2018 మార్చి 7 న నవీన్ , 2018 అహ్మద్ షా అబ్దాలీ 4-రోజుల టోర్నమెంట్‌లో కాబూల్ రీజియన్ తరపున ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేశాడు.[2]
2018 సెప్టెంబరులో, ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు మొదటి ఎడిషన్‌లో నవీన్ నంగర్హర్ జట్టులో ఎంపికయ్యాడు.[3] 2019 నవంబరులో, అతను 2019–20 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో సిల్హెట్ థండర్ కోసం ఆడేందుకు ఎంపికయ్యాడు. [4] 2020 జూలైలో, అతను 2020 కరీబియన్ ప్రీమియర్ లీగ్ కోసం గయానా అమెజాన్ వారియర్స్ జట్టులో ఎంపికయ్యాడు. [5][6] 2020 అక్టోబరులో, లంక ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ కోసం క్యాండీ టస్కర్స్ అతన్ని తీసుకుంది[7]
2021 ఫిబ్రవరిలో, ఇంగ్లండ్‌లో 2021 T20 బ్లాస్టు టోర్నమెంట్‌కు ముందు నవీన్ లీసెస్టర్‌షైర్ ఫాక్స్‌కు సంతకం చేసాడు. [8] 2021 అక్టోబరులో, ఇంగ్లాండ్‌లో 2022 వేసవికి లీసెస్టర్‌షైర్, అతని చేత రాజీనామా చేయించింది. [9] 2022 జూన్లో, వోర్సెస్టర్‌షైర్ ర్యాపిడ్స్‌తో జరిగిన T20 బ్లాస్టు మ్యాచ్‌లో, అతను తన నాలుగు ఓవర్లలో 5/11తో ట్వంటీ 20 క్రికెట్‌లో తన మొదటి ఐదు వికెట్ల పంటను సాధించాడు. [10] ఆ తర్వాతి నెలలో, అతను లంక ప్రీమియర్ లీగ్ మూడవ ఎడిషన్ కోసం కొలంబో స్టార్స్‌కు సంతకం చేశాడు. [11] 2022 డిసెంబరులో, 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతనిని కొనుగోలు చేసింది.
2019 ఆగస్టులో, 2019–20 బంగ్లాదేశ్ ముక్కోణపు సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ యొక్క ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) జట్టుకు నవీన్ ఎంపికయ్యాడు. [12][13] అతను 2019 సెప్టెంబరు 21న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరపున తన తొలి T20I ఆడాడు. [14] 2021 సెప్టెంబరులో, అతను 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు. [15]
నవీన్ 2017 డిజర్ట్ T20 ఛాలెంజ్‌లో 2017 జనవరి 19న నమీబియాపై ఆఫ్ఘనిస్తాన్ తరపున ట్వంటీ20 (T20) రంగప్రవేశం చేశాడు. [16]
2017 డిసెంబరులో నవీన్, 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. [17]
2016 సెప్టెంబరు 25న బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్తాన్ తరపున నవీన్ తన వన్డే ఇంటర్నేషనల్ రంగప్రవేశం చేశాడు [18] దానికి ముందు అతను, 2016 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టులో భాగంగా ఉన్నాడు. [19] 2016 డిసెంబరులో, అతను 2016 అండర్-19 ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు కెప్టెన్‌గా చేసాడు. [20]