నిర్మల్ సైనీ | |
---|---|
జననం | నిర్మల్ కౌర్ సైనీ 1938 అక్టోబరు 8 షేఖుపుర, పంజాబ్, బ్రిటిష్ ఇండియా (present-day పంజాబ్, పాకిస్తాన్) |
మరణం | 2021 జూన్ 13 మొహాలి, భారతదేశం | (వయసు 82)
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | వాలీబాల్ క్రీడాకారిణి |
ఉద్యోగం | భారత మహిళల జాతీయ వాలీబాల్ జట్టు కెప్టెన్ |
భార్య / భర్త | |
పిల్లలు | 5; జీవ్ మిల్కా సింగ్తో సహా |
నిర్మల్ కౌర్ సైనీ (అక్టోబరు 8, 1938 - జూన్ 13, 2021) భారతీయ వాలీబాల్ క్రీడాకారిణి, భారత మహిళల జాతీయ వాలీబాల్ జట్టు కెప్టెన్. ఆమె అథ్లెట్ మిల్కా సింగ్ భార్య, జీవ్ మిల్కా సింగ్ తల్లి.[1]
ఆమె 1938 అక్టోబరు 8 న పంజాబ్ (ప్రస్తుతం పాకిస్తాన్లో భాగంగా ఉంది) లోని షేక్పురాలో జన్మించింది. స్టేట్ డిపార్ట్ మెంట్ లో స్పోర్ట్స్ ఫర్ ఉమెన్ డైరెక్టర్ గా పనిచేశారు. 1958లో పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు.[2]
నిర్మల్ సైనీ తర్వాత మిల్కా సింగ్‌ను వివాహం చేసుకున్నారు. [3] ఆమె 3 కుమార్తెలు ,1 కుమారుడు, గోల్ఫ్ క్రీడాకారుడు జీవ్ మిల్కా సింగ్ యొక్క తల్లి ,చండీగఢ్‌లో నివసించారు. 1999లో, వారు టైగర్ హిల్ యుద్ధంలో మరణించిన హవల్దార్ బిక్రమ్ సింగ్ యొక్క ఏడేళ్ల కుమారుడిని దత్తత తీసుకున్నారు. [4] [5] [6]
ఆమె కోవిడ్-19 కారణంగా 13 జూన్ 2021న మొహాలీలో మరణించింది; ఆమె భర్త ఐదు రోజుల తర్వాత వైరస్‌తో మరణించాడు. [7] [8]