నాటకప్రియ రాగము కర్ణాటక సంగీతంలో 10వ మేళకర్త రాగము.[1]
ఈ రాగం లోని స్వరాలు శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశ్రుతి ధైవతం, కైకశి నిషాధం. ఇది 46 మేళకర్త షడ్వితమర్దిని రాగానికి శుద్ధ మధ్యమ సమానము.
చాలామంది వాగ్గేయకారులు నాటకప్రియ రాగంలో కీర్తనల్ని రచించారు.
రకం | కూర్పు | స్వరకర్త | తాళం |
---|---|---|---|
కృతి | మార జననీం ఆశ్రయే | నల్లన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు | ఆది |
కృతి | ఎందుకింత కోపము | తిరువోత్తిరియూర్ త్యాగయ్యర్ | అదీ? |
కృతి | ఇది సమయము | మైసూరు వాసుదేవాచార్ | రూపక |
కృతి | గీతా వాద్య నటన | తంజావూరు శంకర అయ్యర్ | ఆది |
కృతి | పరిపాలయ మాం | డా. ఎం. బాలమురళీకృష్ణ | రూపక |
కృతి | పతువేదం పుండ నాటకప్రియనే | కళ్యాణి వరదరాజన్ | ఆది |
నాటకప్రియ రాగానికి కొన్ని జన్య రాగాలు ఉన్నవి. ఇందులో సింధుభైరవి రాగం ముఖ్యమైనది.