పి.ఎస్. శ్రీధరన్ పిళ్ళై | |||
![]()
| |||
గోవా రాష్ట్ర 19వ గవర్నరు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2021 జులై 15 | |||
పదవీ కాలం 2019 నవంబరు 5 – 2021 జులై 6 | |||
ముందు | జగదీశ్ ముఖి | ||
---|---|---|---|
తరువాత | కంభంపాటి హరిబాబు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అలప్పుజ్హ , కేరళ , భారత్ | 1 డిసెంబరు 1954||
తల్లిదండ్రులు | వి.జి.సుకుమారం నాయర్ (Father) భవాని అమ్మ | ||
జీవిత భాగస్వామి |
రీటా (m. 1984) |
శ్రీధరన్ పిళ్ళై (జననం: 1954 డిసెంబరు 1) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, రచయిత. ప్రస్తుతం గోవా రాష్ట్రానికి 19వ గవర్నర్‌గా 2021 జులై 15 నుండి బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇంతకు పూర్వం మిజోరం రాష్ట్ర గవర్నర్‌గా కూడా విధులు నిర్వర్తించాడు. పలుసార్లు కేరళ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టాడు.[1]
కేరళ రాష్ట్రం అలప్పుజ జిల్లా పంచాయతీలో సుకుమారం నాయర్ భవాని అమ్మ దంపతులకు జన్మించాడు. పండలం పట్టణం నుండి ఆర్ట్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన పిళ్ళై 1978లో ప్రభుత్వ న్యాయ కళాశాల నుండి న్యాయ విద్యలో పట్టా పొందాడు.
విద్యార్థి దశలో చురుకైన కార్యకర్తగా ఉండడంవల్ల 1977లో కేరళ రాష్ట్ర అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు జనరల్ సెక్రటరీగా నియమించబడ్డాడు. కాలికట్ నాయక కళాశాలలో చదువుకునే రోజుల్లో ఒక పత్రిక సంపాదకుడిగా ఉన్న పిళ్ళై ఇందిరా గాంధీ హయాంలో అత్యవసర స్థితికి వ్యతిరేకంగా ప్రచురించిన అంశాలతో జనాదరణ పొందాడు.[2][3]
భారతీయ జనతా పార్టీ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో జనరల్ సెక్రటరీ గా పిళ్ళై తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. అతడు కళాశాలలో విద్యార్థిగా ఉన్న రోజుల్లో ఏబీవీపీ జనరల్ సెక్రటరీగా ఉండేవాడు.
ఆ తర్వాత కేరళ రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో వివిధ పదవులు నిర్వహించిన పిళ్ళై 2003 నుండి 2006 వరకు లక్షద్వీప్ ప్రభారీ అధికారిగా పనిచేశాడు.