వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | బవనక పరమేశ్వర్ సందీప్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | హైదరాబాదు, తెలంగాణ | 1992 ఏప్రిల్ 25||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఆర్థోడాక్స్ స్పిన్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010-ప్రస్తుతం | హైదరాబాదు క్రికెట్ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 6 మే 2020 |
బవనక పరమేశ్వర్ సందీప్, తెలంగాణకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఫస్ట్-క్లాస్ క్రికెటర్ గా హైదరాబాద్ క్రికెట్ జట్టు తరపున ఆడుతున్నాడు.[1] 2017-18 రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరపున నాలుగు మ్యాచ్‌లలో 400 పరుగులు చేసి, అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.[2]
2018 జూలైలో 2018-19 దులీప్ ట్రోఫీ కోసం ఇండియా రెడ్ జట్టులో ఎంపికయ్యాడు.[3] 2018 నవంబరులో, 2018-19 రంజీ ట్రోఫీలో కేరళ క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ తరపున బ్యాటింగ్ చేస్తూ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తన 3,000వ పరుగును సాధించాడు.[4]
సందీప్ 1992 ఏప్రిల్ 25న తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులో జన్మించాడు.
రంజీ ట్రోఫీ ప్లేట్ లీగ్ లో భాగంగా 2010, నవంబరు 10 నుండి 13 వరకు రాంచీలో జార్ఖాండ్ క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు. ఆ మ్యాచ్ లో 232 బంతుల్లో 144 పరుగులు చేశాడు.[5] ఫస్ట్-క్లాస్ క్రికెట్ లో 203 పరుగుల వ్యక్తిగత అత్యధిక స్కోర్ తో నాటౌట్ గా నిలిచాడు.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా 2011, ఫిబ్రవరి 11న పాలక్కడ్ లో ఆంధ్ర క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో లిస్టు-ఎ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు.[6] లిప్టు-ఎ క్రికెట్ లో 96 పరుగుల వ్యక్తిగత అత్యధిక స్కోర్ సాధించాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా 2013, మార్చి 17న షిమోగాలో కేరళ క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో ట్వంటీ20 క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు.[7] ట్వంటీ20 క్రికెట్ లో 74 పరుగుల వ్యక్తిగత అత్యధిక స్కోర్ తో నాటౌట్ గా నిలిచాడు.
{{cite news}}
: Check date values in: |date=
(help)