ప్రీతి దేశాయ్ | |
---|---|
జననం | ప్రీతి దేశాయ్ |
జాతీయత | బ్రిటిష్ |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2010–ప్రస్తుతం |
ప్రీతీ దేశాయ్ ఒక బ్రిటిష్ సినిమా, టెలివిజన్ నటి, మోడల్. ఆమె మాజీ మిస్ గ్రేట్ బ్రిటన్ కూడా. ఆమె 2006లో టైటిల్ గెలుచుకున్న మొదటి భారత సంతతి మహిళగా చరిత్ర సృష్టించింది.[1]
ఆమె ప్రశంసలు పొందిన చిత్రం షోర్ ఇన్ ది సిటీ (2011)తో తొలిసారిగా నటించింది. అక్టోబరు 2012లో న్యూయార్క్ నగరంలో జరిగిన సౌత్ ఏషియన్ రైజింగ్ స్టార్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ ప్రధాన నటిగా ఎంపికైంది. 2011లో టైమ్స్ ఆఫ్ ఇండియా 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్, అలాగే, పీపుల్ మ్యాగజైన్ 50 అత్యంత అందమైన వ్యక్తుల జాబితాలోనూ ఆమె పేరు ఉంది.[2]
ప్రీతి దేశాయ్ ఇంగ్లండ్ నార్త్ యార్క్‌షైర్‌లోని మిడిల్స్‌బ్రోలో పైరోటెక్నిక్ కంపెనీని కలిగి ఉన్న హేమలత, జితేంద్ర దంపతులకు జన్మించింది.[3] ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ గుజరాతీ సంతతికి చెందినవారు. అయితే ఆమె తండ్రి కెన్యా నుండి, తల్లి ఉగాండా నుండి వచ్చారు. ఆమె సోదరి అంజిలీ దేశాయ్ గాయని, పాటల రచయిత.
ఆమె కౌల్బీ న్యూహామ్లోని సెయింట్ అగస్టిన్ ఆర్ సి ప్రైమరీ స్కూల్లో, తర్వాత నన్థోర్ప్లోని నన్థోర్ప్ సెకండరీ స్కూల్లో, మిడిల్స్‌బ్రో కాలేజీలో చదివింది.
సంవత్సరం | సినిమా | పాత్ర | గమనిక |
---|---|---|---|
2011 | షోర్ ఇన్ ది సిటీ | శాల్మిలి | న్యూయార్క్ 2012లో జరిగిన సౌత్ ఏషియన్ రైజింగ్ స్టార్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ ప్రధాన నటిగా ఎంపికైంది |
2014 | వన్ బై టూ | సమర పటేల్ | నెట్‌ఫ్లిక్స్ |
2017 | ది బ్యాచిలర్ నెక్స్ట్ డోర్ | జెన్నిఫర్ గ్రీన్ | లైఫ్ టైం |
2018 | సేవింగ్ మై బేబి | డాక్టర్ దేశాయ్ | లైఫ్ టైం |
2018 | ది వర్క్ వైఫ్ | కేటీ విలియమ్స్ | అమెజాన్ ప్రైమ్ |
2019 | వుమన్ అప్ | క్లాడియా | |
2020 | ది స్టంట్ డబుల్ | లీడింగ్ లేడీ | డైరెక్టర్ డామియన్ చాజెల్ - ఆపిల్ చేత నియమించబడింది |
2022 | ది గార్డియన్స్ ఆఫ్ జస్టిస్ | బంగారు దేవత | నెట్‌ఫ్లిక్స్ సిరీస్ |
2023-2024 | ది రూకీ | చార్లీ బ్రిస్టో | ఎబిసి స్టూడియోలు/హులు/లయన్స్‌గేట్ టీవీ |