేత్ర కైవర తాతయ్య | అతిధి పాత్ర | |
2007 | గుణ | అతిధి పాత్ర | |
2007 | దునియా | ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు | |
ఉత్తమ నటుడిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారం | |||
2007 | యుగ | ||
2007 | గెలీయా | ||
2007 | చందా | ||
2007 | ఈ రాజీవ్ గాంధీ అల్లా | ||
2008 | అవ్వ | ||
2008 | స్లమ్ బాలా | ||
2009 | జంగ్లీ | ||
2009 | థాకత్ | ||
2009 | దేవ్రు | ||
2010 | శంకర్ IPS | ||
2010 | కరి చిరతే | ||
2010 | కంఠీరవ | ||
2010 | ఐతలక్కడి | అతిథి పాత్ర | |
2011 | వీర బాహు | ||
2011 | జానీ మేరా నామ్ ప్రీతి మేరా కామ్ | ||
2011 | జరాసంధ | ||
2012 | భీమ తీరదల్లి | నటుడిగా సువర్ణ క్రిటిక్స్ అవార్డు | |
2012 | రజనీకాంత | ద్విపాత్రాభినయం | |
2013 | జయమ్మన మగా | ||
2014 | శివాజీనగర | ||
2014 | సింహాద్రి | ||
2015 | జాక్సన్ | ||
2015 | దక్ష | ||
2015 | RX సూరి | ||
2015 | రింగు రోడ్డు | ||
2016 | దాన కాయోను | ||
2017 | మస్తీ గుడి | ||
2018 | కనక | ||
2018 | జానీ జానీ ఎస్ఎ స్ పాపా | ||
2021 | సలగ | దర్శకుడు కూడా | |
2022 | భీమ | దర్శకుడు కూడా | |
2023 | వీర సింహ రెడ్డి | ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి | తెలుగు అరంగేట్రం[2] |
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)