పంజాబీ కిస్సా (షముఖి) అనేది ఒక కథచెప్పే విధానం. ఇది అరేబియా ద్వీపకల్ప దేశాలు, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మొదలైన ముస్లిం దేశాల నుండి వలస వచ్చిన ప్రజలద్వారా దక్షిణాసియా దేశాలలో ప్రవేశించింది.[1] కిస్సా ఇస్లామిక్, పర్షియన్ వారసత్వంగా ఆరంభమైంది. ఇందులో ముస్లిం ప్రజలలోని ప్రేమ, వీరం, విశ్వాసం, నీతి మొదలైన భావాలు ప్రతిఫలిస్తాయి. ఇది భారతదేశానికి చేరే సమయానికి మతసరిహద్దులు దాటి మతసామరస్య భావాలతో విస్తరుంచింది. ముస్లిం పాలనకు ముందున్న పజాబీ సంస్కృతి, జానపదాలలో కిస్సా సంప్రదాయం మిశ్రితమైంది.[1]
కిస్సా అనేది ఒక అరబిక్ పదం. కిస్సా అంటే పురాణ కావ్యం లేక జానపదగాధ అని అర్ధం. ఇది దాదాపు దక్షిణాసియా లోని అన్ని భాషల మీద ప్రభావం చూపింది. వాయవ్య, దక్షిణాసియా దేశాలలో పంజాబు, ఉర్దూ, హిందీ భాషలలో దీనిని కిస్సా అనే వ్యవహరిస్తుంటారు. కిస్సా అంటే ఆసక్తికరమైన గాథ అని అర్ధం.
పంజాబీ భాష సుసంపన్నమైన కిస్సా సాహిత్యానికి ప్రఖ్యాతిగాంచింది. వీటిలో అధికంగా ప్రేమ, ఆరాధన, వంచన, త్యాగం, సాంఘిక న్యాయం, బృహత్తర సమాజన్యాయం మీద సామాన్యుని తిరుగుబాటు ఆధారంగా ఉంటుంది. పంజాబ్ సంప్రదాయం, స్నేహం, విశ్వాసం, ప్రేమ, ఒప్పదం పంజాబీ కిస్సా సాహిత్యానికి ప్రధానవేదికగా ఉంటుంది. పంజాబీ జానపద సాహిత్యం మీద కూడా కిస్సా సాహిత్యం ప్రభావం చూపింది. దీని ప్రభావం సాహిత్యానికి లోతు, సుసంపన్నత ఇస్తుంది. ఈ సంప్రదాయాలు వంశపారంపర్యంగా వాచకం, వ్రాతరూపంలో కొనసాగుతూ ఉంది. ఇది తరచుగా పునరుద్ఘాటన చేయబడుతూ పిల్లలకు నిద్రవేళ గాథలుగా, సంగీతరూపంలో జానపద పాటలుగా ప్రాచుర్యం పొందుతూ ఉంటాయి. ఒక్కొక కిస్సా అసమానమైన రూపంలో ప్రదర్శించబడుతుంది. వచనారూప కిస్సాలు కచ్చితమైన విరుపులతో సంగీతరూపంలో గానం చేయబడుతుంటాయి. ఇవి అధికంగా ఆధునిక పంజాబీ సంగీతంలో చోటుచేసుకుంటున్నాయి. అయినప్పటికీ ఇవి తరచుగా భంగారా సగీతంగా భావించబడుతుంది. పురాతనంగా కిస్సా సంప్రదాయం నుండి వెలువడిన సాహిత్యం కొన్నిమార్లు భంగారాగా పాడబడుతూ ఉన్నాయి. పంజాబీ సాహిత్యంలో కిస్సా సాహిత్యం అత్యుత్తమమని సగర్వంగా భావించబడుతుంది. పెషావర్ లోని కిస్సా కవానీ బజార్‌లో కిస్సాకథకులు లభిస్తారు. ఇక్కడ ప్రముఖ కథకులు వినపించే కిస్సా సాహిత్యానికి పాకిస్తానీ ప్రజలు నిరాజనాలు పడుతుంటారు.
వారిస్ షాహ్ (1722–1798) కిస్సా హీర్ రంఝా (దీనిని హీర్ కిస్సా) అంటారు. ఇది చాలా ప్రాబల్యత సంతరించుకున్న కిస్సాగా గుర్తిపు పొందింది. పంజాబీ సంస్కృతిని కిస్సాల అత్యంత ప్రభావితం చేస్తూ ఉన్నాయి. కిస్సా మతనాయకులు, గురుగోబింద్ సింఘ్ లాంటి సంస్కరణవాదుల అభిమానపత్రమయ్యాయి. పలుతరాలుగా మతగురువులను, ఆధ్యాత్మిక వాదులు కిస్సాలతో ప్రేరణపొంది వీటిని భక్తిపారవశ్యస్థాయికి తీసుకువచ్చారు. గురువులు వారి సందేశాలలో కిస్సాలను ఉదహరిస్తుంటారు. సాంఘికసంస్కరణ కర్తలు కూడా దేవుని సందేశాలను యువప్రేమగాధలతో సమ్మిశ్రితం చేస్తుంటారు. ఇది పంజాబు ప్రాంతంలో సూఫీయిజం అభివృద్ధి చెందడానికి సహకరించింది. పంజాబ్ ప్రాంతంలో అత్యంత ప్రజాదరణ కలిగిన సూఫీ కవులలో బుల్లేహ్ షాహ్ (1680-1758) ప్రముఖుడు. ఆయన కలాంస్ (పద్యాలు) తరచుగా పిన్నలూ, పెద్దలూ కూడా ఒకే విధమైన గౌరవంతో దైవీక, ప్రేమైక విషయాలలో ఉదహరిస్తుంటారు. సౌత్ ఆసియన్ గాయకులు కిస్సాల ఆధారంగా సంగీత ఆల్బమ్లు తయారు చేస్తుంటారు.ఉదాహరణగా ప్రముఖ జానపద కులదీప్ మానక్, దేవ్ తారికే వాలా కిస్సాలను రచించి పాటలుగా పాడారు. సమీపకాలంలో రబ్బీ షెర్గిల్ రచించిన రబ్బిలో బుల్లాకీ జానా మైన్ కౌన్, బుల్లే షా రచించి ఆంగ్లంలో అనువదించబడిన " ఐ నో నాట్ హూ ఐయాం ", అత్యంత గుర్తింపును పొందాయి. కొన్ని సంవత్సరాల ముందు కెనడాలో నివసిస్తున్న పంజాబీగాయకుడు హరబజన్ మాన్ పీలు రచించిన మిర్జా షాహిబన్ గాథను గానం చేసాడు. మండి బహౌద్దిన్ జిల్లా (పాకిస్తాన్) వాసి డైం ఇగ్బాల్ డైం నుండి మిర్జా సాయిబన్, లైలా మజ్ను, సోహ్ని మహివాల్, బిలాల్ బిటి వంటి రచనలు వెలువడ్డాయి. డైం షాహ్ నామా కర్బలా, కంబల్ పోష్ కథనాలతో ప్రాబల్యత సాధించాడు.
పంజాబీ కిస్సాలను అధికంగా ముస్లిం కవులు వ్రాసారు. పురాతన కిస్సాలు సాధారణంగా ఉర్దూలో రచించబడ్డాయి.ఈ క్రింది జాబితాలో ప్రబలమైన కిస్సాల వివరణ ఇవ్వబడింది.