ధోని | |
---|---|
దర్శకత్వం | ప్రకాష్ రాజ్ |
స్క్రీన్ ప్లే | ప్రకాష్ రాజ్ టి. జ్ఞానవేల్ |
Dialogue by | టి. జ్ఞానవేల్ (తమిళం) మహేష్ రాజా (తెలుగు) |
దీనిపై ఆధారితం | 'శిక్షనచ్య అయిచ గో' (మరాఠీ సినిమా) [1] |
నిర్మాత | ప్రకాష్ రాజ్ |
తారాగణం | ప్రకాష్ రాజ్ ఆకాష్ పూరి రాధిక ఆప్టే |
ఛాయాగ్రహణం | కెవి గుహన్ |
కూర్పు | ప్రవీణ్ కే. ఎల్ ఎన్. బి. శ్రీకాంత్ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | డ్యూయెట్ మూవీస్ |
పంపిణీదార్లు | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ |
విడుదల తేదీ | 10 ఫిబ్రవరి 2012 |
దేశం | భారతదేశం |
భాషలు |
|
ధోని 2012లో తెలుగులో విడుదలైన సినిమా. డ్యూయెట్ మూవీస్ బ్యానర్ పై ప్రకాష్ రాజ్ నిర్మాతగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ముగ్దా గాడ్సే, ఆకాష్ పూరి, రాధిక ఆప్టే, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో 2012 ఫిబ్రవరి 10న విడుదలైంది.
సుబ్రమణ్యం (ప్రకాష్ రాజ్) ఓ మధ్యతరగతి వ్యక్తి, తన పిల్లలు కూతురు కావేరి (శ్రీతేజ), కొడుకు కార్తీక్ (ఆకాష్)లను చదివించడానికి చాలా కష్ట పడుతుంటాడు. కార్తీక్ కు మాత్రం చదువుపై ఆసక్తి ఉండదు. మహేంద్ర సింగ్ ధోనీలా గొప్ప క్రికెటర్ కావాలని కలలు కంటు పరీక్షల్లో ఫెయిల్ అవుతూ ఉంటాడు. కార్తీక్ చదువుల్లో రాణించలేకపోవడంతో అతని స్కూల్ యాజమాన్యం సుబ్రహ్మణ్యం పై ఒత్తిడి తెస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే మిగతా సినిమా కథ.[2]
అన్ని పాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశాడు.
పాట | గాయకులు |
---|---|
"చిట్టి చిట్టి అడుగా" | నరేష్ అయ్యర్, శ్రేయ ఘోషాల్ |
"మట్టిలోని చెట్టు" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం |
"ఇందాక నీ పయనం" | సుర్ముఖి రామన్ |
"గాయం తగిలి" | ఇళైయరాజా |
"ఇందాక నీ పయనం" | సత్యన్ |
{{cite news}}
: |archive-date=
requires |archive-url=
(help)
{{cite news}}
: |archive-date=
requires |archive-url=
(help)CS1 maint: numeric names: authors list (link)