దొంగాట | |
---|---|
దర్శకత్వం | దిలీష్ పోతన్ |
రచన | సంజీవ్ పజహూర్ |
నిర్మాత | సందీప్ సేనన్ అనీష్ ఎం. థామస్ |
తారాగణం | ఫహాద్ ఫాజిల్ సూరజ్ వెంజరామూడు నిమిషా సజయన్ |
ఛాయాగ్రహణం | రాజీవ్ రవి |
కూర్పు | కిరణ్ దాస్ |
సంగీతం | బిజిబల్ |
నిర్మాణ సంస్థ | ఆహా ఒరిజినల్స్ |
విడుదల తేదీ | 6 మే 2022(తెలుగు) |
సినిమా నిడివి | 135 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
దొంగాట 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా. 2017లో మలయాళంలో విడుదలైన ‘తొందిముతలం ద్రిక్షక్షియమ్’ సినిమాను ఆహా ఒరిజినల్స్ తెలుగులో చేసిన ఈ సినిమాకు దిలీష్ పోతన్ దర్శకత్వం వహించాడు. ఫహాద్ ఫాజిల్, సూరజ్ వెంజరామూడు, నిమిష సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ‘దొంగాట’ పేరుతో మే 6న ‘ఆహా’ ఓటీటీలో విడుదలైంది.[1] మలయాళంలో విడుదలైన ‘తొందిముతలం ద్రిక్షక్షియమ్’ సినిమాలో నటనకు గానూ ఫహద్ ఫాజిల్ కు ఉత్తమ సహాయ నటుడిగా, సజీవ్ పళూర్ ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌గా, ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు అందుకున్నారు.
ప్రసాద్ (సూరజ్ వెంజరమూడ్),, శ్రీజ (నిమిషా సజయన్) ఇద్దరు ప్రేమించుకొని పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకొని వేరే ఊర్లో కాపురం పెడతారు. భార్య మెడలోని బంగారు తాళిని తాకట్టు పెట్టి వ్యవసాయం కోసం కొన్న భూమిలో బోరు వేయిద్దామనుకొని, గొలుసును అమ్మాలని నిర్ణయించుకొని, బస్సులో ప్రయాణిస్తుండగా ప్రసాద్ (ఫాహద్ ఫాజిల్) అనే దొంగ బంగారు గొలుసును కొట్టేస్తాడు. దీంతో ఆ దొంగపై దంపతులు కేసు నమోదు చేయగా, పోలీసులు విచారణ ప్రారంభిస్తారు. ప్రసాద్ (ఫాహద్ ఫాజిల్) నేరాన్ని అంగీకరిస్తాడా, లేదా అనేదే మిగతా సినిమా కథ.[2][3]