నాసికాభూషిణి రాగముకర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 70వ మేళకర్త రాగము.[1][2] ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని నాసమణి అంటారు.[3]
ఈ రాగంలో వినిపించే స్వరాలు : షట్‍శృతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, చతుశృతి ధైవతం, కైశికి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 34వ మేళకర్త రాగమైన వాగధీశ్వరి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.