నేహా మర్దా | |
---|---|
జననం | కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | టెలివిజన్ నటి, డాన్సర్ |
క్రియాశీల సంవత్సరాలు | 2005-ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు |
|
జీవిత భాగస్వామి | ఆయుష్మాన్ అగర్వాల్ (m. 2012) |
పిల్లలు | 1 |
నేహా మర్దా ఒక భారతీయ టెలివిజన్ నటి.[1] ఆమె బాలికా వధు, డోలి అర్మానో కి, క్యున్ రిష్టన్ మే కట్టి బట్టి వంటి టెలివిజన్ కార్యక్రమాలతో ఆమె బాగా ప్రసిద్ధి చెందింది.[2] 2015లో ఆమె ఝలక్ దిఖ్లా జాలో పాల్గొంది.
2018 జూలై 1న, ఆమె పాట్నాలో రాయల్ ఒపేరా హౌస్ అకాడమీ (ROHA) అని పిలువబడే ఒక అకాడమీని స్థాపించింది, ఇది ప్రదర్శన కళల ఔత్సాహికులకు నృత్యం, నాటకం, గానంaలో శిక్షణను అందిస్తుంది.
నేహా మర్దా కోల్‌కతాలో రాజస్థాన్‌కు చెందిన మార్వాడీ కుటుంబంలో పెరిగింది. సోనీ టెలివిజన్ రూపొందించిన బూగీ వూగీలో పోటీదారుగా పాల్గొని 2004లో విజేతగా నిలిచింది. అలా మొదటిసారిగా గుర్తించబడిన ఆమె, పలుమార్లు ఆ షోలో భాగమైంది. ఆమె 21 సంవత్సరాల వయస్సులో ఒక ఎపిసోడ్‌కు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించింది.[3] 2005లో, ఆమె సహారా వన్ ధారావాహిక సాత్ రహేగా ఆల్వేస్‌లో ఆమె తొలిసారిగా నటించింది.[4] షో ప్రసారమైన తర్వాత ఆమె ఘర్ ఏక్ సప్నాలో శృతిగా నటించింది.
2006లో, ఆమె జీ టీవి మమతలో సిమ్రాన్ పాత్రలో కనిపించింది.[5] 2007లో, ఆమె ష్...కోయి హై(Ssshhhh...Koi Hai)లో ఎపిసోడిక్ పాత్రలో నటించింది, ఆ తర్వాత ఏక్తా కపూర్ కహే నా కహేలో మాన్విగా నటించింది.
2008లో, ఆమె జీ టీవి ఏక్ థీ రాజకుమారిలో అలీ మర్చంట్ సరసన ప్రియంవదగా ప్రధాన పాత్ర పోషించింది.[6] 2008 నుండి 2011 వరకు ఆమె పోషించిన కలర్స్ టీవి సుదీర్ఘమైన షో బాలికా వధులో గెహ్నా పాత్రకు నటిగా నేహా మర్దా మంచి పేరు తెచ్చుకుంది.[7] 2009లో, ఆమె నీల్ భట్ సరసన జో ఇష్క్ కి మర్జీ వో రబ్ కి మర్జీలో ప్రధాన పాత్ర పోషించింది.[8] 2009 నుండి 2010 వరకు, స్టార్ ప్లస్ శ్రద్ధలో ఆమె ప్రతిమ ప్రతికూల పాత్రను పోషించింది.
2010లో, ఇమాజిన్ టీవి మీతీ చూరి నంబర్ 1లో పాల్గొంది.[9] జనవరి 2011లో, ఆమె ఝలక్ దిఖ్లా జా 4లో అతిథి పోటీదారుగా కనిపించింది, అక్కడ ఆమె పోటీదారు మెయియాంగ్ చాంగ్‌తో జత చేయబడింది.[10] 2011లో, ఆమె నాచే వి విత్ సరోజ్ ఖాన్, కిచెన్ ఛాంపియన్ 4లలో పాల్గొంది.[11] ఆ తర్వాత, ఆమె ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై (2012), డెవాన్ కే దేవ్...మహాదేవ్ (2013) వంటి షోలలో నటించింది.[12]
జీ టీవీ డోలి అర్మానో కిలో మోహిత్ మాలిక్ సరసన ఉర్మిగా ప్రధాన పాత్ర పోషించిన నేహా మార్దా[13], 2015లో షో నుండి నిష్క్రమించింది, ఆమె స్థానంలో మానసి సాల్వి వచ్చింది.[14][15] అది 2015 సెప్టెంబరు 25న ముగిసింది.
సెప్టెంబరు 2015లో, డోలీ అర్మానో కి నుండి నిష్క్రమించిన తర్వాత, నేహా మార్దా దాని ఎనిమిదవ సీజన్‌లో కలర్స్ టీవి డ్యాన్స్ రియాలిటీ షో ఝలక్ దిఖ్లా జాలో పాల్గొంది.[16] ఆమె అనితా హస్సానందని, రూపల్ త్యాగిలతో కలిసి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ప్రవేశించింది.[17] ఆమె, ఆమె కొరియోగ్రాఫర్ రజిత్ దేవ్‌తో కలిసి రెండు వారాల తర్వాత ఎలిమినేట్ అయ్యారు.[18][19] 2016లో, ఆమె బాక్స్ క్రికెట్ లీగ్ 2లో పాల్గొంది, అక్కడ ఆమె కరణ్ వాహీ జట్టు 'ఢిల్లీ డ్రాగన్స్'లో చేరింది.[20] 2017లో, ఆమె తీన్ కా తడ్కా స్పెషల్ వీక్ కోసం ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 8లో అతిథి పోటీదారుగా కనిపించింది. అక్కడ ఆమె హీనా ఖాన్‌తో కలిసి ప్రదర్శన ఇచ్చింది.
2018లో, ఆమె జీ టీవి పియా అల్బెలా బెల్లా ప్లే చేస్తూ చేరింది. తర్వాత ఆమె &టీవి లాల్ ఇష్క్‌లో సర్తాజ్ గిల్ సరసన గెండా పాత్రలో కనిపించింది. 2019లో ఆమె ఖత్రా ఖత్రా ఖత్రాలో పాల్గొంది. 2020 నుండి, ఆమె జీ టీవీ క్యూన్ రిష్టన్ మే కత్తి బట్టీలో సిద్ధాంత్ వీర్ సూర్యవంశీకి జోడీగా శుభ్ర పాత్రను పోషించింది.[21][22]
అయితే, నేహా మర్దా తన వ్యక్తిగత సమస్యల కారణంగా 2021 అక్టోబరు 13న క్యూన్ రిష్టన్ మే కట్టి బట్టీని విడిచిపెట్టింది. ఆ షోలో ఆమె తన క్యారెక్టర్ శుబ్ర కూతురు పాత్రను పోషించాల్సిన షోలో మెప్పించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఆ తరువాత, డిసెంబరు 2021లో ఆ ధారావాహికను నిలిపివేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు.[23]
2012 ఫిబ్రవరి 10న, కోల్‌కతాలో, ఆమె పాట్నాకు చెందిన వ్యాపారవేత్త ఆయుష్మాన్ అగర్వాల్‌ను వివాహం చేసుకుంది,[24] ఈ దంపతులకు 2023లో కుమార్తె అనయ జన్మించింది.[25]