ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
Coordinates: 16°57′43″N 81°15′29″E / 16.962°N 81.258°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఏలూరు జిల్లా |
మండల కేంద్రం | ద్వారకా తిరుమల |
విస్తీర్ణం | |
• మొత్తం | 266 కి.మీ2 (103 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 68,989 |
• సాంద్రత | 260/కి.మీ2 (670/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 983 |
ద్వారకా తిరుమల మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా లోని మండలం.[3]OSM గతిశీల పటము
2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా మొత్తం 63,399, అందులో పురుషులు 32,531 మంది కాగా స్త్రీలు 30,868 మంది ఉన్నారు. అక్షరాస్యత మొత్తం 64.71% - పురుషులు అక్షరాస్యత 68.41% - స్త్రీలు అక్షరాస్యత 60.82%.
ఈ మండలంలో వ్యవసాయం ప్రధానంగా మెరక వ్యవసాయం. చెరువులు, భూగర్భ జలాలు ముఖ్యమైన నీటి వనరులు. పుగాకు, మామిడి, నిమ్మ, పామాయిల్, సపోటా, ప్రొద్దు తిరుగుడు, అపరాలు, జీడిమామిడి వంటి తోటలు అధికంగా ఉన్నాయి. చెరువుల క్రింద కొంత వరి వ్యవసాయం జరుగుతుంది.
ప్రజలకు వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరు. వ్యవసాయాధారిత వ్యాపారము, పరిశ్రమలు పరిమితంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో సిరామిక్ పరిశ్రమలకు పనికొచ్చే బంకమన్ను లభిస్తుంది. అందువలన ద్వారకా తిరుమల పరిసరాలలో పెంకులు, రిఫ్రాక్టరీ ఇటుకలు, సెరామిక్ టైల్స్ పరిశ్రమలు ఉన్నాయి. వరి పండే ప్రాంతాలలో బియ్యం మిల్లులున్నాయి.
శ్రీ వెంకటేశ్వర వికలాంగులకు సర్జరీ రీసెర్చ్ అండ్ రీహాబిలిటేషన్ ఉంది. వి.ఐ.ఆర్.ఆర్.ఢి మొదటి దశలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టి ఉంది.