బలుపు

బలుపు
దర్శకత్వంగోపీచంద్ మలినేని
రచనకోన వెంకట్
కె.ఎస్.రవీంద్ర
నిర్మాతవరప్రసాద్ పొట్లూరి
తారాగణంరవితేజ
శృతి హాసన్
అంజలి
ప్రకాశ్ రాజ్
బ్రహ్మానందం
ఛాయాగ్రహణంజయంత్ విన్‍సెంట్
కూర్పుగౌతంరాజు
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థ
పివిపి సినిమాస్
పంపిణీదార్లుపివిపి సినిమాస్
విడుదల తేదీ
జూన్ 2013 (2013-06)
దేశంభారత్
భాషతెలుగు

రవితేజ, శృతి హాసన్, అంజలి, ప్రకాష్ రాజ్, అశుతోష్ రాణా ముఖ్యపాత్రల్లో మలినేని గోపిచంద్ దర్శకత్వంలో పోట్లూరి వరప్రసాద్ పివిపి సినిమాస్ పతాకంపై నిర్మించిన చిత్రం బలుపు . ఎస్. ఎస్. థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా జూన్ 28, 2013న విడుదలై ఘన విజయాన్ని సాధించింది.

రవి (రవితేజ) బెంగుళూరులో ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంకులో కలెక్షన్ ఏజెంట్ ఉద్యోగం చేస్తూ హాయిగా కాలాన్ని వెళ్ళదీస్తుంటాడు. తన తండ్రి మోహన్ రావు (ప్రకాష్ రాజ్) రవికి ఎలాగైనా పెళ్ళి చేయాలని ఆశపడుతుంటాడు. ఇంతలో తన స్నేహితుడు ('సత్యం' రాజేష్) నెయిల్ పాలిష్ తాగి ఆత్మహత్యాయత్నం చేసాడని తెలుసుకుని హాస్పిటలుకి వెళ్ళి జరిగినదాని గురించి అడుగుతాడు. అప్పుడు తను శృతి (శృతి హాసన్), తన మావయ్య క్రేజీ మోహన్ (బ్రహ్మానందం) గురించి చెప్తాడు. శృతి, క్రేజీ మోహన్ అమాయకులైన బ్రహ్మచారులను శృతి తనతో ప్రేమలో పడిందని భావం కల్పించి, ఆశలు రేకెత్తించి, పూర్తిగా వాడుకుని వదిలేసే స్వభావం కలవాళ్ళని తెలుసుకున్న రవి వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకుంటాడు.

అందరి యువకుల్లాగే వారిద్దరి ముందుకు వచ్చిన రవి వారిద్దరికీ నరకం చూపిస్తుంటాడు. క్రేజీ మోహన్ ఎన్ని ప్లానులు వేసినా రవి ముందు ఎప్పుడూ ఓడిపోతుంటాడు. తన ప్లానులలో భాగంగా శృతిని తనని పెళ్ళి చేసుకోమని అడగమని చెప్తాడు. ఇంతలోనే రవి తనని పెళ్ళి చేసుకోమని అడిగి మళ్ళీ వీళ్ళ ప్లానులని చెడగొడతాడు. మోహన్ రావు దగ్గరకి వెళ్ళి మీ అబ్బాయి నన్ను ప్రేమించాడని, పెళ్ళి చేసుకుంటానన్నాడని శృతి, క్రేజీ మోహన్ చెప్తారు. రవిని మందలిస్తాడని అనుకుంటే మోహన్ రావు మరింత సంతోషంతో మీ ఇంటికి వచ్చి పెళ్ళి గురించి మాట్లాడతానని అంటాడు. శృతి పెళ్ళి అప్పటికే రోహిత్ (అడవి శేష్) అనే కుర్రాడితో కుదురుస్తాడు తన తండ్రి (నాజర్). తనని రౌడీలనుంచి కాపాడి, ఇదంత తన నాటకమని చెప్పి, ఇంకెప్పుడూ ఇలా అందరితో ఆడుకోవద్దని రవి చెప్పి వెళ్ళిపోయాక శృతి రవితో ప్రేమలో పడుతుంది. ఇదే విషయం శృతి రోహిత్ తల్లిదండ్రులు, మోహన్ రావు ఉండగానే తన తండ్రికి చెప్తుంది.

పెళ్ళి కుదిరిందని తెలిసి మోహన్ రావు వినయంగా నిర్ణయాన్ని శృతి తండ్రికి వదిలివెళ్ళడమే కాకుండా తన కొడుకు నుంచి ఎలాంటి ఆపదను కలగనివ్వనని హామీ ఇచ్చి వెళ్తే రోహిత్ తల్లి (సన) పెళ్ళయాక శృతిని పీడించి బాధపెట్టి ఇంట్లో కూర్చోబెడతానని చెప్తుంది. మోహన్ రావు పద్ధతి నచ్చి రవితో శృతి పెళ్ళిని ఖాయం చేస్తాడు శృతి తండ్రి. కోపంతో రగులుతున్న రోహిత్ తల్లి తన అన్నయ్య పూర్ణ (అశుతోష్ రాణా)కి ఫోన్ చేస్తుంది. పెళ్ళి జరిగే సమయానికి తన మనుషులతో వచ్చిన పూర్ణ అక్కడ తండ్రి కొడుకులుగా ఉన్న రవి-మోహన్ రావులు తన ప్రాణ శత్రువులైన శంకర్-నానాజీ లని తెలుసుకుంటాడు. తన వాళ్ళని శంకర్ కొడుతున్నప్పుడు పూర్ణ నానాజీని కత్తితో గాయపరిచి శృతిని తీస్కుని వైజాగుకు వెళ్ళిపోతాడు. హాస్పిటల్లో నానాజీని చేర్చాక శంకర్ తన గతాన్ని తన స్నేహితులతో చెప్పుకుంటాడు.

వైజాగులో పెద్ద రౌడీ షీటరుగా తన ప్రస్థానాన్ని సాగిస్తున్న నానాజీకి పూర్ణ ఎదురీదాలనుకున్న వేళలో కంచర్లపాలెం శంకర్ అనే మరో రౌడీ షీటరుతో కలిసి పూర్ణ తన రెక్కలను విస్తరిస్తాడు. శంకర్ తన దూకుడితో నానాజీ సామ్రాజ్యాన్ని కూలదోస్తుంటాడు. ఇంతలో ఆమె నానాజీ కూతురని తెలియక అంజలి (అంజలి) అనే డాక్టరుని ప్రేమించి తన ప్రేమను పొందుతాడు. పూర్ణ పెద్దకొడుకు బాబ్జి (అజయ్) అంజలి తనకి దక్కదని తెలిసి యాసిడ్ పోయాలని తన వెంట పడుతున్నప్పుడు నానాజీ అంజలిని కాపాడి బాబ్జిని చంపేస్తాడు. అక్కడే ఉన్న శంకర్ ఒక రౌడీ అని, తన తండ్రి శత్రువని తెలుసుకుంటుంది అంజలి. అంజలి నానాజీ, శంకర్ ఇద్దరినీ రౌడీయిజం మానేయమని అడుగుతుంది. శంకర్ అన్ని వదిలేస్తాడు కానీ నానాజీ వదలలేకపోతాడు. ఇంతలో తన చిన్న కొడుకు కాశి (షఫి) సలహా మేరన పూర్ణ నానాజీతో అంజలి శంకర్ ఇద్దరూ కలిసి పారిపోతున్నారని చెప్తాడు. సింహాచలం దగ్గర శంకర్ నానాజీ మనుషులతో గొడవపడుతున్నప్పుడు కాశి అంజలిని గన్నుతో కాల్చేస్తాడు. అదే సమయానికి శంకర్ కాశిని చంపి అంజలిని హాస్పిటల్లో చేరుస్తాడు. చావుబ్రతుకుల్లో ఉన్న అంజలికి శంకర్, నానాజీలు తామిద్దరూ రౌడీయిజం మానేసి కొతా జీవితం మొదలుపెడతామని మాటిస్తారు.

ఇచ్చిన మాట ప్రకారం బెంగళూరులో తండ్రి కొడుకులుగా వారిద్దరూ బ్రతుకుతున్నారని, ఇంతలోనే పూర్ణ తన తండ్రి పై దాడి చేశడని చెప్తాడు శంకర్. ఇంతలో శృతి తండ్రి ద్వారా శృతికి రోహిత్ ని ఇచ్చి బలవంతంగా పెళ్ళి జరిపిస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్ళిన శంకర్ కాశి ఆత్మ తనలో ఉందనీ, అది శంకర్-నానాజీల చావు కోరుకుంటోందని చెప్పి అందరిని నమ్మిస్తాడు. శృతి, అంజలి స్నేహితుడు డాక్టర్ సావిత్రి (ఆలీ), తన వాళ్ళ సహాయంతో శంకర్ రోహిత్ ని కిడ్నాప్ చేయిస్తాడు. చివరగా శృతిని తీసుకుని పూర్ణ, రోహిత్ ని తీసుకుని నానాజీ అక్కడికి చేరుకుంటారు. శంకర్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టి పూర్ణని ఓడించి ప్రాణాలతో వదిలిపెట్టి శృతిని పెళ్ళిచేసుకోవడంతో కథ సుఖాంతమౌతుంది.

నటవర్గం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

సంగీతం

[మార్చు]
క్రమసంఖ్య పేరుగీత రచనగాయకులు నిడివి
1. "కాజల్ చెల్లివా"  భాస్కరభట్ల రవికుమార్రవితేజ, తమన్ 3:54
2. "ఏవైందో"  సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, గీతా మాధురి 4:03
3. "లక్కీ లక్కీ రాయ్"  భాస్కరభట్ల రవికుమార్నవీన్ మాధవ్, ఎం. ఎం. మానసి 3:52
4. "పడిపోయానిలా"  అనంత శ్రీరామ్సుచిత్ సురేశన్, మేఘ 3:07
5. "పాతికేళ్ళ చిన్నది"  భాస్కరభట్ల రవికుమార్మికా సింగ్, రాణినారెడ్డి 4:00
17:56