నవీన్ పొలిశెట్టి | |
---|---|
జననం | 1989 డిసెంబరు 26 |
వృత్తి | నటుడు, రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 2012–ఇప్పటి వరకు |
నవీన్ పొలిశెట్టి ఒక భారతీయ నటుడు. పలు యూట్యూబ్ వీడియోలతో పాటు లఘు చిత్రాలలో నటించాడు. ఇతడి మొదటి సినిమా తెలుగులో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ.[1] ఈ సినిమా 2019లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్నది. అదే సంవత్సరం "చిచోర్" ద్వారా హిందీ సినిమాల్లోకి ప్రవేశించి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు.
అతను మౌలానా ఆజాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటి, భోపాల్) నుండి పట్టభద్రుడయ్యాక సివిల్ ఇంజనీర్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. తరువాత నాటకాలలో నటుడు అయ్యాడు. ఆ తర్వాత యూట్యూబ్ వీడియోల్లో నటించడం ద్వారా యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు పొందాడు. 2019 లో బాక్సాఫీస్ వద్ద చాలా మంచి ప్రదర్శన కనబరిచిన సినిమా "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ" లో అతను ప్రధాన పాత్ర పోషించాడు. ఆ తర్వాత చిచోర్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, శ్రద్ధా కపూర్లతో కలిసి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. [2][3][4]
సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | వివరణ |
---|---|---|---|---|
2012 | లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ | రాకేష్ | తెలుగు | ముఖ్య పాత్ర |
2013 | డి ఫర్ దోపిడీ | హరీష్ | తెలుగు | ముఖ్య పాత్ర |
2014 | నేనొక్కడినే | నవీన్ | తెలుగు | |
2019 | ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ | ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ | తెలుగు | కథానాయకుడు |
చిచ్చోర్ | అనిల్ "ఆసిడ్" దేశ్‌ముఖ్ | హిందీ | బాలీవుడ్ లో ప్రవేశం | |
2020 | జాతిరత్నాలు | శ్రీకాంత్ | తెలుగు | కథానాయకుడు |
2023 | మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి | తెలుగు | కథానాయకుడు |