ప్రియా టెండూల్కర్ | |
---|---|
జననం | |
మరణం | 2002 సెప్టెంబరు 19 | (వయసు 47)
జీవిత భాగస్వామి | కరణ్ రజ్దాన్ (1988-1995, విడాకులు) |
ప్రియా టెండూల్కర్ (1954 అక్టోబరు 19 - 2002 సెప్టెంబరు 19)[1] మహారాష్ట్రకి చెందిన సినిమా నటి,[2] సామాజిక కార్యకర్త. రచయిత్రి. 1985లో వచ్చిన రజనీ టివి సీరియల్ లో నటించి గుర్తింపు చెందింది.
ప్రియా టెండూల్కర్ 1954 అక్టోబరు 19న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. ప్రియా తండ్రి ప్రముఖ రచయిత, పద్మభూషణ్ అవార్డు గ్రహీత విజయ్ టెండూల్కర్.
రజనీలో తనతోపాటు నటించిన కరణ్ రజ్దాన్‌తో 1988లో ప్రియా వివాహం జరిగింది. వారు 1995లో విడిపోయారు.[3] క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కు ప్రియా అత్త.
1969లో హయవదన అనే నాటకంలో కల్పనా లాజ్మీతో కలిసి మొదటిసారిగా నటించింది.[4] తరువాత, 5 స్టార్ హోటల్‌లో హోటల్ సర్వీస్ రిసెప్షనిస్ట్‌గా, ఎయిర్ హోస్టెస్‌గా, పార్ట్ టైమ్ మోడల్‌గా వివిధ ఉద్యోగాలు చేఇఇంది. న్యూస్ రీడర్ కూడా పనిచేసింది.[5] 1974లో శ్యామ్ బెనెగల్ తీసిన అంకుర్ సినిమాలో అనంత్ నాగ్ భార్యగా నటించింది. ఆ తర్వాత, మరాఠీ చిత్రాల వైపు దృష్టిసారించి అశోక్ సరాఫ్, రవీంద్ర మహాజని, మహేష్ కొఠారే వంటి నటుల సరసన దాదాపు 12 మరాఠీ కుటంబ సాంఘీక సినిమాలలో పాత్రలు పోషించింది. అనంత్ నాగ్ సరసన మించిన ఓట అనే కన్నడ సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. 1985లో వచ్చిన రజని సీరియల్ ద్వారా జాతీయస్థాయిలో ఖ్యాతిని పొందింది. విజయ్ టెండూల్కర్[6] టివి సిరీస్, స్వయంసిద్ధలో కూడా ఒక పాత్రను పోషించింది. పూజా నా ఫూల్ అనే గుజరాతీ సినిమాలో కూడా నటించింది. హమ్ పాంచ్ టీవీ సిరీస్‌లో కూడా ఒక పాత్ర పోషించింది.
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
1974 | అంకుర్ | సారూ | |
1980 | మించిన ఓట (కన్నడ) | టోనీ భార్య | |
1981 | గోండాల్ట్ గోంధాల్ | హేమాంగి (హేమ) | |
1982 | థోర్లీ జావు | నమిత | |
1982 | మాలవర్చ ఫూల్ | ||
1982 | మై బాప్ | రీమా | |
1983 | దేవతా | అనగ్య | |
1983 | రాణినే దావ్ జింక్లా | ||
1983 | తోరాలి జాఉ | ||
1984 | మహాదాన్ | ||
1984 | ముంబైచా ఫౌజ్దార్ | మాధురీ యాదవ్ | |
1984 | మహర్చి మాన్సే | వసుధ | |
1985 | వివేక్ | ||
1985 | నసూర్ | డాక్టర్ యశోదా గోర్ | |
1986 | సస్తీ దుల్హన్ మహేంగా దుల్హా | అనురాధ/అను | |
1986 | రాత్ కే బాద్ | ||
1987 | బేసహారా | చారు (దిన్ దయాళ్ కూతురు) | |
1987 | మజల్ | డా. లలిత | |
1987 | నవరాయనే సోడ్లి | ||
1987 | నామ్ ఓ నిషాన్ | గీతా | |
1988 | సిల | ప్రియా దాస్ | |
1988 | కాల చక్రం | అంజలి ప్రధాన్ | |
1988 | ఇన్సాఫ్ కీ జంగ్ | ||
1989 | షాగున్ | ||
1994 | మోహ్రా | పూజ | |
1994 | మజా సౌభాగ్య | దుర్గా సర్లాస్కర్ | |
1995 | త్రిమూర్తి | సత్యదేవీ సింగ్ | |
1997 | గుప్త | శారదా సిన్హా (సాహిల్ తల్లి) | |
1997 | ఔర్ ప్యార్ హో గయా | శ్రీమతి మల్హోత్రా | |
1999 | ప్రేమ్ శాస్త్ర | ||
2000 | రాజా కో రాణి సే ప్యార్ హో గయా | మోహిత్ తల్లి | |
2001 | ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్ | శ్రీమతి భరద్వాజ | (చివరి చిత్రం) |
సంవత్సరం | పేరు | పాత్ర | ఛానల్ |
---|---|---|---|
1985 | రజని | రజని | దూరదర్శన్ |
1998 | అంగన్ | ||
దామిని | మృణాళిని రంగనేకర్ (సామాజిక కార్యకర్త) | ||
అస్మిత | అస్మిత | ||
1995-1999 | హమ్ పాంచ్ | ఆనంద్ మాథుర్ మొదటి భార్య | జీ టీవీ |
1996-1998 | యుగ్ | రత్న[7] | డిడి నేషనల్ |
1996 | ఇతిహాస్ | డిడి నేషనల్ | |
1996 | ఆహత్ | రాఖీ | సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ |
1999 | ప్రొఫెసర్ ప్యారేలాల్ | సజ్నీ ప్యారేలాల్ చతుర్వేది | జీ టీవీ |
రొమ్ము క్యాన్సర్ వ్యాధితో కొంతకాలం పోరాటం చేసిన ప్రియా 2002 సెప్టెంబరు 19న తన ప్రభాదేవి నివాసంలో[8] గుండెపోటుతో మరణించింది.[9]