Pictured Rocks National Lakeshore | |
---|---|
Location | Alger County, Michigan, USA |
Nearest city | Munising, Michigan |
Area | 73,236 ఎకరాలు (296.4 కి.మీ2) |
Established | October 15, 1966 |
Visitors | 476,888 (in 2005) |
Governing body | National Park Service |
Website | Pictured Rocks National Lakeshore |
అధికారిక పేరు | Pictured Rocks |
గుర్తించిన తేదీ | February 17, 1965 |
నేషనల్ పార్క్ షోర్ పిక్చర్డ్ రాక్స్ యునైటెడ్ స్టేట్స్ లోని మిచిగాన్ అప్పర్ పెనింసులాలో ఉన్న సుపీరియర్ లేక్ తీరంలో ఉంటాయి. సుపీరియర్ సరోవరం తీరంలో 42 మైళ్ళపొడవున అలాగే 73236 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. మునిసింగ్ (మిచిగాన్), గ్రాండ్ మరైయాస్ (మిచిగాన్) మధ్య ఉన్న గ్రాండ్ నేషనల్ పార్క్ కొండల మధ్య ఉన్న సరోవరతీరం అద్భుతమైన వర్ణరంజితమైన సహజసిద్ధమైన చిత్రాలకు నిలయంగా ఉంది. ఇక్కడ వివిధరూపాలలో సహజసిద్ధమైన శిలారూపాలు, సహజసిద్ధమైన ఆర్చీలు, జలపాతాలు, ఇసుకతిప్పలు, నదీతీరాలు ఉన్నాయి. ఈశాన్య ముంసింగ్ లోని పిక్చర్ రాక్స్ (చిత్రాల రాళ్ళు) సరోవరమట్టానికి దాదాపు 200 మీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉన్నాయి. సరోవరతీరంలోని కొండచరియలలో ఇతర చిత్రాలతో గుహలు, ఆర్చీలు, సహజసిద్ధంగా ఏర్పడిన కోటబురుజుల వంటి ఆకారాలు, మానవ రూపాలు ఉంటాయి. గ్రాండ్ ఐలాండ్ ప్రాంతంలో ప్రత్యేకంగా సంరక్షించబడుతున్న ఈరాతి చిత్రాలు పర్యాటలకు కనువిందు చేస్తుంటాయి.1966లో యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం అధికారికంగా ఈప్రాంతాన్ని పర్యాటకకేంద్రంగా గుర్తించింది. నేషనల్ పార్క్ సర్వీసెస్ వీటి సంరక్షణ నిర్వహణ బాధ్యత వహిస్తుంది. 2005లో ఈప్రాంతాన్ని 4,76,888 మంది పర్యాటకులు సందర్శించారు.
రాళ్ళలో పెద్ద ఎత్తున నిక్షిప్తమై ఉన్న ఖనిజాలకారణంగా రాళ్ళలో వర్ణాలు ఏర్పడ్డాయి. మునిసింగ్ ప్రాంతంలో ఉన్న ఈ సహజవర్ణ శిలారూపాల వయస్సు 500 సంవత్సరాలు. ఈ వర్ణరంజిత ఇసుకరాళ్ళు కాంద్రియన్ కాలంనాటివని భావిస్తున్నారు. జాకబ్స్ లోయ ఫార్మేషన్లో ఉన్న " ప్రీకాంబ్రియన్ " ఇసుకరళ్ళలో ఈ చిత్రాలు రూపొందాయి. జాకబ్లోయలోని రక్తవర్ణ శిలారూపాలు ఈ పార్కులో ఉన్న అతిపురాతన శిలాఅరూపాలని విశ్వసిస్తున్నారు. మునిసింగ్ శిలారూపాల పైన ఉన్న శిలలు ఆర్డోవిషన్ కాలానికి చెందిన ఔ ట్రైన్ ఫార్మేషన్ అని భావిస్తున్నారు. ఔ ట్రైన్ ఫార్మేషన్ కఠినంగా ఉండి ఇతర శిలాఫలకాలకు రక్షణగా ఉంది. శిలలనుండి స్రవిస్తున్న జలం కారణంగా రాళ్ళలో ఉన్న ఖనిజాలు కరగడం కారణంగా శిలలపై వివిధవర్ణ చారికలు ఏర్పడ్డాయని భావిస్తున్నారు. ఇనుము (ఎరుపు), మాంగనీస్ (నలుపు-తెలుపు), లిమోనైట్ (పసుపు-మట్టిరంగు), రాగి (రోజా-హరితవర్ణం), ఇతర వర్ణాలు ఉన్నాయి. నీరు ఆవిరికాగానే శిలలపై చారికలుగా ఏర్పడ్డాయి.[2]
సుపీరియర్ లేక్‌లో తీరంలో ఉన్న శిలాచిత్రాల ప్రాంతం పుష్కలంగా చేపలకు నిలయంగా ఉన్నా ఇసుకరాతి శిలలు సరోవతీరానికి వచ్చిపోయే పడవలు, బోట్లకు ఆపత్కారణాలుగా ఉన్నాయి. 1658లో ఫర్ వ్యాపారి పియరీ ఎస్ప్రిట్ రాడిషన్ ఈ విపత్కర తీరానికి చేరుకుని ఇక్కడ స్థానిక అమెరికన్లను గుర్తించి వారికి స్నేహపూర్వకంగా పొగాకును బహుమతిగా ఇచ్చాడు. 1800లో రోమన్ శకం కాలంలో అమెరికన్ రచయితల పరంపర ఈ శిలాచిత్రాల సందర్శన కలిగించిన అనుభూతులను వర్ణించారు. 1820లో ఈప్రాంతాన్ని దర్శించిన " హెంరీ రోవే స్కోల్క్రాఫ్ట్ " ఇక్కడి శిలాచిత్రాల సౌందర్యాన్ని ప్రశంశించాడు.[3] 1850లో కొందరు వ్యాపారవేత్తలు ఈప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రాండ్ ఐలాండ్ సిటీలో ప్రస్తుత మునిసింగ్ నగరంలో ఒక పర్యాటక రిసార్ట్ నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 1910లో లంబరింగ్ శకం ముగింపుకు వచ్చిన తరువాత ఆస్తిపన్ను చెల్లించని కారణంగా నేషనల్ లేక్ షోర్ శిలాచిత్రాల ప్రాంతంలోని అధికభూభాగం మిచిగాన్ ప్రభుత్వానికి స్వాధీనం అయింది. ఫెడరల్ ప్రభుత్వ గుర్తింపు, అత్యుత్సాహమైన సహాయం అందుకుని మిచిగాన్ రాష్ట్ర ప్రభుత్వం ఈప్రాంత అభివృద్ధికి పాటుబడింది. 1966లో కాంగ్రెస్ మిచిగాన్ అప్పర్ పెనింసులాలో ఉన్న మునిసింగ్, గ్రాండ్ మారియాస్ మధ్య ఉన్న సరోవర తీరప్రాంతానికి ప్రాబలమైన పర్యాటక అంతస్తు ఇస్తూ చట్టం రూపొందించింది.[4] ఫలితంగా ఈప్రాంతం సరక్షించబడుతూ ప్రేరణ కలిగిస్తూ, విద్య, పునరుత్సాహ ఉపయోగం, ప్రజలకు ఆహ్లాదం కలిగిచడం వంటి ప్రయోజనాలు సమకూరాయి. అమెరికా అధ్యక్షుడు " లియాండన్ జాంసన్ " అల్గర్ కౌంటీ (మిచిగాన్) అమెరికా మొదటి నేషనల్ లేక్ షోర్లో భాగం అయింది. 2009 మార్చి 30న " ఆమ్నిబస్ పబ్లిక్ లాండ్ మేనేజిమెంట్ యాక్ట్ చట్టబద్ధం చేయబడింది. చట్టం కారణంగా పిక్చర్ రాక్స్ సరక్షితప్రాంతంగా మారింది. [5] 2010లో గాయకుడు " కిడ్ రాక్ " ఆయన పాటకు అనుగుణంగా పిక్చర్ రాక్స్ దృశ్యాలను చిత్రీకరించారు.[6][7] 2014లో కర్ట్నీ కొటేవా తీసిన పిక్చర్ రాక్స్ ఛాయాచిత్రాలు కర్ట్నీ కొటేవాను గ్రాండ్ ప్రైజ్ విజేతను చేసాయి. [8][9]
సుపీరియర్ లేక్ పశ్చిమ తీరాన ఉన్న మునిసింగ్ చేరుకోవడానికి మిచిగాన్ హైవే (ఎమ్-28), మిచిగాన్ హైవే (ఎమ్-94) ప్రయాణం చేయాలి. అలాగే తూర్పుతీరంలో ఉన్న గ్రాండ్ మరియాస్ చేరుకోవడానికి మిచిగాన్ హైవే (ఎమ్-77) లో ప్రయాణం చేయాలి.పిక్చర్డ్ రాక్స్ ప్రాంతాన్ని చేరుకోవడానికి సరోవర తీరాల వెంట పేవ్డ్ హైవే ఉంది. పర్యాటకులు ఒక చివర నుండి మరొక చివరకు చేరుకోవడానికి " హెచ్- 58 మిచిగాన్ కౌంటీ హైవే " ద్వారా ప్రయాణిస్తారు. రహదారి మినరల్ కాస్టిల్ 12 మైల్ బీచ్, గ్రాండ్ సేబుల్ డ్యూంస్ వద్దకు చేరుస్తాయి. మిగిలిన సరోవరతీరం వరకు కాలినడకన చేరుకోవచ్చు. సరోవరతీరం వెంట పిక్చర్ రాక్స్ 42 మైల్ దూరం ( " నార్త్ కౌంటీ ట్రైల్ " ) విస్తరించి ఉంటాయి.[10] సరోవరంలో పిక్చర్ రాక్స్ సందర్శించడానికి దినసరి క్రూసీ సర్వీసులు ఉంటాయి." సీ కయాక్ " ద్వారా పిక్చర్ రాక్స్ సందర్శన ఉత్తమమం. ప్రమాదరకరమైన శీతల జలాలలో పిక్చర్ రాక్స్ సందర్శించడానికి ప్రైవేట్ బోట్లు లభ్యమౌతుంటాయి. కాని సరైన ఉపకరణాలు తగిన అనుభవం లేకుండా వీటిలో ప్రయాణించడం ప్రమాదకరం. సీ కయాక్ పిక్చర్ రాక్స్ సందర్శించడానికి సరోవరతీరంలో మునిసింగ్ (మిచిగాన్) హార్బరు చేరుకుని క్రూసీలో ప్రయాణం చేయాలి.[11] పలు మైళ్ళ పొడవైన సరోవర తీరంలో అనుమతి తీసుకుని " బ్యాక్ కౌంటీ కేంపింగ్ " ప్రాంతంలో కేపింగ్ అనుభవాన్ని పొందవచ్చు. శీతాకాలంలో స్నో స్కేటింగ్, స్నో షూయింగ్, స్నో బౌలింగ్, ఐస్ ఫిషింగ్ వంటి క్రీడలు చేయడానికి అవసరమైన సౌకర్యాలు లభిస్తాయి.[12]
పిక్చర్ రాక్స్ సందర్శించడానికి కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి.అవి:
పశ్చిమ తీరంలో ఉన్న మునిసింగ్ నుండి తూర్పుతీరంలో ఉన్న (గ్రాండ్ మరియాస్) :
పిక్చర్ రాక్స్ ప్రాంతంలో పలుజలపాతాలు ఉన్నాయి. ఈ జలపాతాల నుండి ప్రవహిస్తున్న జలాలు మునిసింగ్ లోని ఖనిజసమృద్ధమైన శిలలలో వర్ణరంజిత చిత్రాలు ఏర్పడడానికి కారణం అయ్యాయి. సుపీరియర్ సరోవరం తూర్పున ఉన్న తంక్వామేనన్ జలపాతాల (75 మైళ్ళు) నుండి పశ్చిమ తీరంలోని లాఫింగ్ వైట్ ఫిష్ జలపాతాల (30 మైళ్ళు) వరకు ఉన్న లైం, ఇసుకశిలలు ఉన్నాయి. పలు ట్రైల్స్‌లో పెంపుడు జంతువులకు అనుమతి లేదు.[13]
సుపీరియర్ సరోవరం తూర్పు తీరంలో ఉన్న ది గ్రాండ్ సేబుల్ డ్యూంస్ ఆకర్షణీయమైన శిలాచిత్రాలలో ఒకటి. సరోవరంలోని అలలు తీసువచ్చిన ఇసుకతో ఏర్పడిన ఇసుకమేటలివి. ఈ ఇసుకమేటల ఎత్తు సరోవరతీరానికి 275 అడుగుల ఎత్తులో ఉంది.
శీతోష్ణస్థితి డేటా - గ్రాండ్ మరియాస్, మిచిగాన్ | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
సగటు అధిక °F | 25.3 | 27.4 | 36.4 | 49.2 | 62.1 | 70.4 | 75.9 | 74.8 | 67 | 55.8 | 41.5 | 29.7 | 51.3 |
సగటు అల్ప °F | 11.2 | 10.6 | 17.9 | 29.3 | 37.9 | 45.7 | 51.9 | 52.8 | 47.1 | 38 | 28.2 | 17 | 32.3 |
సగటు వర్షపాతం inches | 2.3 | 1.4 | 1.6 | 1.6 | 2.5 | 2.9 | 2.5 | 3.2 | 3.6 | 3 | 2.6 | 2.5 | 29.8 |
సగటు హిమపాతం inches | 47.3 | 30.7 | 16 | 4.8 | 0.3 | 0.0 | 0.0 | 0.0 | 0.0 | 0.9 | 12.6 | 41.7 | 154.2 |
సగటు అధిక °C | −3.7 | −2.6 | 2.4 | 9.6 | 16.7 | 21.3 | 24.4 | 23.8 | 19 | 13.2 | 5.3 | −1.3 | 10.7 |
సగటు అల్ప °C | −11.6 | −11.9 | −7.8 | −1.5 | 3.3 | 7.6 | 11.1 | 11.6 | 8.4 | 3 | −2.1 | −8 | 0.2 |
సగటు వర్షపాతం mm | 58 | 36 | 41 | 41 | 64 | 74 | 64 | 81 | 91 | 76 | 66 | 64 | 760 |
సగటు హిమపాతం cm | 120 | 78 | 41 | 12 | 0.76 | 0.0 | 0.0 | 0.0 | 0.0 | 2.3 | 32 | 106 | 392 |
Source: [15] |
మూస:SeashoreLakes మూస:Upper Peninsula of Michigan మూస:Greatlakes మూస:Protected areas of Michigan