వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | Harleen Deol |
జట్టు సమాచారం | |
చరిత్ర | |
IZODC విజయాలు | 1 |
IZ3D విజయాలు | 1 |
IZT20 విజయాలు | 0 |
IZOD విజయాలు | 1 |
నార్త్ జోన్ (ఉత్తర మండలం) మహిళల క్రికెట్ జట్టు, ఉత్తర భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే మహిళల క్రికెట్ జట్టు. ఈ మహిళల సీనియర్ ఇంటర్ జోనల్ (అంతర మండల) జట్టు ఒక రోజు, T20 పోటీలలో ఆడుతుంది. ఇది ఉత్తర భారతదేశానికి చెందిన ఐదు జట్ల నుండి ఆటగాళ్లతో కూడిన మిశ్రమ జట్టు. అవి - ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్. ఈ జట్టును రాణి ఝాన్సీ ట్రోఫీలో ఆడటానికి 1974-75లో ఏర్పాటు చేసారు. ఈ పోటీలు పూర్తి అయ్యేవరకు అంటే 2002-03 వ సం. వరకు ఈ పోటీలు ఆడారు. వారు 2011-12లో ఒక రోజు పోటీలో పాల్గొని గెలిచారు, ఆపై 2017-18లో మూడు రోజుల పోటీలో టోర్నమెంట్ చివరి ఎడిషన్‌ను గెలుచుకున్నారు. వారు 2022–23లో ఒక రోజు ఆట ప్రారంభ ఎడిషన్‌ను గెలుచుకున్నారు.[1]
ఉత్తర మండల మహిళల క్రికెట్ జట్టు మొదటగా రాణి ఝాన్సీ ట్రోఫీ కొరకు 1974–75 సీజన్‌లో లిస్ట్ A తరపున పోటీలో ఆడింది. ఈ జట్టు పోటీలను 2002-03 సీజన్ తర్వాత రద్దు అయ్యే వరకు ఆడింది. కానీ ట్రోఫీకి సంబంధించిన పూర్తి ఫలితాలు నమోదు కాలేదు. 2007లో నార్త్ జోన్ జట్టు ఒక రోజు పోటీలో 2006-07 నుండి 2013-14 వరకు టోర్నమెంట్ లు ఆడింది.[2] 2011–12లో, నార్త్ జోన్ జట్టు తమ నాలుగు మ్యాచ్‌లలో నాలుగు విజయాలతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఈ జట్టు 2011–12లో ఒకసారి టైటిల్‌ను గెలుచుకుని సెంట్రల్ జోన్ విజయ పరంపరను అడ్డుకుంది. మిగిలిన 7 టైటిళ్లను సెంట్రల్ జోన్ జట్టు గెలుచుకుంది.[3]
2014–15 సీజన్‌లో, జోనల్ జట్లు మహిళల రెండు రోజుల పోటీలో పాల్గొన్నాయి.తరువాతి సీజన్‌లో మూడు-రోజుల పోటీలలో దక్షిణ మండల (సౌత్ జోన్) జట్టుతో జరిగిన మొదటి మ్యాచ్‌లో విజయం సాధించింది.[4][5] 2017–18లో, నార్త్ జోన్ మొదటి మూడు-రోజుల టైటిల్‌ను గెలుచుకుంది. సెంట్రల్ జోన్ జట్టు వరుసగా మూడు సార్లు గెలిచింది. నాలుగు మ్యాచ్ నుంచి రెండు సార్లు గెలిచి పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.[6]
2022–23లో, మహిళల సీనియర్ T20 జోనల్ క్రికెట్ టోర్నమెంట్[7] మొదటి ఎడిషన్‌లో ఉత్తర మండల జట్టు ఆరు జట్లలో నాల్గవ స్థానంలో నిలిచింది.[8] 2023 ఫిబ్రవరిలో, 2022–23 మహిళల సీనియర్ అంతర మండల ఒక రోజు పోటీలో ఉత్తర మండల జట్టు విజయం సాధించి వారి సముదాయంలో అగ్రస్థానంలో నిలిచింది. చివరి రోజు ఆటలో కేంద్ర మండల జట్టును 9 వికెట్ల తేడాతో ఓడించింది [9]
2022–23 సీజన్ కోసం ప్రకటించిన జట్టు ఆధారంగా. బోల్డ్‌లో ఉన్న ఆటగాళ్లకు అంతర్జాతీయ టోపీ (క్యాప్)లు ఉంటాయి.[10][11]
సీజన్ | లీగ్ స్టాండింగ్‌లు [12] | గమనికలు | ||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
P | W | L | DWF | DLF | ND | BP | Pts | Pos | ||
2014–15 | 4 | 0 | 0 | 1 | 2 | 1 | 0 | 6 | 3వ | |
2015–16 | 4 | 0 | 1 | 0 | 3 | 0 | 0 | 3 | 5వ | |
2016–17 | 4 | 1 | 0 | 0 | 3 | 0 | 0 | 9 | 3వ | |
2017–18 | 4 | 2 | 2 | 0 | 0 | 0 | 1 | 19 | 1వ | విజేతలు |
సీజన్ | లీగ్ స్టాండింగ్‌లు | గమనికలు | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|
P | W | L | T | NR | NRR | Pts | Pos | ||
2022–23 | 5 | 2 | 3 | 0 | 0 | +0.630 | 8 | 4వ |
సీజన్ | లీగ్ స్టాండింగ్‌లు | గమనికలు | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|
P | W | L | T | NR | NRR | Pts | Pos | ||
2022–23 | 5 | 5 | 0 | 0 | 0 | +1.107 | 20 | 1వ | ఛాంపియన్స్ |