పంగా | |
---|---|
![]() | |
దర్శకత్వం | అశ్విని అయ్యర్ తివారీ |
రచన | నిఖిల్ మెహ్రోహ్ట్రా అశ్విని అయ్యర్ తివారీ |
స్క్రీన్ ప్లే | నితీష్ తివారి |
నిర్మాత | ఫాక్స్ స్టార్ స్టూడియోస్ |
తారాగణం | కంగనా రనౌత్, జస్సీ గిల్, రిచా చద్దా, నీనా గుప్తా, పంకజ్ త్రిపాఠి |
ఛాయాగ్రహణం | జయ్ ఐ. పటేల్ |
కూర్పు | బల్లు శాలుజా |
సంగీతం | పాటలు: శంకర్-ఎహసాన్-లాయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సంచిత్ బాళ్హరా అంకిత్ బాళ్హరా |
నిర్మాణ సంస్థ | ఫాక్స్ స్టార్ స్టూడియోస్ |
పంపిణీదార్లు | ఫాక్స్ స్టార్ స్టూడియోస్ |
విడుదల తేదీ | 24 జనవరి 2020 |
సినిమా నిడివి | 131 నిమిషాలు |
దేశం | India |
భాష | Hindi |
బడ్జెట్ | 29 కోట్లు[1] |
బాక్సాఫీసు | 41.71 కోట్లు[2] |
పంగా 2020లో విడుదలైన హిందీ సినిమా. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకు అశ్విని అయ్యర్ తివారీ దర్శకత్వం వహించింది. కంగనా రనౌత్, జస్సీ గిల్, రిచా చద్దా, నీనా గుప్తా, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 24 జనవరి 2020న విడుదలైంది.[3]
జయ నిగమ్ (కంగనా రనౌత్) జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారిణి. పెళ్ళికి ముందు జాతీయ అవార్డు అందుకొని ప్రజల చేత నీరాజనాలు అందుకున్న జయ పెళ్లై, ఓ బిడ్డకు జన్మనిచ్చాక ఆమెకు గుర్తింపు కరువవుతుంది. కానీ జయకి మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఛాంపియన్‌షిప్ సాధించాలని కోరిక ఉంటుంది. ఇందుకోసం తన కుటుంబం కూడా సపోర్ట్ చేస్తుంది. దానికోసం ఆమె ఎన్ని ఇబ్బందులు పడింది? జయ అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ టైటిల్‌ను అందుకోగలిగిందా? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[4][5]