ధనంజయ డి సిల్వా

ధనంజయ డి సిల్వా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ధనంజయ మదురంగ డి సిల్వా
పుట్టిన తేదీ (1991-09-06) 1991 సెప్టెంబరు 6 (వయసు 33)
హంబన్‌తోట, శ్రీలంక
మారుపేరుధన, మిస్టర్ స్మైల్
ఎత్తు5 అ. 8 అం. (1.73 మీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతిఆఫ్ బ్రేక్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 135)2016 26 జూలై - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు2023 24 జూలై - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 169)2016 16 జూన్ - ఐర్లాండ్ తో
చివరి వన్‌డే2023 31 మార్చ్ - న్యూజీలాండ్ తో
తొలి T20I (క్యాప్ 53)2015 30 జూలై - పాకిస్తాన్ తో
చివరి T20I2023 8 ఏప్రిల్ - న్యూజీలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
Badureliya SC
Kandurata Maroons
Ragama CC
2016–presentTamil Union
2020Jaffna Stallions
2021Colombo Stars
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు టి20 ఫక్లా
మ్యాచ్‌లు 46 65 36 109
చేసిన పరుగులు 2,815 1,393 659 6,899
బ్యాటింగు సగటు 37.53 26.28 20.59 38.32
100లు/50లు 10/11 0/8 0/3 20/30
అత్యుత్తమ స్కోరు 173 91 66* 173
వేసిన బంతులు 3,171 1,670 253 7,605
వికెట్లు 33 37 13 137
బౌలింగు సగటు 53.63 38.13 21.69 30.32
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 5
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/25 3/32 2/22 7/59
క్యాచ్‌లు/స్టంపింగులు 53/0 31/– 15/– 123/–
మూలం: Cricinfo, 13 ఏప్రిల్ 2023

ధనంజయ మదురంగ డి సిల్వా, శ్రీలంక క్రికెటర్.[1] శ్రీలంక తరపున క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లలో, దేశీయ క్రికెట్‌లో తమిళ్ యూనియన్ కోసం ఆడుతున్నాడు, వైస్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. వన్డే, టెస్టుల్లో జాతీయ జట్టు కెప్టెన్ గా ఉన్నాడు. 2017 నవంబరులో శ్రీలంక క్రికెట్ వార్షిక అవార్డులలో 2016–17 సీజన్‌లో టెస్ట్ బ్యాట్స్‌మెన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

డి సిల్వా 1991, సెప్టెంబరు 6న హంబన్‌తోటలో ముగ్గురు సోదరుల కుటుంబంలో రెండవ కొడుకుగా జన్మించాడు. హంబన్‌తోటలోని టిస్సామహారమాలోని డెబెరావెవా నేషనల్ స్కూల్‌లో తన క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించాడు. గాలేకి మారిన తర్వాత కొద్దికాలంపాటు కొలంబోలోని మహానామ కళాశాలలో చేరాడు, గాలేలోని రిచ్‌మండ్ కళాశాలకి వెళ్ళాడు.[3] తన సీనియర్ పాఠశాల క్రికెట్‌ను గాలేలోని రిచ్‌మండ్ కళాశాలలో ఆడాడు. 2010/2011 సీజన్‌లో రిచ్‌మండ్ మొదటి XI క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.[4]

డి సిల్వా తండ్రి రంజన్ డి సిల్వా రాజకీయ నాయకుడు. 2018 మే 25న ఇతని తండ్రిని రత్మలానా ఇంటిముందు గుర్తు తెలియని సాయుధుడు హత్య చేశాడు.[5] తండ్రి ఆకస్మిక మరణంతో, డిసిల్వా వెస్టిండీస్ పర్యటనలో శ్రీలంక జట్టు నుండి వైదొలిగాడు.[6] అయితే రెండో మ్యాచ్ నుంచి టూర్‌లో పాల్గొన్నాడు.[7]

దేశీయ క్రికెట్

[మార్చు]

2018 మార్చిలో డి సిల్వా 2017–18 సూపర్ ఫోర్ ప్రావిన్షియల్ టోర్నమెంట్‌కు కొలంబో జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[8][9] తరువాతి నెలలో 2018 సూపర్ ప్రావిన్షియల్ వన్ డే టోర్నమెంట్ కోసం కొలంబో జట్టులో కూడా ఎంపికయ్యాడు.[10]

2018 ఆగస్టులో డి సిల్వా 2018 ఎస్ఎల్సీ టీ20 లీగ్‌లో గాల్లె జట్టులో ఎంపికయ్యాడు.[11] 2019 మార్చిలో 2019 సూపర్ ప్రావిన్షియల్ వన్ డే టోర్నమెంట్ కోసం గాల్లె జట్టులో ఎంపికయ్యాడు.[12] పోటీ ముగిసిన తరువాత ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు.[13] 2020 అక్టోబరులో లంక ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ కోసం జాఫ్నా స్టాలియన్స్ చేత డ్రాఫ్ట్ చేయబడ్డాడు.[14] 2021 ఆగస్టులో 2021 ఎస్ఎల్సీ ఇన్విటేషనల్ టీ20 లీగ్ టోర్నమెంట్ కోసం ఎస్ఎల్సీ బ్లూస్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[15] 2022 జూలైలో లంక ప్రీమియర్ లీగ్ మూడవ ఎడిషన్ కోసం జాఫ్నా కింగ్స్ చేత సంతకం చేయబడ్డాడు.[16]

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

2015 జూలైలో పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్ కోసం శ్రీలంక ట్వంటీ 20 ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[17] 2015 జూలై 30న టీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు. తన అరంగేట్రం మ్యాచ్‌లో 31 పరుగులు చేశాడు, ఈ మ్యాచ్ లో శ్రీలంక ఓడిపోయింది.[18]

డి సిల్వా 2016 జూన్ 16న ఐర్లాండ్‌పై వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు. 169వ శ్రీలంక వన్డే క్యాప్‌ని అందుకున్నాడు.[19]

2016 జూలైలో డిసిల్వా ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం శ్రీలంక టెస్టు జట్టులో ఎంపికయ్యాడు.[20] 2016 జూలై 26న ఆస్ట్రేలియాపై శ్రీలంక తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.[21] ఒక సిక్సర్, ఓవరాల్‌గా ఐదవ స్కోర్ చేయడం ద్వారా ఒక టెస్ట్ మ్యాచ్‌లో మార్క్ ఆఫ్ చేసిన శ్రీలంక తరపున మొదటి ఆటగాడిగా నిలిచాడు.[22][23][24] మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో పీటర్ నెవిల్‌ను అవుట్ చేయడం ద్వారా అతను తన మొదటి టెస్ట్ వికెట్‌ను తీసుకున్నాడు.

మూలాలు

[మార్చు]
  1. "Dhananjaya de Silva". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-25.
  2. "Gunaratne wins big at SLC's annual awards". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-25.
  3. "New practice cricket strips for Debarawewa NS". The Sunday Times (Sri Lanka). 18 June 2017 – via PressReader.
  4. "Richmond with balanced team". Sunday Observer (Sri Lanka). 20 March 2011. Retrieved 2023-08-25.
  5. "Father of Sri Lankan cricketer Dhananjaya de Silva shot dead". The Hindu. Agence France-Presse. 25 May 2018. Retrieved 2023-08-25.
  6. Fernando, Andrew Fidel (24 May 2018). "Dhananjaya de Silva withdraws from West Indies tour after father killed by gunman". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-25.
  7. "Dhananjaya to return for West Indies tour following father's funeral". ESPNcricinfo. ESPN Inc. 3 June 2018. Retrieved 2023-08-25.
  8. "Cricket: Mixed opinions on Provincial tournament". The Sunday Times (Sri Lanka. 26 March 2018. Archived from the original on 2018-03-27. Retrieved 2023-08-25. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  9. "All you need to know about the SL Super Provincial Tournament". Daily Sports. 26 March 2018. Archived from the original on 27 March 2018. Retrieved 27 March 2018.
  10. Weerasinghe, Damith (27 April 2018). "SLC Super Provincial 50 over tournament squads and fixtures". The Papare. Retrieved 2023-08-25.
  11. "SLC T20 League 2018 squads finalized". The Papare. 16 August 2018. Retrieved 2023-08-25.
  12. Weerasinghe, Damith (19 March 2019). "Squads, Fixtures announced for SLC Provincial 50 Overs Tournament". The Papare. Retrieved 2023-08-25.
  13. "Rain spoils Provincial Final after Thirimanne century". The Papare. 11 April 2019. Retrieved 2023-08-25.
  14. Fernando, Andrew Fidel (19 October 2020). "Chris Gayle, Andre Russell and Shahid Afridi among big names taken at LPL draft". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-25.
  15. Weerasinghe, Damith (9 August 2019). "Sri Lanka Cricket announce Invitational T20 squads and schedule". The Papare. Retrieved 2023-08-25.
  16. Balasuriya, Madushka (6 July 2022). "LPL 2022 draft: Kandy Falcons sign Hasaranga; Rajapaksa to turn out for Dambulla Giants". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-25.
  17. "Five uncapped players in SL squad for Pakistan T20s". ESPNcricinfo. ESPN Inc. 23 July 2015. Retrieved 2023-08-25.
  18. "Pakistan tour of Sri Lanka, 1st T20I: Sri Lanka v Pakistan at Colombo (RPS), Jul 30, 2015". ESPNcricinfo. ESPN Inc. 30 July 2015. Retrieved 2023-08-25.
  19. "Sri Lanka tour of England and Ireland, 1st ODI: Ireland v Sri Lanka at Dublin (Malahide), Jun 16, 2016". ESPNcricinfo. ESPN Inc. 16 June 2016. Retrieved 2023-08-25.
  20. Fernando, Andrew Fidel (21 July 2016). "Siriwardana left out of Sri Lanka squad for first Test". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-25.
  21. "Australia tour of Sri Lanka, 1st Test: Sri Lanka v Australia at Pallekele, Jul 26–30, 2016". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-25.
  22. Seervi, Bharath (26 July 2016). "Sri Lanka's shortest innings after electing to bat". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-25.
  23. "Debutant de Silva joins exclusive club". Cricket Australia. 27 July 2016. Retrieved 2023-08-25.
  24. "Six and in: Debutant's rare feat against Aussies". The Courier Mail. 26 July 2016. Retrieved 2023-08-25.

బాహ్య లింకులు

[మార్చు]