పట్టణం | |
Coordinates: 16°29′N 79°54′E / 16.48°N 79.9°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు జిల్లా |
మండలం | పిడుగురాళ్ళ మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 31.63 కి.మీ2 (12.21 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 63,103 |
• జనసాంద్రత | 2,000/కి.మీ2 (5,200/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1003 |
ప్రాంతపు కోడ్ | +91 ( 08649 ) |
పిన్(PIN) | 522 413 |
Website |
పిడుగురాళ్ల, పల్నాడు జిల్లా చెందిన పట్టణం, పిడుగురాళ్ల మండల కేంద్రం.
జిల్లా కేంద్రమైన నరసరావుపేట నుండి వాయవ్య దిశలో 35 కి.మీ దూరంలో ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లా గుంటూరు పట్టణం నుండి పిడుగురాళ్ళకు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 50,127. ఇందులో పురుషుల సంఖ్య 25,546, స్త్రీల సంఖ్య 24,581, గ్రామంలో నివాస గృహాలు 11,222 ఉన్నాయి. పట్టణ విస్తీర్ణము 3,149 హెక్టారులు.
పిడుగురాళ్ల, పలు జాతీయ రహదారుల కూడలి. జాతీయ రహదారి 167A (భారతదేశం), నార్కెట్‌పల్లి - అద్దంకి - మేదరమెట్ల రహదారి ఇక్కడ కలుస్తాయి. గుంటూరు-నడికుడి - మాచర్ల రైలు మార్గం, హైదరాబాదు - నడికుడి - గుంటూరు రైలు మార్గం ఇక్కడ కలుస్తాయి. పగిడిపల్లి -నల్లపాడు విభాగంలోకి ఈ రైలు నిలయం వస్తుంది. ఇక్కడ కొత్త పిడుగురాళ్ల జంక్షన్ నుండి నడికుడి- శ్రీకాళహస్తి మార్గంలో శావల్యాపురం వరకు 46 కి.మీ. దూరం కొత్త రైలుమార్గం పనులు పూర్తయ్యాయి.
మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల: రాష్ట్రంలోనే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో ఇది మూడవది. ఇక్కడ 1583 మంది విద్యార్థులు ఉన్నారు.[3]
పిడుగురాళ్ళలోని ఏ.బి.సి.విద్యాసంస్థల నిర్వాహకులు ఏ.కె.అయ్యంగార్‌కు సంగీతం అంటే ప్రాణం. వీరు హైదరాబాదులోని యూసఫ్‌గూడాలో ఒక రికార్డింగ్ స్టూడియో నిర్మించాడు. ఈ స్టూడియోని ప్రముఖ గాయకులు ఎస్.ప్.బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించాడు. పిడుగురాళ్ళలో బాలుగారి అనుమతితో అయ్యంగార్, "శ్రీ బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ అకాడమీ"ని రిజిస్టర్ చేయించి, తద్వారా పిల్లలకు సంగీతం, నాట్యం, సాహిత్యం, చిత్రలేఖనం నేర్పించుచున్నాడు.[4]
నగర్ పిడుగురాళ్ల ఈ దేవాలయం పిడుగురాళ్ల నుంచి అద్దంకి నార్కెట్పల్లి హైవేలో ఉన్నది ఈ దేవస్థానము
లో ప్రతి సంవత్సరం 5000 మందికి
మాలాధారణ జరుగుతుంది స్వామివారికి అభిషేకాలు ప్రత్యేకము ఈ దేవస్థానంలో నవంబరు 16 నుండి డిసెంబరు 26 వరకు భారీగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భక్తులు వేల సంఖ్యలో పాల్గొంటారు ప్రతి సంవత్సరం పడిపూజ మహోత్సవం జరుగు తేదీలు 1, జూన్15 దేవస్థానం ప్రతిష్ఠాదిన మహోత్సవం 2, నవంబరు 16 మండల కాలం ప్రారంభం 3, డిసెంబరు 26 మండల కాలంముగింపు 4, జనవరి 1 నూతన సంవత్సరం 5, జనవరి 14 మకర సంక్రాంతి, జ్యోతి ప్రజ్వలన ప్రతిరోజు మహాగణపతి హోమం జరుగుతుంది.
{{cite web}}
: Missing or empty |title=
(help)