పరేష్ చంద్ర భట్టాచార్య | |||
భారతీయ రిజర్వు బ్యాంకు 7 వ గవర్నరు
| |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జాతీయత | భారతీయుడు | ||
పూర్వ విద్యార్థి | కలకత్తా యూనివర్సిటీ | ||
వృత్తి | ప్రభుత్వ ఉద్యోగి, బ్యాంకరు |
పరేష్ చంద్ర భట్టాచార్య OBE (జననం 1903 మార్చి 1) [1] రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడవ గవర్నరు. 1962 మార్చి 1 నుండి 1967 జూన్ 30 వరకు అతను పదవిలో ఉన్నాడు.[2] అతనికి ముందరి గవర్నర్ల లాగా అతను ఇండియన్ సివిల్ సర్వీసుకు చెందినవాడు కాదు, ఇండియన్ ఆడిట్స్ అండ్ అకౌంట్స్ సర్వీస్ (IA&AS)లో సభ్యుడు. అతను 1946 న్యూ ఇయర్ ఆనర్స్‌లో ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (OBE) అధికారిగా నియమితుడయ్యాడు. గవర్నర్‌గా నియమితుడయ్యే ముందు అతను ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగాను, ఆ తరువాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ గానూ పనిచేశాడు.[2]
RBI గవర్నర్‌గా భారతదేశంలో ప్రైవేట్ బ్యాంకులను జాతీయం చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు.[3] బ్యాంకులను జాతీయం చేయడం వాంఛనీయం కాదని అప్పటి ఉప ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయికి లేఖ రాస్తూ హెచ్చరించాడు.[3] ఆయన హయాంలో ఆర్థిక కారణాల వలన 5, 10, 100 కరెన్సీ నోట్ల పరిమాణాన్ని తగ్గించారు.[4]
భట్టాచార్య పదవీకాలంలో 1964లో ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 1963లో అగ్రికల్చరల్ రీఫైనాన్స్ కార్పొరేషన్, 1964లో యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా లను స్థాపించారు.
పిసి భట్టాచార్య సంతకం చేసిన నోట్లు అరుదుగా ఉన్నందున గ్రే మార్కెట్‌లో వీటికి చాలా ఎక్కువ విలువ ఉంది. భట్టాచార్య సంతకం చేసిన 10 రూపాయల నోటు నేడు 800 నుండి 1000 రూపాయల వరకు పలుకుతోంది.[5] అతను RBI గవర్నర్‌గా ఉన్న సమయంలో, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి రూ. 5, 10, 100 డినామినేషన్‌ల బ్యాంకు నోట్ల పరిమాణాన్ని తగ్గించారు. దీని వలన కలెక్టర్ల మార్కెట్‌లో ఈ నోట్లు చాలా అరుదు.