నేహా మహాజన్ | |
---|---|
జననం | తలేగావ్ దభడే, పూణే, మహారాష్ట్ర | 1990 ఆగస్టు 18
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2004–ప్రస్తుతం |
తల్లిదండ్రులు | పండిట్ విదుర్ మహాజన్ |
నేహా మహాజన్, మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, సినిమా నటి, మోడల్. మరాఠీ నాటకరంగంతోపాటు ప్రధానంగా మరాఠీ, హిందీ, మలయాళ సినిమాలలో నటించి ప్రసిద్ధి చెందింది.[1][2] 2012లో దీపా మెహతా దర్శకత్వం వహించిన కెనడియన్-బ్రిటీష్ ప్రొడక్షన్ మిడ్‌నైట్స్ చిల్డ్రన్‌లో ఆంగ్ల సినిమాతో ప్రవేశించింది.
2013లో మాధవ్ వాజ్ దర్శకత్వంలో వచ్చిన హామ్లెట్ (మరాఠీ నాటకం)లో నేహా మహాజన్ ఒఫెలియా పాత్ర పోషించింది.[3] ఆ తర్వాత ఆమె అజోబా (2013), ఫీస్ట్ ఆఫ్ వారణాసి (2014)లో నటించింది.[4] 2015లో వచ్చిన ది పెయింటెడ్ హౌస్ సినిమాలో విషయ పాత్రతో మాలీవుడ్ సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[5] 2019 నెట్‌ఫ్లిక్స్ సిరీస్ లీలా అనే డిస్టోపియన్ డ్రామాలో నటించింది. రోహిత్ శెట్టి తీసిన సింబా అనే యాక్షన్ సినిమాలో కూడా నటించింది. 2020లో, ఎక్స్‌ట్రాక్షన్ అనే యాక్షన్-థ్రిల్లర్ సినిమాతో హాలీవుడ్ సినిమారంగంలోకి అరంగేట్రం చేసింది.
నేహా మహాజన్ 1990 ఆగస్టు 18న మహారాష్ట్ర, పూణేలోని తలేగావ్ దభడే ప్రాంతంలో జన్మించింది.[6] సితార్ కళాకారుడు పండిట్ విదుర్ మహాజన్ కుమార్తెన నేహా, తండ్రి చేసిన సితార్ ప్రదర్శనలలో అతనితోపాటు సోలో ప్రదర్శనలో కూడా పాల్గొన్నది. మహాజన్ టెక్సాస్‌లోని ట్రింబుల్ టెక్ హైస్కూల్‌లో చదివింది. తరువాత పూణే విశ్వవిద్యాలయం నుండి ఫిలాసఫీలో మాస్టర్స్ డిగ్రీని పూర్తిచేసింది.
సంవత్సరం | పేరు | భాష | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2012 | మిడ్ నైట్ చిల్డ్రన్స్ | ఆంగ్లం | యువ నసీమ్ | |
2014 | అజోబా | మరాఠీ | ||
ఫీస్ట్ ఆఫ్ వారణాసి | హిందీ | మాయ | ||
2015 | కాఫీ అని బరచ్ కహీ | మరాఠీ | అభా | |
నీలకాంత్ మాస్టర్ | యశోద | |||
ది పెయింటెడ్ హౌస్ | మలయాళం | విషయ | ||
2016 | ఆయ్ తుజా ఆశీర్వాద్ | మరాఠీ | ||
ఫ్రెండ్స్ | ||||
యూత్ | యుతిక | |||
వన్ వే టికెట్ | ఊర్వశి | |||
2017 | తుఝా తు మఝా మి | రాజశ్రీ | ||
2018 | గావ్ | హిందీ | సాంగో | |
సింబా | కావ్య | |||
2019 | లీలా | పూజ | నెట్‌ఫ్లిక్స్ సిరీస్ | |
2020 | ఎక్స్ ట్రాక్షన్ | ఆంగ్ల | నెయ్సా | నెట్‌ఫ్లిక్స్ |
2021 | కోయి జానే నా | హిందీ | బిండియా | అమెజాన్ ప్రైమ్ |