దుర్గి

దుర్గి
రాధాకృష్ణ మందిరం, దుర్గి
రాధాకృష్ణ మందిరం, దుర్గి
పటం
దుర్గి is located in ఆంధ్రప్రదేశ్
దుర్గి
దుర్గి
అక్షాంశ రేఖాంశాలు: 16°23′N 79°31′E / 16.383°N 79.517°E / 16.383; 79.517
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు
మండలందుర్గి
విస్తీర్ణం
57.62 కి.మీ2 (22.25 చ. మై)
జనాభా
 (2011)
9,480
 • జనసాంద్రత160/కి.మీ2 (430/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు4,682
 • స్త్రీలు4,798
 • లింగ నిష్పత్తి1,025
 • నివాసాలు2,417
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్522612
2011 జనగణన కోడ్589824

దుర్గి పల్నాడు జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన మాచర్ల నుండి 10 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2417 ఇళ్లతో, 9480 జనాభాతో 5762 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4682, ఆడవారి సంఖ్య 4798. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 825 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 393. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589824.[1]

సమీప గ్రామాలు

[మార్చు]

ఓబులేశునిపల్లి 2 కి.మీ, ఆత్మకూరు 4 కి.మీ, ధర్మవరం 3 కి.మీ, రాయవరం 7 కి.మీ, నిదానంపాడు 7 కి.మీ.

గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7.634. ఇందులో పురుషుల సంఖ్య 3,870, స్త్రీల సంఖ్య 3,764, గ్రామంలో నివాస గృహాలు 1,779 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 5,762 హెక్టారులు.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 10, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. సమీప బాలబడి మాచర్లలో ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్, డిగ్రీ కళాశాల మాచర్లలోను, ఇంజనీరింగ్ కళాశాల అలుగురాజుపల్లి లోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు అలుగురాజుపల్లి లోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మాచర్లలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులోనూ ఉన్నాయి.

ప్రభుత్వ జూనియర్ కళాశాల

[మార్చు]
  • ఈ కళాశాల 13వ వార్షికోత్సం, 2014,ఫిబ్రవరి-24న జరిగింది.
  • ఇటీవల ప్రచురించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియేట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలలో, ఈ కళాశాల విద్యార్థి, సంకుల విజయ్ అను విద్యార్థి, 1000 మార్కులకుగాను 935 మార్కులు సంపాదించి, రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కాళాశాలలన్నిటిలోనూ ప్రథమస్థానం పొందాడు.

సాయి బనీత్ "ఐ " సర్వీసెస్ & కంప్యూటర్ ఇన్స్టిట్యూట్

[మార్చు]

సొసైటీ ఆఫీసు ఎదురు రోడ్, దుర్గి.

కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల (ఆదర్శ పాఠశాల)

[మార్చు]

ఈ పాఠశాలను గ్రామానికి 2 కి.మీ.దూరంలో, 3 సంవత్సరాల క్రితం, 5 ఎకరాల స్థలంలో, 5 కోట్ల రూపాయల వ్యయంటో నిర్మించారు. ఈ పాఠశాలకు విశాలమైన క్రీడా మైదానం ఉంది. ఐదువేల పుస్తకాలు ఉన్న ఈ పాఠశాలలోని గ్రంథాలయం, ఒకేసారి 100 మంది విద్యార్థినులు కూర్చుని చదువుకొనడానికి వీలుగా ఉంది. ఈ పాఠశాలలో ప్రస్తుతం ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియేట్ వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేస్తున్నారు. త్వరలో వసతిగృహం నిర్మాణానికి నిధులు మంజూరు అయినవి. ఈ పాఠశాలలో ప్రస్తుతం 200 మంది బాలికలు విద్యనభ్యసించుచున్నారు. 2016,ఫిబ్రవరి-6న ఈ పాఠశాల తృతీయ వార్షికోత్సవాలు నిర్వహించారు.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

[మార్చు]

అప్పటి ప్రధానోపాధ్యాయులు వడ్లమాని నరసింహాచార్యులవారు ఈ పాఠశాల ఏర్పాటుకు నడుం బిగించి, విశేషకృషి చేసారు. వీరి కృషిని పలువురకు తెలియ చెప్పాలనే ఉద్దేశంతో, వారి కుటుంబసభ్యులు, ఈ పాఠశాలలో ఒక లక్ష రూపాయల వ్యయంతో వారి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించుటకై, 2016, డిసెంబరు-3న శంకుస్థాపన నిర్వహించారు. వీరి విగ్రహాన్ని 2017, జనవరి- 25న, విశ్రాంత ఐ.జి. చిరుమామిళ్ళ వెంకటనరసయ్య ఆవిష్కరించారు. ఈ పాఠశాల, గ్రామస్థుల పూర్వ విద్యార్థుల చేయూతతో అభివృద్ధిపథంలో పయనించుచున్నది. కార్పొరేటు పాఠశాలలకు సమానంగా అన్ని వసతులతో తులతూగుచూ విద్యార్థులకు మంచి విద్యనందించుచున్నది. ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు దేశ, విదేశాలలో రాణించుచున్నారు. ఈ పాఠశాల 66వ వార్షికోత్సవ వేడుకలు 2016, జనవరి-2 వతేదీనాడు నిర్వహించారు. ఈ పాఠశాలలో అత్యాధునిక భవనాలు, పాఠశాల ఆవరణలో నందనవనంలాగా చెట్లు ఉండి జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు పొందినది. తాజాగా ఈ పాఠశాల చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగించి, ఆవరణను శుభ్రపరచి, పాఠశాల చుట్టూ కంచె వేసి, మొక్కలు నాటుచున్నారు. సాయితేజ ఇంగ్లీషు మీడియం హైస్కూల్ చలపతి పబ్లిక్ స్కూల్ ఉర్దూ పాఠశాల

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

దుర్గిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోఒక డాక్టరు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.ఒకపశు వైద్యశాలలో ఒక డాక్టరు,ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో 5 ప్రభుత్వేతర వైద్య సౌకర్యాలున్నాయి. ఉన్నారు. ఇద్దరు డిగ్రీ లేని డాక్టర్లు, ఇద్దరు నాటు వైద్యులు ఉన్నారు.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది.కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి నీటిపారుదల వసతి ఉంది. చెరువు నీటి సౌకర్యం ఉంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు.మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు.గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది.సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు.ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు.సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

దుర్గిలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.పబ్లిక్ ఫోన్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు, ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది.వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు (భారతీయ స్టేట్ బ్యాంక్), వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది.అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

దుర్గిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 53 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 893 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 2027 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 1326 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూ క్షేత్రం: 1463 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూ క్షేత్రం: 814 హెక్టార్లు
  • నీటి వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూక్షేత్రం: 649 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

దుర్గిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది

  • బావులు/బోరు బావులు: 649 హెక్టార్లు

తయారీ

[మార్చు]

దుర్గిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి (అవరోహణ క్రమంలో):

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

ప్రత్తి, మిరప, కంది

మౌలిక వసతులు

[మార్చు]

దుర్గి మిర్చి యార్డు

[మార్చు]

ఈ యార్డుకు కేటాయించిన స్థలంలోని 20 ఎకరాలలో 2016,మే-20వ శుక్రవారంనాడు, ఈ స్థలాన్ని శుభ్రంచేసి కొబ్బరికాయకొట్టి యార్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినారు. త్వరలో శంఖుస్త్థాపన నిర్వహించెదరు. దుర్గి మండలంలోని ఆత్మకూరు గ్రామ సమీపములో, 2016, డిసెంబరు-27న దుర్గి మిర్చి యార్డు నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.

వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

[మార్చు]

ఎల్లప్పకుంట:- రాబోయే తరాల వారికి సాగు, త్రాగునీటి కష్టాలు రాకుండా, దుర్గి గ్రామ శివారులో ఉన్న ఈ కుంటలో, నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, 5 లక్షల రూపాయల అంచనావ్యయంతో, పూడికతీత పనులు చేపట్టినారు. రైతులు తమ ట్రాక్టర్లతో సారవంతమైన పూడికమట్టిని తమ పొలాలకు తరలించుకొనిపోయుచున్నారు. ఈ విధంగా చేయుట వలన, తమ పొలాలకు ఎరువుల ఖర్చు తగ్గుటయేగాక, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరిగి, భూగర్భజలాలు అభివృద్ధిచెంది, బోర్లలో నీరు చేరుతుందని, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో ఎల్లెబోయిన రమణ, సర్పంచిగా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ నక్కనబోయిన చినవెంకటేశ్వర్లు ఎన్నికైనారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం, మొదటి రెండున్నర సంవత్సరాలు రమణ సర్పంచిగా పనిచేసి ఇప్పుడు రాజీనామా చేయగా ఆ పదవిని చినవెంకటేశ్వర్లు చేపట్టనున్నారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శిల్పకళా ప్రశస్తి

[మార్చు]

"దుర్గి" లోని శిల్పకళాకేంద్రాలు చేతివృత్తులవారి నైపుణ్యానికి అద్దం పడతాయి. సా.శ. 12వ శతాబ్దంలోనే దుర్గి శిల్పకళకు బీజం పడినట్లు తెలుస్తోంది. గ్రామంలోని శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి,ఓంకారేశ్వర, నగరేశ్వర, నాగేశ్వర, వీరభద్ర, వేణుగోపాల స్వామి దేవాలయాలను స్థానికులే నిర్మించినట్లు శిలాశాసనాలు తెల్పుచున్నవి. మాచర్ల చెన్నకేశవస్వామి, వీరభద్రస్వామి దేవాలయాలయాలు, అమరావతి, నాగార్జునకొండలలో నిర్మించిన బౌద్ధస్థూపాల నిర్మాణం వెనుక దుర్గి శిల్పుల పాత్ర ఉన్నట్లు చరిత్రకారుల కథనం. తదనంతరం శిల్పకళాపోషకులు అంతరించే దశకు చేరటంతో, శిల్పకళకు జీవం పోసేందుకు ప్రభుత్వం, 1962 లో దుర్గిలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వందలమందికి శిక్షణ ఇచ్చి, శిల్పులను తయారు చేసింది. ఇప్పటికీ నాగార్జున శిల్పకళాకేంద్రంలో శిక్షణ ఇస్తున్నారు. 1984 లో హైదరాబాదులో విఘ్నేశ్వర ఉత్సవాల సందర్భంగా, ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాల ప్రదర్శనలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్.టి.రామారావు తిలకించి సన్మానం చేశాడు. ఒకప్పటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి అంజయ్య కూడా శిల్పకళాకేంద్రాన్ని దర్శించాడు. 1996 లో స్టోనా-96 పేరిట బెంగళూరులో నిర్వహించిన ప్రపంచ శిల్పవిగ్రహ ప్రదర్శనలో పాల్గొనాలని కేంద్రప్రభుత్వం దుర్గి శిల్పకళాకేంద్రానికి ఆహ్వానం పంపింది[2]

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయంలో, స్వామివారి బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం, ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున, అంగరంగ వైభవంగా నిర్వహించెదరు. ఈ ఆలయానికి జంగమహేశ్వరపాడు గ్రామ సమీపంలో 31 ఎకరాల మాన్యం భూమి ఉన్న్నది. [20]

శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయంలో, అమ్మవారి జన్మదిన వేడుకలను, ఉగాది పురస్కరించుకొని ప్రతి సంవత్సరం, గ్రామస్థులు నిర్వహించటం ఆనవాయితీగా వస్తున్నది. ఇందులో భాగంగా, ఉగాదిరోజున ఉదయం, గ్రామమహిళలు పుట్టింటి పసుపు, కుంకుమలను గ్రామంలోని ప్రధానవీధులలో మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొనివెళ్ళి అమ్మవారికి సమర్పించెదరు. సాయంత్రం పలువురు మహిళలు కుంకుమ పూజలు చేసెదరు. ఈ సందర్భంగా దేవాలయాన్ని, విద్యుద్దీపాలతో అలంకరించెదరు. భక్తులు అమ్మవారి సన్నిధికి తరలివచ్చి, మ్రొక్కుబడులు చెల్లించుకుంటారు.

శ్రీ నగరేశ్వర, నాగేశ్వర, ఓంకారేశ్వరస్వామివారి ఆలయం

[మార్చు]

శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ ఓంకారేశ్వరస్వామివారి దేవాలయం:- ఈ ఆలయంలో, స్వామివారి కళ్యాణం, ప్రతి సంవత్సరం చైత్రమాసంలో పౌర్ణమి రోజున ఘనంగా నిర్వహించారు.

శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం

[మార్చు]

దుర్గి గ్రామ శివారులో కొలువై యున్నఈ ఆలయంలో నృసింహ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ప్రత్యేక పూజలు చేయుదురు.

శ్రీ రామయోగి తాత ఆలయం

[మార్చు]

దుర్గిశివారులోని గుత్తికొండబిలం రామయోగి తాత 60వ ఆరాధనోత్సవాలు 2014,ఫిబ్రవరి-24న, మాఘ బహుళ దశమి నాడునిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు జిల్లా నుండియేగాక నల్గొండ జిల్లాలోని పలు గ్రామాలనుండి వచ్చారు. ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పలువురు భక్తులు, దాతల సహకారంతో ఈ ఆలయ ప్రాంగణంలో ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు, భారీగా అన్నదానం నిర్వహించారు. సాయంత్రం ఊరేగింపు, రాత్రికి సత్సంగం నిర్వహించారు.రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రాలు నిర్వహించారు. పలువురు భక్తులు స్వామివారి ఆలయంలో రాత్రి జాగారం చేసారు.

శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయంలో, 2015,మే-28వ తేదీ గురువారంనాడు, స్వామివారి శాంతికళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 28,29 తేదీలలో సంప్రోక్షణ, తదితర కార్యక్రమాలు చేపట్టినారు. ఆలయం ముందు, ప్రధాన కూడలిలో ఏర్పాటుచేసిన మండపంలో 30 మంది దంపతులు పీటలమీద కూర్చొని, పలువురి ఋత్విక్కుల వేదమంత్రాల మధ్య స్వామివారి కళ్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని అందజేసినారు. సాయంత్రం, కళ్యాణ వీరభద్రస్వామివారికి, ప్రత్యేక వాహనంలో, గ్రామోత్సవం నిర్వహించారు.

శ్రీ ఆంకాళమ్మ తల్లి ఆలయం

[మార్చు]

ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో, ఈ అలయంలోని అమ్మవారికి కుంకుమబండ్లు కట్టెదరు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. సాయంత్రం అమ్మవారి కుంకుమబండిని గ్రామ వీధులలో ఊరేగించెదరు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేసెదరు.

శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామిస్వామి ఆలయం

[మార్చు]

ఈ ఆలయంనకు విశేషమైన విశిష్టత ఉంది.పుష్యమాసం నెల యందు ఎటువంటి శుభముహుర్తములు ఉండవు కాని ఈ దేవాలయ సంక్రాంత్రి పర్వదినమున ప్రతిష్ఠ జరిగింది.అప్పటి నుండి నిర్విరామంగా స్వామి వారికి భోగి పండుగ రోజున కళ్యాణం,సాయంత్రం నంది వాహనం పై ఊరగింపు,సంక్రాంత్రి రోజున 100 అడుగుల రథోత్సవం,కనుమ రోజున వసంత్సోవం,ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేసెదరు.ఈ ఆలయంనకు నిర్విరామంగా గత 40 సంవత్సరాలుగా వంశపారపర్యంగా స్వామి వారికి కైంకర్యాలు నిర్వహిస్తున్న స్వామి వారి ఆస్థాన ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మంగళగిరి సత్యనారాయణ శాస్త్రి, వారి కుమారులు మంగళగిరి అనిల్ శాస్త్రి, ఆంజనేయ శాస్త్రి గార్లు స్వామి వారివారి సేవలో తరిస్తున్నారు.

ఈ ఆలయ 62వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, 2016, జనవరి-12 నుండి 19 వరకు, ఆలయ వార్షికోత్సవాలు నిర్వహించెదరు. ఈ సందర్భంగా, 14వ తేదీ ఉదయం 11 గంటలకు, ఆలయం వద్ద ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో స్వామివారి కళ్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించెదరు.

శ్రీ గంగమ్మ తల్లి ఆలయం

[మార్చు]

ఈ ఆలయం స్థానిక ముటుకూరు రహదారి సమీపంలో ఉంది.

శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం

[మార్చు]

ఈ దేవుడు 9 అడుగుల ఎత్తు ఉన్నాడు దీని వెనుక ఉట్ల స్తంభం మంటపం ఉంది గ్రామం మధ్యలో ఈ విగ్రహం కలదు ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు.

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

[మార్చు]
  • కాంచనపల్లి కనకమ్మ ప్రముఖ సంస్కృతాంధ్ర రచయిత్రి [3]
  • నర్సింగు పుల్లయ్య చారి హైదరాబాద్లో నివాసం ఏర్పరుచుకొని దేవాదాయ ధర్మదాయ శాఖలో శిల్పిగా తన శిల్పకళను రాష్ట్రాలకి, దేశానికీ, వ్యాప్తిచేసి ఖ్యాతి గడించారు. రెండు సార్లు అమెరికా తెలుగు తానా సభవారు తన శిల్పకళా ప్రతిబకు సత్కరించారు. హంపి ఆస్థాన శిల్పి, స్థపతిగా పేరు గడించాడు. ఎన్నో దేవాలయాలు నిర్మించారు. బద్రీనాథ్ దేవాలయంలో కూడా వీరి హస్తం ఉంది. అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుగారు, స్వయంగా విచ్చేసి పుల్లయ్యచారి శిల్పకళకు ముగ్దుడై సత్కరించారు. మద్దిమడుగు ఆంజనేయస్వామి, కీసర రామలింగేశ్వర దేవాలయం, యాదగిరిగుట్ట, మన్నెంకొండ ఆంజనేయస్వామి, కర్మన్ ఘాట్ అయ్యప్ప దేవాలయం, శ్రీశైలంలోని యాగశాల, కారంపుడిలోని చేన్నకేశవ దేవాలయం, వాసవి కన్యకా దేవాలయం, చింతపల్లిలో జగన్నాథదేవాలయం, ముటుకూరులోని రామాలయం, దుర్గిలోని బ్రహ్మంగారి దేవాలయం, ఇంకా అనేక అనేక దేవాలయాలు రాతితో సిమెంట్ తో నిర్మించారు తన దగ్గర ఎంతో మంది శిల్పులు ట్రైనింగ్ తీసుకున్నారు. ఇపుడు మన రాష్టంలో దేవాదాయశాఖలో ఉన్న ముగ్గురు శిల్పులలో మన పుల్లయ్యచారి మొట్టమొదటివారు.

మూలాలు

[మార్చు]
  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. ఈనాడు గుంటూరు రూరల్, 12 జులై 2013, 8వ పేజీ
  3. కనకాంబ, కాంచనపల్లి (1912-1988), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ. 61.

వెలుపలి లంకెలు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.