పంజాగుట్ట | |
---|---|
పంజాగుట్ట ప్లైఓవర్ | |
Coordinates: 17°26′12″N 78°26′38″E / 17.436793°N 78.443906°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
వార్డు | 5 |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికార భాష | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500082 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
పంజాగుట్ట, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఒక వాణిజ్య, నివాస ప్రాంతం.[1][2] ఇక్కడ ఐటి హబ్‌లు, వస్త్ర, గృహవసరాల, నగల దుకాణాలు ఉన్నాయి. అమీర్‌పేట, బంజారా హిల్స్, సోమాజిగూడ, ఖైరతాబాదు మొదలైన ప్రాంతాల రవాణాకు ప్రధాన రవాణా కేంద్రంగా ఉంది. ఈ జంక్షనులోవున్న జంట ఫ్లైఓవర్లు ట్రాఫిక్ నియంత్రణకు ఉపయోగపడుతున్నాయి.[3]
హైదరాబాదులోని రెండు విభిన్న ప్రాంతాలను పంజాగుట్ట కలుపుతోంది. దీనికి ఉత్తరం వైపు సికింద్రాబాదు, దక్షిణం వైపు ఓల్డ్ సిటీ ఉన్నాయి. పంజాగుట్ట పహాద్ కు వారసత్వం చరిత్ర ఉంది, ఇది కులీ కుతుబ్ షాహి కాలం నాటిది. పంజాగుట్ట అనగా చేతి పర్వతం అని అర్థం. ఇక్కడికి సమీపంలో ఇమామ్ అలీ చేతి ముద్ర ఉన్న బండరాయి ఉంది. దీన్ని మొదటగా పంజాఘుట్నా అనేవారు, తరువాతికాలంలో పంజాగుట్ట మారింది.
కుతుబ్ షాహి కాలం నాటి జనరల్ హజ్రత్ అలీకి ఈ కొండపై ప్రార్థనలు చేసినట్టు ఒక కల వచ్చింది. దాంతో అతను అక్కడకు వెళ్ళి పరిశీలించగా అతను రాతిపై ఈ అరచేతి, మోకాలి ముద్రను కనుగొన్నాడు. ఈ కొండ పైన ఉన్న ఆలం, అశుర్ఖానా కూడా 400 సంవత్సరాల క్రితం నాటివి.[4]
ద్వారకాపురి కాలనీ, ఎర్రమంజిల్, బాలపుర బస్తీ, నిమ్స్ హాస్పిటల్, పంజాగుట్ట మార్కెట్, కేశవ్ నగర్, ప్రతాప్ నగర్, సుల్తాన్-ఉల్-ఉలూమ్ కళాశాల, వద్దారా బస్తీ, జర్నలిస్ట్ కాలనీ, ఎన్‌ఎఫ్‌సిఎల్. నాగర్జున సర్కిల్ మొదలైనవి.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుండి పంజాగుట్టకు బస్సులు నడుపబడుతున్నాయి. హైదరాబాద్ మెట్రోలో భాగంగా ఇక్కడ పంజాగుట్ట మెట్రో స్టేషను ఉంది.[5]
పంజాగుట్ట జంక్షన్ అనునిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటూ, పాదచారులు రోడ్డును దాటేందుకు ఇబ్బందులు పడుతున్న సమస్యను దృష్టిలో ఉంచుకొని 5 కోట్ల రూపాయలతో హైదరాబాద్ సెంట్రల్ మాల్ వద్ద ఏర్పాటు చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి (foot over bridge) నిర్మించబడింది. 2022 మే 11న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కలిసి ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించారు.[6]
అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా పంజాగుట్ట కూడలిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహముద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కార్పోరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.[7][8]